త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

NEET Student | మ‌రో నీట్ విద్యార్థిని ఆత్మ‌హ‌త్య‌

NEET Student | మ‌రో నీట్ విద్యార్థిని ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డింది. నీట్‌లో మెరిట్ ర్యాంకు రాలేద‌ని తీవ్ర మ‌న‌స్తాపానికి గురైన ఆమె గ‌డ్డి మందు తాగి చ‌నిపోయింది.

S

Telangana | Published On Jul 29, 2026, 4.23 pm IST

NEET Student | మ‌రో నీట్ విద్యార్థిని ఆత్మ‌హ‌త్య‌
Advertisement

NEET Student | త్రినేత్ర‌.న్యూస్ : మ‌రో నీట్ విద్యార్థిని ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డింది. భూపాలప‌ల్లి జిల్లా ప‌లిమెల మండ‌లం పంకెన‌కు చెందిన వైష్ణ‌వి నీట్ ఎగ్జామ్ రాసింది. కానీ నీట్‌లో మెరిట్ ర్యాంకు రాలేద‌ని తీవ్ర మ‌న‌స్తాపానికి గురైన ఆమె గ‌డ్డి మందు తాగింది. దాంతో అప‌స్మార‌క స్థితిలోకి వెళ్లిన బిడ్డ‌ను త‌ల్లిదండ్రులు నిమ్స్ ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. చికిత్స పొందుతూ వైష్ణ‌వి ప్రాణాలు కోల్పోయింది. నీట్ పరీక్షలో తక్కువ మార్కులు రావడంతో మనస్తాపానికి గురై త‌న బిడ్డ ఆత్మ‌హ‌త్య చేసుకుంద‌ని తండ్రి రాజయ్య బోరున విల‌పించారు.

Advertisement
Advertisement