త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

MLA Sudheer Reddy | రియ‌ల్ ఎస్టేట్ కుదేలుకు హైడ్రానే కార‌ణం

MLA Sudheer Reddy | హైద‌రాబాద్ న‌గ‌రంలో రియ‌ల్ ఎస్టేట్ కుదేల‌వ‌డానికి హైడ్రానే కార‌ణ‌మ‌ని బీఆర్ఎస్ ఎమ్మెల్యే దేవీరెడ్డి సుధీర్ రెడ్డి మండిప‌డ్డారు. హైడ్రా పేరుతో పెద్దల భూములు రక్షించుకుంటూ.. పేదల ఇండ్లు కూలగొడుతూ ఎంతో మందిని రోడ్డున పడేశారని నిప్పులు చెరిగారు.

S

Hyderabad | Published On Jul 29, 2026, 3.59 pm IST

MLA Sudheer Reddy | రియ‌ల్ ఎస్టేట్ కుదేలుకు హైడ్రానే కార‌ణం
Advertisement

MLA Sudheer Reddy | త్రినేత్ర‌.న్యూస్ : హైద‌రాబాద్ న‌గ‌రంలో రియ‌ల్ ఎస్టేట్ కుదేల‌వ‌డానికి హైడ్రానే కార‌ణ‌మ‌ని బీఆర్ఎస్ ఎమ్మెల్యే దేవీరెడ్డి సుధీర్ రెడ్డి మండిప‌డ్డారు. హైడ్రా పేరుతో పెద్దల భూములు రక్షించుకుంటూ.. పేదల ఇండ్లు కూలగొడుతూ ఎంతో మందిని రోడ్డున పడేశారని నిప్పులు చెరిగారు. తెలంగాణ భ‌వ‌న్‌లో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి బుధ‌వారం మీడియాతో మాట్లాడారు.

కాంగ్రెస్ మంత్రులు, రేవంత్ అనుచరుల ఫామ్‌హౌస్‌లను కనీసం కూడా హైడ్రా ముట్టుకోవడం లేదు. 63 సార్లు న్యాయస్థాన ఉత్తర్వులను ధిక్కరించిన కమిషనర్ రంగనాథ్‌ను తక్షణమే తొలగించాలని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. కోర్టు తీర్పునే సవాల్ చేస్తూ... "కబ్జాకోరులు కేసులు" వేశారంటూ అహంకారంతో వ్యవహరించిన రంగనాథ్‌పై హైకోర్టు సుమోటోగా కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలను డిమాండ్ చేస్తున్నామ‌ని ఆయ‌న పేర్కొన్నారు.

లక్షల కోట్ల ఆస్తులు కాపాడినట్లు రంగనాథ్ చెప్తున్నారు... అది కేవలం ప్రజలను మభ్యపెట్టడం మాత్రమే. దుర్గం చెరువు వద్ద ఉన్న నెక్టార్ గార్డెన్స్, ఫాతిమా కాలేజ్ లాంటి వాటి జోలికి హైడ్రా ఎందుకు వెళ్లడం లేదు. హిమాయత్ సాగర్, గండిపేట ఎఫ్టీఎల్‌లో ఉన్న ఇండ్ల వద్దకు హైడ్రా ఎందుకు వెళ్లడం లేదు? కేవలం బ్లాక్ మెయిలింగ్ కోసం సాధనంగా వాడుకోవాలని చూడడం సబబు కాదు. సీఎం, మంత్రులు అబద్ధాలు మాని పరిపాలనపై దృష్టి సారించాలి. నిత్యం కేసీఆర్, బీఆర్ఎస్ గురించే ఆలోచిస్తుండడం వళ్ల వారికి నిద్ర కూడా రావడం లేదు. పాలన చేయకుండా నిత్యం కేసీఆర్‌ను తిట్టుకుంటూ ఎన్నాళ్లు పబ్బం గడుపుతారు? హైడ్రాను బూచిగా చూపి కూల్చకుండా సెటిల్‌మెంట్లు చేసిన ఉదంతాలు బయటకు రావడం లేదు అని సుధీర్ రెడ్డి తెలిపారు.

Advertisement
Advertisement