త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Rain Alert | ఉమ్మ‌డి మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లాకు భారీ వ‌ర్ష సూచ‌న‌.. జ‌ర జాగ్ర‌త్త‌..!

Rain Alert | ఉమ్మ‌డి మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లాలో భారీ వ‌ర్షం కురిసే అవ‌కాశం ఉంద‌ని తెలంగాణ వెద‌ర్ మ్యాన్ బాలాజీ హెచ్చ‌రించారు. మ‌హ‌బూబ్‌న‌గ‌ర్, నాగ‌ర్‌క‌ర్నూల్, వ‌న‌ప‌ర్తి, గ‌ద్వాల‌, నారాయ‌ణ‌పేట జిల్లాల్లో అర్ధ‌రాత్రి వ‌ర‌కు వ‌ర్షం దంచికొట్టే అవ‌కాశం ఉంద‌న్నారు.

S

Telangana | Published On May 23, 2026, 6.56 pm IST

Rain Alert | ఉమ్మ‌డి మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లాకు భారీ వ‌ర్ష సూచ‌న‌.. జ‌ర జాగ్ర‌త్త‌..!
Advertisement

Rain Alert | త్రినేత్ర‌.న్యూస్ : ఉమ్మ‌డి మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లాలో భారీ వ‌ర్షం కురిసే అవ‌కాశం ఉంద‌ని తెలంగాణ వెద‌ర్ మ్యాన్ బాలాజీ హెచ్చ‌రించారు. మ‌హ‌బూబ్‌న‌గ‌ర్, నాగ‌ర్‌క‌ర్నూల్, వ‌న‌ప‌ర్తి, గ‌ద్వాల‌, నారాయ‌ణ‌పేట జిల్లాల్లో అర్ధ‌రాత్రి వ‌ర‌కు వ‌ర్షం దంచికొట్టే అవ‌కాశం ఉంద‌న్నారు. భారీ వ‌ర్షంతో పాటు ఉరుములు, మెరుపులు సంభ‌వించే అవ‌కాశం ఉంద‌ని హెచ్చ‌రించారు. రాబోయే నాలుగైదు గంట‌ల్లో వాతావ‌ర‌ణం పూర్తిగా మారిపోనుంద‌ని, 50 నుంచి 60 కిలోమీట‌ర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవ‌కాశం ఉంద‌న్నారు.

భారీ వ‌ర్షం, ఈదురుగాలుల నేప‌థ్యంలో ప్ర‌జ‌లు, రైతులు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని సూచించారు. బ‌య‌ట ఆర‌బోసిన ధాన్యాన్ని వ‌ర్షం నుంచి కాపాడుకోవాల‌న్నారు. అత్య‌వ‌స‌ర‌మైతేనే ప్ర‌జ‌లు త‌మ నివాసాల నుంచి బ‌య‌ట‌కు రావాల‌ని సూచించారు.

ఇక నాగ‌ర్‌క‌ర్నూల్ జిల్లా ప‌రిధిలోని అచ్చంపేట‌లో శ‌నివారం మ‌ధ్యాహ్నం భారీ వ‌ర్షం కురిసింది. స్థానికంగా ఉన్న మార్కెట్ యార్డులో నిల్వ చేసిన వ‌రి ధాన్యం పూర్తి త‌డిసిపోయింది. రైతులు తీవ్ర ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఇక రైతుల‌కు పోలీసులు స‌హాయం చేశారు. త‌డిసిన వ‌రి ధాన్యం నుంచి త‌డ‌వ‌ని ధాన్యాన్ని వేరు చేసేందుకు పోలీసులు రైతుల‌కు స‌హాయం చేశారు.

Advertisement

తాజావార్తలు

Advertisement