త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Rajya Sabha elections | జూన్ 18న రాజ్య‌స‌భ ఎన్నిక‌లు.. షెడ్యూల్ విడుద‌ల చేసిన ఈసీ

Rajya Sabha elections | ప‌ది రాష్ట్రాల్లోని 24 రాజ్య‌స‌భ స్థానాల‌కు ఎన్నిక‌ల షెడ్యూల్ విడుద‌లైంది. జూన్ 18న ఎన్నిలు నిర్వ‌హించ‌నున్న‌ట్లు ఎల‌క్ష‌న్ క‌మిష‌న్ తెలిపింది. నామినేషన్ల ఉపసంహరణకు జూన్‌ 11 వరకు గడువు తేదీగా ఈసీ ప్రకటించింది.

S

National | Published On May 22, 2026, 11.43 am IST

Rajya Sabha elections | జూన్ 18న రాజ్య‌స‌భ ఎన్నిక‌లు.. షెడ్యూల్ విడుద‌ల చేసిన ఈసీ
Advertisement

Rajya Sabha elections | త్రినేత్ర‌.న్యూస్‌: ప‌ది రాష్ట్రాల్లోని 24 రాజ్య‌స‌భ స్థానాల‌కు ఎన్నిక‌ల షెడ్యూల్ విడుద‌లైంది. జూన్ 18న ఎన్నిలు నిర్వ‌హించ‌నున్న‌ట్లు ఎల‌క్ష‌న్ క‌మిష‌న్ తెలిపింది. జూన్ 1న నోటిఫికేష‌న్ విడుద‌ల చేయ‌నున్న‌ట్లు పేర్కొంది. నామినేష‌న్లు స‌మ‌ర్పించేందుకు జూన్ 8 చివ‌రి తేదీ కాగా 9న వ‌చ్చిన నామినేష‌న్ల‌ను ప‌రిశీలించ‌నున్న‌ట్లు వెల్ల‌డించింది. నామినేషన్ల ఉపసంహరణకు జూన్‌ 11 వరకు గడువు తేదీగా ఈసీ ప్రకటించింది.

జూన్‌, జులైలో 24 మంది రాజ్యసభ సభ్యుల పదవీకాలం ముగియనున్న‌ నేపథ్యంలో ఈ ఎన్నికల షెడ్యూల్‌ విడుదలైంది. ఎన్నికలు ముగిసిన రోజునే సాయంత్రం 5 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభ‌మ‌వుతుంది. జూన్‌ 20 నాటికి మొత్తం ఎన్నికల ప్రక్రియ ముగియనుంది. ఏపీలోని నాలుగు స్థానాలకు జూన్‌ 18న ఎన్నికలు జరగనున్నాయి.

Advertisement
Advertisement