Morocco Vs Scotland | సూపర్ సైబరీ.. మొరాకో విక్టరీ
Morocco Vs Scotland | ఫిఫా ప్రపంచకప్-2026 గ్రూప్-సీ పోరులో మొరాకో విజయం సాధించింది. శుక్రవారం బోస్టన్‌లో జరిగిన మ్యాచ్‌లో స్కాట్లాండ్‌పై 1-0 తేడాతో గెలిచి నాకౌట్ దశ అవకాశాలను మరింత మెరుగుపరుచుకుంది. ఇస్మాయెల్ సైబరీ చేసిన ఏకైక గోల్ మొరాకోకు విలువైన మూడు పాయింట్లు అందించింది. మ్యాచ్ ప్రారంభమైన కేవలం 71 సెకన్లకే మొరాకో ఆధిక్యంలోకి వెళ్లింది.
- ఏకైక గోల్‌తో స్కాట్లాండ్‌పై గెలుపు
- నాకౌక్‌కు మరింత చేరువైన జట్టు
- చివరి మ్యాచ్‌లో బ్రెజిల్‌ను ఢీకొట్టనున్న స్కాట్లాండ్
Morocco Vs Scotland | ఫిఫా ప్రపంచకప్-2026 గ్రూప్-సీ పోరులో మొరాకో విజయం సాధించింది. శుక్రవారం బోస్టన్‌లో జరిగిన మ్యాచ్‌లో స్కాట్లాండ్‌పై 1-0 తేడాతో గెలిచి నాకౌట్ దశ అవకాశాలను మరింత మెరుగుపరుచుకుంది. ఇస్మాయెల్ సైబరీ చేసిన ఏకైక గోల్ మొరాకోకు విలువైన మూడు పాయింట్లు అందించింది. మ్యాచ్ ప్రారంభమైన కేవలం 71 సెకన్లకే మొరాకో ఆధిక్యంలోకి వెళ్లింది. బ్రహీమ్ డియాజ్ చాకచక్యంగా ఇచ్చిన పాస్‌ను అందుకున్న సైబరీ బాక్స్‌లోకి దూసుకెళ్లి పవర్‌ఫుల్ షాట్‌తో బంతిని గోల్‌లోకి పంపాడు. టోర్నీలో సైబరీకి ఇది రెండో గోల్. అంతకుముందు బ్రెజిల్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ గోల్ వేసిన విషయం తెలిసిందే. తొలి గోల్ తర్వాత మొరాకో పూర్తిగా మ్యాచ్‌పై పట్టు నిలుపుకుంది. దూకుడైన ఆటతీరుతో స్కాట్లాండ్‌పై వాలిద్ రెగ్రాగుయి బృందం ఒత్తిడి పెంచింది.

బంతిపై ఆధిపత్యం కొనసాగిస్తూ ప్రత్యర్థి ఆటగాళ్లను తిప్పలు పెట్టారు. అచ్రఫ్ హకీమి, అజ్జెదీన్ ఓనాహి మధ్యమైదానంలో ముందుకు నడిపించారు. స్కాట్లాండ్ మాత్రం తొలి అర్ధభాగంలో లయ అందుకోలేకపోయింది. కౌంటర్ ఎటాక్ చేయలేకపోయింది. దాంతో హాఫ్ టైమ్ వరకు మొరాకో 1-0 ఆధిక్యంలో నిలిచింది. రెండో అర్ధభాగంలోనూ మొరాకో అదే జోరును కొనసాగించింది. ఆధిక్యాన్ని రెట్టింపు చేసుకునేందుకు ప్రయత్నిస్తూ.. స్కాట్లాండ్ డిఫెన్స్‌ను ఇబ్బందిపెట్టింది. విరామం అనంతరం కొద్దిసేపటికే సైబరీ మరోసారి గోల్ వేసేందుకు ప్రయత్నించగా.. షాట్ డిఫ్లెక్షన్ తీసుకుని క్రాస్‌బార్‌ను తాకడంతో స్కాట్లాండ్‌కు ప్రమాదం తప్పినట్లయ్యింది. ఆ తర్వాత డియాజ్ సైతం గోల్ చేసే అవకాశం రాగా.. దాన్ని చేజార్చుకున్నాడు. మరోవైపు రెండో అర్ధభాగంలో స్కాట్లాండ్ ఆటతీరులో కొంత మెరుగుదల కనిపించింది.

