Railway Recruitment | పది అర్హతతో రైల్వేలో 22 వేల ఉద్యోగాలు.. దరఖాస్తు చేసుకోండిలా!
Railway Recruitment | దేశంలో అత్యధిక ఉద్యోగులు కలిగిన ప్రభుత్వరంగ సంస్థ భారతీయ రల్వే (Indian Railways). తాజాగా సర్కారు కొలువుల కోసం ఎదురుచూస్తున్న యువత కోసం భారీ నియామక ప్రక్రియ (Railway Recruitment) చేపట్టింది.
Railway Recruitment | త్రినేత్ర.న్యూస్: దేశంలో అత్యధిక ఉద్యోగులు కలిగిన ప్రభుత్వరంగ సంస్థ భారతీయ రల్వే (Indian Railways). తాజాగా సర్కారు కొలువుల కోసం ఎదురుచూస్తున్న యువత కోసం భారీ నియామక ప్రక్రియ (Railway Recruitment) చేపట్టింది. 10వ తరగతి, ఐటీఐ, అప్రెంటిస్ అర్హతతో 22 వేలకుపైగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. రాత పరీక్ష, ఫిజికల్ టెస్టు ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఉద్యోగంలో చేరిన మొదటి నెల నుంచే సుమారు రూ.35 వేల వేతనం అందుతుంది. కొత్త పే కమిషన్ అమలైతే ఇది రూ.50 వేలకుపైగా చేరే అవకాశం ఉంది. రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (ఆర్‌ఆర్‌బీ)ల ద్వారా నియామకాలు చేపట్టనుంది.
మొత్తం ఉద్యోగాలు: 22,195
ఇందులో అసిస్టెంట్ (ట్రాక్ మెషిన్, బ్రిడ్జ్, పీ-వే, టీఆర్‌డీ, ఎస్ అండ్ టీ, సీ అండ్ డబ్ల్యూ, టీఎల్ అండ్ ఏసీ), ట్రాక్‌మెయిన్‌టెయినర్ (గ్రూప్4), అసిస్టెంట్ లోక్ షెడ్ (ఎలక్ట్రికల్), అసిస్టెంట్ ఆపరేషన్స్ (ఎలక్ట్రికల్), పాయింట్స్‌మెన్ వంటి పోస్టులు ఉన్నాయి.
అర్హత: పదో తరగతి, ఐటీఐ, అప్రెంటిస్ పూర్తిచేయాలి. అభ్యర్థులు 18 నుంచి 33 ఏండ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
ఎంపిక విధానం: రాతపరీక్ష ద్వారా..
పరీక్ష ఎలా ఉంటుందంటే..
రాత పరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. పరీక్ష కంప్యూటర్ ఆధారితంగా (సీబీటీ) ఉంటుంది. మొత్తం 100 మార్కులకు, వంద ప్రశ్నలు అడుగుతారు. ప్రతి తప్పు సమాధానానికి మూడో వంతు నెగటివ్ మార్కింగ్ ఉంటుంది. 90 నిమిషాల్లో పరీక్ష పూర్తిచేయాలి.
విభాగాల వారీగా ప్రశ్నలు..
- జనరల్ సైన్స్– 25
- మ్యాథమెటిక్స్– 25
- జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్– 30
- జనరల్ అవేర్‌నెస్ అండ్ కరెంట్ అఫైర్స్– 20
అన్ రిజర్వ్‌డ్, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు 40 శాతం మార్కులు, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీలు కనీసం 30 శాతం మార్కులు సాధించాలి.
ఫిజికల్ టెస్ట్
సీబీటీలో మెరిట్ సాధించిన వారిలో ఖాళీలకు మూడు రెట్లు మంది అభ్యర్థులను ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ (పీఈటీ)కి పిలుస్తారు.
పురుషులకు: 35 కిలోల ఇసుక బస్తాను 2 నిమిషాల్లో 100 మీటర్లు మోసుకెళ్లాలి. అనంతరం 1 కిలోమీటర్ దూరాన్ని 4.15 నిమిషాల్లో పూర్తి చేయాలి.
మహిళలకు: 20 కిలోల బరువును 100 మీటర్లు మోసి, 1 కిలోమీటర్ దూరాన్ని 5.40 నిమిషాల్లో పూర్తి చేయాలి.
రెండు టెస్టులను ఒకే ప్రయత్నంలో పూర్తి చేయాల్సి ఉంటుంది.
దరఖాస్తులు: ఆన్‌లైన్‌లో
అప్లికేషన్ ఫీజు: రూ.500, మహిళలు, ఎస్సీ, ఎస్టీ, ఇతరులకు రూ.250
దరఖాస్తులకు చివరి తేదీ: మార్చి 2
పూర్తివివరాలకు వెబ్‌సైట్: www.rrbcdg.gov.in/ or www.rrbapply.gov.in/
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Indian Railways | యూపీఐ ద్వారా రైలు టిక్కెట్లను కొంటే ఛార్జీలు ఉంటాయా.. రైల్వే శాఖ స్పష్టత..
సెప్టెంబర్ 21, 2026

CPRI Recruitment | సెంట్రల్ పవర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో 112 ఉద్యోగాలు.. ఇంజినీరింగ్, డిప్లొమా అభ్యర్థులు అర్హులు
సెప్టెంబర్ 16, 2026

RRB Secunderabad | సికింద్రాబాద్ రైల్వే జోన్లో 71 పారామెడికల్ పోస్టులు.. అక్టోబర్ 14 వరకు దరఖాస్తులు
సెప్టెంబర్ 15, 2026
తాజావార్తలు
- ●Ayodhya | రామ మందిర కానుకల చోరీ కేసులో 36,039 పేజీలతో చార్జ్‌షీట్
- ●Seetharama Lift | సీతారామ మారేళ్లపాడు ఎత్తిపోతలు ప్రారంభం
- ●Ganesh Immersion | గణేశ్ నిమజ్జనంలో ప్రమాదకర విన్యాసాలు.. ఇన్‌స్టాగ్రామ్‌పై సైబర్ క్రైమ్ పోలీసుల నిఘా
- ●Aishwarya Lekshmi | ఆదాయం వద్దు.. ప్రశాంతతే ముద్దు అంటున్న ఐశ్వర్య లక్ష్మి.. ఇంతకీ ఏం జరిగిందంటే..?
- ●Adilabad | రిమ్స్ అగ్ని ప్రమాద మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా
- ●The Paradise | ‘ది ప్యారడైజ్’కు అదిరిపోయే అడ్వాన్స్ బుకింగ్స్.. రిలీజ్‌కు ముందే రూ.50 కోట్ల దిశగా!

Ayodhya | రామ మందిర కానుకల చోరీ కేసులో 36,039 పేజీలతో చార్జ్‌షీట్

Seetharama Lift | సీతారామ మారేళ్లపాడు ఎత్తిపోతలు ప్రారంభం

Ganesh Immersion | గణేశ్ నిమజ్జనంలో ప్రమాదకర విన్యాసాలు.. ఇన్‌స్టాగ్రామ్‌పై సైబర్ క్రైమ్ పోలీసుల నిఘా

Aishwarya Lekshmi | ఆదాయం వద్దు.. ప్రశాంతతే ముద్దు అంటున్న ఐశ్వర్య లక్ష్మి.. ఇంతకీ ఏం జరిగిందంటే..?



