DGCA on Air Fare | దేశీయ విమాన ఛార్జీలకు రెక్కలు.. 72 మార్గాల్లో ఏడాదిలో 20.5 శాతం పెరుగుదల..
DGCA on Air Fare | దేశీయ విమాన ప్రయాణం మరింత భారంగా మారింది. దేశంలోని 72 దేశీయ విమాన మార్గాల్లో సగటు విమాన ఛార్జీలు ఏడాదిలో 20.5 శాతం పెరిగినట్లు కేంద్ర ప్రభుత్వం రాజ్యసభకు తెలిపింది. 2025 మేతో పోలిస్తే 2026 జూన్‌లో ఈ టికెట్ల ధరలు పెరిగాయని కేంద్ర పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి మురళీధర్ మొహోల్ లిఖితపూర్వక సమాధానంలో వెల్లడించారు.
DGCA on Air Fare | దేశీయ విమాన ప్రయాణం మరింత భారంగా మారింది. దేశంలోని 72 దేశీయ విమాన మార్గాల్లో సగటు విమాన ఛార్జీలు ఏడాదిలో 20.5 శాతం పెరిగినట్లు కేంద్ర ప్రభుత్వం రాజ్యసభకు తెలిపింది. 2025 మేతో పోలిస్తే 2026 జూన్‌లో ఈ టికెట్ల ధరలు పెరిగాయని కేంద్ర పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి మురళీధర్ మొహోల్ లిఖితపూర్వక సమాధానంలో వెల్లడించారు. విమానయాన సంస్థల నిర్వహణ వ్యయాలు మారుతూ వస్తుండడమే ఛార్జీల పెరుగుదలకు ప్రధాన కారణమని మంత్రి వివరించారు. అంతర్జాతీయ మార్కెట్‌లో ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ (ఏటీఎఫ్) ధరలు, విదేశీ మారకపు విలువల్లో హెచ్చుతగ్గులు, ఎక్సైజ్ సుంకం, వ్యాట్, విమానాల లీజు అద్దెల పెరుగుదల నిర్వహణ వ్యయాన్ని ప్రభావితం చేస్తున్నాయని తెలిపారు.
మొత్తం నిర్వహణ వ్యయంలో ఏటీఎఫ్ ఖర్చే 35 నుంచి 40 శాతం వరకు ఉంటుందని పేర్కొన్నారు. విమాన ఛార్జీలను ప్రభుత్వం నియంత్రించదని, 1937 ఎయిర్‌క్రాఫ్ట్ రూల్స్‌లోని రూల్–135 ప్రకారం నిర్వహణ వ్యయం, సేవల స్వభావం, లాభదాయకత వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని ఆయా విమానయాన సంస్థలే టికెట్ ధరలను నిర్ణయిస్తాయని మంత్రి స్పష్టం చేశారు. ఛార్జీల పెరుగుదలతో ప్రయాణికులపై అదనపు భారం పడనుండగా.. పండుగలు, సెలవుల సీజన్‌లో టికెట్ ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. అయితే ఛార్జీలు పెరిగిన 72 మార్గాల వివరాలను మాత్రం ప్రభుత్వం వెల్లడించలేదు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

TPCC | తెలంగాణ కాంగ్రెస్ సంస్థాగత పనితీరుపై కేసీ వేణుగోపాల్ సమీక్ష
జులై 27, 2026

E20 Petrol Row | డీప్‌ఫేక్‌లపై మెటా, గూగుల్‌పై న్యాయపోరాటం.. బాంబే హైకోర్టును ఆశ్రయించిన కేంద్రమంత్రి..
జులై 27, 2026

CWG 2026 | తృటిలో చేజారిన స్వర్ణం.. కామన్వెల్త్లో మెరిసిన సిల్వర్‌తో మెరిసిన జ్ఞానేశ్వరి..
జులై 27, 2026
తాజావార్తలు
- ●RBI Plastic Notes | త్వరలో మీ జేబుల్లోకి రూ.10, రూ.20 ప్లాస్టిక్ నోట్లు.. మరి పాత కాగితం నోట్ల పరిస్థితేంటి?
- ●Shalini Pandey | రెడ్ డ్రెస్‌లో అర్జున్ రెడ్డి హీరోయిన్ గ్లామర్ షో
- ●Ram Charan | రామ్‌చరణ్ హెల్త్ అప్డేట్ - సర్జరీ కోసం అమెరికా నుంచి స్పెషల్ డాక్టర్
- ●TPCC | తెలంగాణ కాంగ్రెస్ సంస్థాగత పనితీరుపై కేసీ వేణుగోపాల్ సమీక్ష
- ●E20 Petrol Row | డీప్‌ఫేక్‌లపై మెటా, గూగుల్‌పై న్యాయపోరాటం.. బాంబే హైకోర్టును ఆశ్రయించిన కేంద్రమంత్రి..
- ●CWG 2026 | తృటిలో చేజారిన స్వర్ణం.. కామన్వెల్త్లో మెరిసిన సిల్వర్‌తో మెరిసిన జ్ఞానేశ్వరి..

RBI Plastic Notes | త్వరలో మీ జేబుల్లోకి రూ.10, రూ.20 ప్లాస్టిక్ నోట్లు.. మరి పాత కాగితం నోట్ల పరిస్థితేంటి?

Shalini Pandey | రెడ్ డ్రెస్‌లో అర్జున్ రెడ్డి హీరోయిన్ గ్లామర్ షో

Ram Charan | రామ్‌చరణ్ హెల్త్ అప్డేట్ - సర్జరీ కోసం అమెరికా నుంచి స్పెషల్ డాక్టర్

TPCC | తెలంగాణ కాంగ్రెస్ సంస్థాగత పనితీరుపై కేసీ వేణుగోపాల్ సమీక్ష