బెన్ డోక్, లిండన్ డైక్స్, కెన్నీ మెక్‌లీన్‌లను బరిలోకి దింపిన తర్వాత జట్టు ఆటతీరులో మార్పు వచ్చింది. ర్యాన్ క్రిస్టీకి వచ్చిన అవకాశం గోల్‌గా మార్చలేకపోయాడు. డైక్స్ చేసిన హెడ్డర్ సైతం టార్గెట్ తప్పిపోయింది. మ్యాచ్ చివరి నిమిషాల్లో స్కాట్లాండ్ స్కోర్‌ను సమం చేసేందుకు ప్రయత్నించగా.. మొరాకో డిఫెన్స్ అడ్డుగోడలా నిలిచింది. ఆరు నిమిషాల అదనపు సమయం ముగిసిన తర్వాత రిఫరీ ఇల్గిజ్ టాంటషెవ్ విజిల్ వేసి మొరాకో విజయాన్ని ఖరారు చేశారు. ఈ విజయంతో రెండు మ్యాచ్‌ల్లో నాలుగు పాయింట్లు సాధించిన మొరాకో గ్రూప్-సీలో మెరుగైన స్థితిలో నిలిచి రౌండ్ ఆఫ్ 32కి చేరువైంది. మరోవైపు హైతీపై గెలిచిన స్కాట్లాండ్ మూడు పాయింట్లతో కొనసాగుతోంది. నాకౌట్ అవకాశాలను సజీవంగా ఉంచుకోవాలంటే చివరి గ్రూప్ మ్యాచ్‌లో బ్రెజిల్‌పై తప్పనిసరిగా గెలువాల్సిన పరిస్థితి నెలకొంది.
Saibari is a joke— he’s genuinely insane man https://t.co/uj46gsFFUR pic.twitter.com/W585NQGCob
— Kobi (@UTDKobi) June 19, 2026
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Budget Laptops 2026 | రూ.40వేల లోపు లభిస్తున్న బెస్ట్ బడ్జెట్ ల్యాప్‌టాప్‌లు ఇవే.. స్టూడెంట్స్, ఉద్యోగులకు టాప్ ఛాయిస్..
- ●Kavitha | నెల రోజులు గడువు.. మెడికల్ బోర్డు పెట్టకుంటే నిరహార దీక్ష: కవిత
- ●UN Meeting | నోరు మూస్తారా.. యూఎన్ ప్రతినిధిపై ఇజ్రాయెల్ రాయబారి ఫైర్
- ●Turkey Vs Paraguay | తుర్కియేకు షాక్.. ప్రపంచకప్ నుంచి నిష్క్రమణ
- ●NEET UG | నీట్ రీ-ఎగ్జామ్.. మధ్యాహ్నం 1.30 గంట వరకే ఎగ్జామ్ హాల్లోకి అనుమతి..
- ●Gold And Silver Prices Today | అంతర్జాతీయ మార్కెట్లలో భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. కారణమేంటి..?

Budget Laptops 2026 | రూ.40వేల లోపు లభిస్తున్న బెస్ట్ బడ్జెట్ ల్యాప్‌టాప్‌లు ఇవే.. స్టూడెంట్స్, ఉద్యోగులకు టాప్ ఛాయిస్..

Kavitha | నెల రోజులు గడువు.. మెడికల్ బోర్డు పెట్టకుంటే నిరహార దీక్ష: కవిత

UN Meeting | నోరు మూస్తారా.. యూఎన్ ప్రతినిధిపై ఇజ్రాయెల్ రాయబారి ఫైర్

Turkey Vs Paraguay | తుర్కియేకు షాక్.. ప్రపంచకప్ నుంచి నిష్క్రమణ





