త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Chamala Kirankumar Reddy | రేపు సిరిసిల్లలో కేటీఆర్‌కు సినిమా చూపించబోతున్నం

Chamala Kirankumar Reddy | రేపు సిరిసిల్ల‌లో కేటీఆర్‌కు సినిమా చూపించ‌బోతున్నామ‌ని.. తొమ్మిదిన్న‌రేండ్ల బాగోతం మొత్తం బ‌య‌టపెడ‌తామ‌ని భువ‌నగిరి ఎంపీ చామ‌ల కిర‌ణ్‌కుమార్‌రెడ్డి వ్యాఖ్యానించారు.

S

Telangana | Published On Sep 29, 2026, 2.54 pm IST

Chamala Kirankumar Reddy | రేపు సిరిసిల్లలో కేటీఆర్‌కు సినిమా చూపించబోతున్నం
Advertisement
  • తొమ్మిదిన్న‌రేండ్ల భూ బాగోతం మొత్తం బ‌ట‌య‌పెడ‌తం
  • 30వ తారీఖు కేటీఆర్‌కు మ‌ర్చిపోలేని రోజ‌వుతుంది
  • రేవంత్ రెడ్డిని ఛాలెంజ్ చేయడానికి కేటీఆర్ ఆఫ్ట్రాల్‌ ఎమ్మెల్యే
  • భువ‌న‌గిరి ఎంపీ చామ‌ల కిర‌ణ్‌కుమార్‌రెడ్డి కౌంట‌ర్‌

Chamala Kirankumar Reddy | త్రినేత్ర న్యూస్: రేపు సిరిసిల్ల‌లో కేటీఆర్‌కు సినిమా చూపించ‌బోతున్నామ‌ని.. తొమ్మిదిన్న‌రేండ్ల బాగోతం మొత్తం బ‌య‌టపెడ‌తామ‌ని భువ‌నగిరి ఎంపీ చామ‌ల కిర‌ణ్‌కుమార్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ఆయ‌న్ను న‌మ్మిన ప్ర‌జ‌ల ముందే రేవంత్‌రెడ్డి నిజానిజాలు బ‌ట్ట‌బ‌య‌లు చేస్తార‌న్నారు. రేపు 30 తేదీ కేటీఆర్‌కు మ‌ర్చిపోలేని రోజ‌వుతుంద‌ని ఎద్దేవా చేశారు. ఈమేర‌కు మంగ‌ళ‌వారం గాంధీ భ‌వ‌న్‌లో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ కేటీఆర్‌పై విమ‌ర్శ‌లు గుప్పించారు.

సీఎం రేవంత్ రెడ్డి సిరిసిల్ల వచ్చే ముందు త‌న మీద అభియోగాలు బయటపెట్టాలని కేటీఆర్ అంటుండు. రేవంత్ రెడ్డిని ఛాలెంజ్ చేయడానికి కేటీఆర్ ఆఫ్ట్రాల్‌ ఎమ్మెల్యే. నిన్ను నమ్మిన ప్రజల ముందు నీబాగోతం సీఎం రేవంత్ రెడ్డి బయటపెడతాడు. కేటీఆర్ భూ బాగోతం మొత్తం సీఎం రేవంత్ రెడ్డి బయటపెడతాడు. సిరిసిల్లలో కేటీఆర్ సక్కదనం దేశ వ్యాప్తంగా సీఎం చెప్పబోతుండు. తొమ్మిదిన్నర ఏండ్ల బాగోతం బయటపెడతాం.

నేతన్నలకు ప్రత్యేక బజార్..

సిరిసిల్లలో కాంగ్రెస్ ప్ర‌భుత్వం 175 కోట్లు రైతు ఋణమాఫీ చేసింది. 345.75 కోట్ల అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన చేయబోతున్నారు. 200 కోట్లతో యుంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్ కు సీఎం శంకుస్థాపన చేయబోతున్నారు. నేతన్నలకు ప్రత్యేక బజార్ వేయబోతున్నారు. వేములవాడ లో 99.40కోట్ల పనులకు సీఎం శంకుస్థాపన చేయబోతున్నారు.

కొంగ‌ర‌క‌లాన్ రైతుల‌ను ఎందుకు పిల‌వ‌లే?

చీమలు దూరని చిట్టడవిలో దూరినట్లు సిరిసిల్లలో కేటీఆర్ దూరిండు. సిరిసిల్లలో ఒక్క అభివృద్ధి చేయలేదు. సిరిసిల్లలో శంకుస్థాపనలకు పరిమితం అయ్యాయి. కలెక్టరేట్ కడితే వర్షం వస్తే ట్రాక్టర్ల మీద పోయే పరిస్థితి ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఐదేండ్లు ఏ పని కాకుండా కాళ్ళలో కర్రలు వేయాలని చూస్తున్న‌రు. కాంగ్రెస్ ను అటాక్ చేద్దామని అగర్బ శ్రీమంతుడు కేటీఆర్ చూస్తుండు. మెట్రో, మూసీ, RRR, బుల్లెట్ ట్రైన్ రావొద్దని చూస్తుండు. బహుదూర్ గూడ ప్రజలను రెచ్చగొట్టి భూ సర్వే ను అడ్డుకోవాలని చూస్తుండు. కేవలం బహుదూర్ గూడ రైతులతో ప్రెస్మీట్ పెట్టిండు. కొంగరకలాన్ రైతులను ఎందుకు పిలవలేదు?

ఈ మీడియా స‌మావేశంలో ఎంపీ, మీడియా కమిటీ ఛైర్మన్, అధికార ప్రతినిధులు సంధ్యారెడ్డి, మానవతా రాయ్, ఆవేలి దామోదర్, శ్రీకాంత్ యాదవ్, కిరణ్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement