త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Raghav Chadha | రాఘవ్ చద్దాకు ప్రమోషన్: రాజ్యసభ పిటిషన్ల కమిటీ చైర్మన్‌గా నియామకం.. సభ్యులు వీరే!

ఆమ్ ఆద్మీ పార్టీని వీడి ఇటీవల బీజేపీ తీర్థం పుచ్చుకున్న యువ ఎంపీ రాఘవ్ చద్దాకు కేంద్రం కీలక బాధ్యతలు అప్పగించింది. రాజ్యసభలో ఆయనకు దక్కిన పదవి ఏంటంటే?

J

National | Published On May 23, 2026, 7.45 pm IST

Raghav Chadha | రాఘవ్ చద్దాకు ప్రమోషన్: రాజ్యసభ పిటిషన్ల కమిటీ చైర్మన్‌గా నియామకం.. సభ్యులు వీరే!
Advertisement
  • బీజేపీ ఎంపీ రాఘవ్ చద్దాకు రాజ్యసభలో అత్యంత కీలకమైన పిటిషన్ల కమిటీ (Committee on Petitions) చైర్మన్‌గా బాధ్యతలు
  • రాజ్యసభ చైర్మన్ సీపీ రాధాకృష్ణన్ ఈ కమిటీని పునరుద్ధరించి, చైర్మన్‌తో కలిపి 10 మంది సభ్యులతో కొత్త ప్యానెల్‌ ప్రకటన
  • ఈ నియామకాలు మే 20, 2026 నుంచి అధికారికంగా అమల్లోకి
  • కార్పొరేట్ లా'స్ (సవరణ) బిల్లు జాయింట్ కమిటీ మెంబర్‌గా డాక్టర్ మేనకా గురుస్వామి

Raghav Chadha | త్రినేత్ర.న్యూస్ : ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) కి గుడ్‌బై చెప్పి ఇటీవల భారతీయ జనతా పార్టీ (BJP) లో చేరిన యువ నేత రాఘవ్ చద్దాకు రాజ్యసభలో కీలక ప్రమోషన్ దక్కింది. రాజ్యసభలో అత్యంత ప్రాధాన్యత ఉండే 'కమిటీ ఆన్ పిటిషన్స్' (Committee on Petitions) నూతన చైర్మన్‌గా ఆయన నియమితులయ్యారు. మే 20న రాజ్యసభ సెక్రటేరియట్ ఈ మేరకు అధికారిక నోటిఫికేషన్ (Notification) జారీ చేసింది.

కమిటీ పునరుద్ధరణ.. 10 మందితో ప్యానెల్

రాజ్యసభ చైర్మన్ సి.పి. రాధాకృష్ణన్ ఇటీవల ఈ పిటిషన్ల కమిటీని పునరుద్ధరించారు. ఈ ప్యానెల్‌లో చైర్మన్ రాఘవ్ చద్దాతో పాటు మొత్తం 10 మంది సభ్యులకు (Members) చోటు కల్పించారు. మే 20 నుంచి ఈ కొత్త కమిటీ అధికారికంగా అమల్లోకి వచ్చినట్లు నోటిఫికేషన్‌లో స్పష్టం చేశారు.

Image

ప్రజల సమస్యలు, పౌర సంఘాలు (Civil society organizations) ఇచ్చే ఫిర్యాదులు, ముఖ్యమైన పిటిషన్లను లోతుగా పరిశీలించడంలో ఈ పార్లమెంటరీ ప్యానెల్ కీలక పాత్ర పోషిస్తుంది.

ప్యానెల్‌లో ఉన్న సభ్యులు వీరే..

చైర్మన్ రాఘవ్ చద్దా నేతృత్వంలో పని చేసే ఈ ప్యానెల్‌లో పలువురు ఎంపీలకు చోటు దక్కింది. వారిలో హర్ష్ మహాజన్, గులాం అలీ, శంభు శరణ్ పటేల్, మయాంక్ కుమార్ నాయక్, బీద మస్తాన్ రావు యాదవ్, జెబి మథేర్ హిషామ్, సుభాశిష్ ఖుంటియా, రంగ్వ్రా నార్జరీ, పి. సంతోష్ కుమార్ తదితరులు ఉన్నారు.

మేనకా గురుస్వామికి మరో కీలక బాధ్యత

మరోవైపు, రాజ్యసభ సెక్రటేరియట్ జారీ చేసిన మరో నోటిఫికేషన్ ప్రకారం.. కార్పొరేట్ చట్టాల (సవరణ) బిల్లు- 2026 (Corporate Laws [Amendment] Bill, 2026) జాయింట్ కమిటీ సభ్యురాలిగా ప్రముఖ న్యాయవాది, రాజ్యసభ ఎంపీ డాక్టర్ మేనకా గురుస్వామిని రాజ్యసభ చైర్మన్ నామినేట్ చేశారు.

ఏదేమైనా, ఆప్ నుంచి కమలం గూటికి చేరిన కొద్ది రోజులకే రాఘవ్ చద్దాకు ఈ అత్యున్నత పార్లమెంటరీ కమిటీ పగ్గాలు దక్కడం జాతీయ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

Advertisement
Advertisement