Rahul Gandhi | బీజేపీలో మీకు ఇష్టమైన నాయకుడు ఎవరు?.. ఇదీ రాహుల్ గాంధీ సమాధానం.. వీడియో
Rahul Gandhi | బీజేపీలో మీకు ఇష్టమైన రాజకీయ నాయకులు ఎవరు? అని లోక్‌సభలో విపక్షనేత రాహుల్ గాంధీని (Rahul Gandhi) విద్యార్థులు ప్రశ్నించారు. దానికి ఆయన ఏమాత్రం తడబడకుండా కెప్టెన్ అమరేందర్ సింగ్ (Captain Amarinder Singh) అని టక్కున సమాధానం ఇచ్చారు.
Rahul Gandhi | త్రినేత్ర.న్యూస్: బీజేపీలో మీకు ఇష్టమైన రాజకీయ నాయకులు ఎవరు? అని లోక్‌సభలో విపక్షనేత రాహుల్ గాంధీని (Rahul Gandhi) విద్యార్థులు ప్రశ్నించారు. దానికి ఆయన ఏమాత్రం తడబడకుండా కెప్టెన్ అమరేందర్ సింగ్ (Captain Amarinder Singh) అని టక్కున సమాధానం ఇచ్చారు. గత నెల నీట్‌పేపర్ లీక్ (NEET paper leak) విషయంలో ఢిల్లీలో ఉధృతంగా నిరసనలు జరిగిన విషయం తెలిసిందే. అప్పటి విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కోరుతూ విద్యార్థులు, యువత పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. వారిని అణచివేసేందుకు భద్రతాబలగాలు టియర్ గ్యాస్, పెల్లెట్ గన్స్‌తో కాల్పులు జరిపారు. పోలీసుల దాడుల్లో గాయపడిన విద్యర్థుల బృందంతోపాటు, వారి తల్లిదండ్రులతో రాహుల్ గాంధీ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చారు.

ఇందులో భాగంగా బీజేపీలో (BJP) మీకు ఇష్టమైన నాయకుడు (Favourite Politician) ఎవరంటూ ప్రశ్నించారు. దీనికి ఆయన పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరేందర్ సింగ్ అని జవాబు ఇచ్చారు. ఆయనతో నేను చాలా బాగా కలిసిపోతాను. చాలా కూల్‌గా ఉంటారు. పైగా ఆయనకు సైన్యానికి సంబంధించిన చరిత్రలో మంచి ప్రావీణ్యం ఉంది. అందుకే ఆయనంటే నాకు చాలా ఇష్టం అని చెప్పారు. దీనికి సంబంధించిన వీడియోను తాజాగా ఎక్స్‌లో షేర్ చేశారు. ఈ సందర్భంగా హలో అంకుల్ అమరీందర్! అంటూ వీడియోను ముగించారు. ప్రస్తుతం అది సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నది.
"Hello, Uncle Amarinder!"
LoP Shri @RahulGandhi gives a warm shoutout to his favourite politician from the BJP. pic.twitter.com/kwgQPDZ5SV
— Congress (@INCIndia) August 6, 2026
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Nitin Gadkari | సిగ్గుగా ఉంది.. ప్రారంభోత్సవానికి నేను రాను : రహదారి నిర్మాణం ఆలస్యంపై గడ్కరీ అసహనం
- ●S.Madhusudhana Chary | పింక్ కలర్ చొక్కా వేసుకున్నా సభలో అడ్డుకున్నరు
- ●MLC Venkatrami Reddy | వీర్లపల్లి శంకర్ మీద ఏం చర్యలు తీసుకున్నరో చెప్పాలి
- ●Supreme Court | ఆన్లైన్లో అనుచిత కంటెంట్ నుంచి పిల్లల్ని రక్షించండి.. కేంద్రానికి సుప్రీం నోటీసులు
- ●KCR Fake Tweet Controversy | రేవంత్ రెడ్డే సంధ్యారావు.. సంధ్యారావే రేవంత్ రెడ్డి
- ●Jayam Ravi | వెంకటేశ్వరస్వామిగా జయం రవి - మంచు మనోజ్ సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ

Nitin Gadkari | సిగ్గుగా ఉంది.. ప్రారంభోత్సవానికి నేను రాను : రహదారి నిర్మాణం ఆలస్యంపై గడ్కరీ అసహనం

S.Madhusudhana Chary | పింక్ కలర్ చొక్కా వేసుకున్నా సభలో అడ్డుకున్నరు

MLC Venkatrami Reddy | వీర్లపల్లి శంకర్ మీద ఏం చర్యలు తీసుకున్నరో చెప్పాలి

Supreme Court | ఆన్లైన్లో అనుచిత కంటెంట్ నుంచి పిల్లల్ని రక్షించండి.. కేంద్రానికి సుప్రీం నోటీసులు






