త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

FIFA WC 2026 | నేవెస్ కామెంట్స్‌తో రాజుకున్న వివాదం.. సోషల్ మీడియాలో రొనాల్డో అభిమానుల ఆగ్రహం

FIFA WC 2026 | ఫిఫా ప్రపంచకప్-2026లో డీఆర్ కాంగోతో జరిగిన మ్యాచ్‌ను పోర్చుగల్ 1-1 తేడాతో డ్రా చేసుకుంది. మైదానంలో జరిగిన పోరాటం కంటే.. మ్యాచ్‌ తర్వాత వచ్చిన కామెంట్స్‌ సర్వత్రా చర్చనీయాంశంగా మారాయి. పోర్చుగల్ యువ ఆటగాడు జావో నేవెస్ కెప్టెన్ క్రిస్టియానో రోనాల్డోపై చేసిన వ్యాఖ్యలతో సోషల్ మీడియాలో దుమారం రేగింది.

P

Sports | Published On Jun 20, 2026, 10.08 am IST

FIFA WC 2026 | నేవెస్ కామెంట్స్‌తో రాజుకున్న వివాదం.. సోషల్ మీడియాలో రొనాల్డో అభిమానుల ఆగ్రహం
Advertisement

FIFA WC 2026 | ఫిఫా ప్రపంచకప్-2026లో డీఆర్ కాంగోతో జరిగిన మ్యాచ్‌ను పోర్చుగల్ 1-1 తేడాతో డ్రా చేసుకుంది. మైదానంలో జరిగిన పోరాటం కంటే.. మ్యాచ్‌ తర్వాత వచ్చిన కామెంట్స్‌ సర్వత్రా చర్చనీయాంశంగా మారాయి. పోర్చుగల్ యువ ఆటగాడు జావో నేవెస్ కెప్టెన్ క్రిస్టియానో రోనాల్డోపై చేసిన వ్యాఖ్యలతో సోషల్ మీడియాలో దుమారం రేగింది. కొంతమంది అభిమానులు వాటిని రోనాల్డోకు అవమానంగా భావించగా.. జట్టు యాజమాన్యం మాత్రం ఆ వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారంటూ వాదిస్తోంది. డీఆర్ కాంగోపై జరిగిన ఈ మ్యాచ్‌లో పోర్చుగల్‌కు ఆరంభంలోనే ఊపు తీసుకొచ్చింది జావో నేవెస్. కేవలం 6వ నిమిషంలోనే పెడ్రో నెటో ఇచ్చిన అద్భుత క్రాస్‌ను అందుకుని అందమైన హెడ్డర్‌తో గోల్ చేసి జట్టుకు ఆధిక్యం అందించాడు. 21 ఏళ్ల ఈ యువ మిడ్‌ఫీల్డర్‌కు ఇది అంతర్జాతీయ కెరీర్‌లో నాలుగో గోల్. ఫిఫా వరల్డ్‌కప్ చరిత్రలో గోల్ చేసిన మూడవ అత్యంత పిన్న వయసు పోర్చుగీస్ ఆటగాడిగా ఘనత సాధించాడు.

ఈ జాబితాలో అతని కంటే ముందుగా ఉన్నది కేవలం క్రిస్టియానో రోనాల్డో, గొన్సాలో రామోస్ మాత్రమే. ప్రారంభంలో గోల్‌తో ఆధిక్యంలోకి వెళ్లినప్పటికీ పోర్చుగల్ విజయాన్ని నిలబెట్టుకోలేకపోయింది. డీఆర్ కాంగో తరఫున యోయానే విస్సా గోల్ చేసి మ్యాచ్‌ను 1-1తో సమం చేశాడు. టోర్నీని విజయంతో ప్రారంభించాలని భావించిన పోర్చుగల్‌కు ఈ ఫలితం తీవ్ర నిరాశ కలిగించింది. అయితే, అండర్‌డాగ్‌గా బరిలోకి దిగిన డీఆర్ కాంగోకు ఇది విలువైన పాయింట్‌గా మారింది. మ్యాచ్ తర్వాత రోనాల్డో పాత్రపై వచ్చిన ఓ ప్రశ్నకు జావో నేవెస్ ఇచ్చిన సమాధానంతో రచ్చ మొదైలంది. ‘క్రిస్టియానో రోనాల్డో జట్టుకు, దేశానికి, ఫుట్‌బాల్‌కు చేసిన సేవలు మాకు తెలుసు. ప్రస్తుతం ఆయన కూడా ఒక ఆటగాడే. మిగతా ఆటగాళ్లతో సమానంగానే జట్టుకు సహాయం చేస్తున్నారు’ అంటూ నేవెస్ వ్యాఖ్యానించాడు. ఈ వ్యాఖ్యల్లోని ‘కేవలం ఒక ఆటగాడు’ అన్న పదం సోషల్ మీడియాలో రగడకు కారణమైంది. లక్షలాది మంది రోనాల్డో అభిమానులు దీనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ యువ ఆటగాడిపై విమర్శలు గుప్పించారు. నేవెస్ వ్యాఖ్యలు బయటకు రావడంతో సోషల్ మీడియాలో కామెంట్లు, విమర్శలు వెల్లువెత్తాయి.

రోనాల్డోను అలా అనడం అతని గొప్పతనాన్ని తగ్గించడమేనని పలువురు అభిమానులు మండిపడ్డారు. ఈ వివాదం నేవెస్ వ్యక్తిగత జీవితంపైనా ప్రభావం చూపింది. అతని సోషల్ మీడియాలో పర్సన్‌ అకౌంట్‌లోకి వెళ్లి సైతం విమర్శలు గుప్పించారు. అతని గర్ల్స్‌ ఫ్రెండ్‌పై సైతం తీవ్రస్థాయిలో ట్రోలింగ్‌కు దిగడం గమనార్హం. వివాదం తీవ్రతరం కావడంతో పోర్చుగల్ హెడ్‌కోచ్‌ రొబెర్టో మార్టినెజ్ స్పందించారు. నేవెస్ వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారని ఆయన స్పష్టం చేశారు. ‘రోనాల్డో స్థానం ఈ జట్టులో ఎవరూ తగ్గించలేది. ఆయన ఫుట్‌బాల్ చరిత్రలో గొప్ప ఆటగాళ్లలో ఒకడు. దేశం కోసం ఇప్పటికీ అదే నిబద్ధతతో ఆడుతున్నాడు’ అని మార్టినెజ్ తేల్చిచెప్పారు. 40 ఏళ్ల రొనాల్డో పోర్చుకల్‌కు కప్‌ సాధించేందుకు ప్రయత్నిస్తున్నాడు. అయితే, కాంగోతో మ్యాచ్‌లో చేయలేకపోయినా జట్టుపై తీవ్ర ప్రభావమే ఉంటుంది. ఇది ఆయన చివరి ప్రపంచకప్ అయ్యే అవకాశం ఉండడంతో ప్రతి మ్యాచ్ ప్రత్యేకంగా నిలుస్తోంది. రాబోయే మ్యాచ్‌ల్లో రోనాల్డో గోల్స్‌ వర్షం కురిపించాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.

Advertisement
Advertisement