Pushkar Singh Dhami | చొరబాటుదారులకు మద్దతిచ్చే మీరు..శివుడితో పోల్చుకుంటారా?
Pushkar Singh Dhami | ఢిల్లీ: రాహుల్ గాంధీ చేసిన శివ్ జీ కీ బారాత్ వ్యాఖ్యలపై ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి స్పందించారు. శివుడి పెళ్లి ఊరేగింపును ఎల్లప్పుడూ శుభసూచకంగా భావిస్తారని ఆయన అన్నారు. సమస్త విశ్వానికి శివుడే అధిపతి అని, ఆయనే విశ్వమని, శివుడే సత్యమని, ఆయన శాశ్వతుడని పేర్కొన్నారు. చొరబాటుదారుల ఊరేగింపుతో తమను తాము శివుడితో ఎలా పోల్చుకుంటారని ధామి ప్రశ్నించారు.
Pushkar Singh Dhami | ఢిల్లీ: రాహుల్ గాంధీ (Rahul Gandhi) చేసిన శివ్ జీ కీ బారాత్ వ్యాఖ్యలపై ఉత్తరాఖండ్ (UttaraKhand) ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి (Pushkar singh Dhami) స్పందించారు. శివుడి పెళ్లి ఊరేగింపును ఎల్లప్పుడూ శుభసూచకంగా భావిస్తారని ఆయన అన్నారు. సమస్త విశ్వానికి శివుడే అధిపతి అని, ఆయనే విశ్వమని, శివుడే సత్యమని, ఆయన శాశ్వతుడని పేర్కొన్నారు. చొరబాటుదారుల ఊరేగింపుతో తమను తాము శివుడితో ఎలా పోల్చుకుంటారని ధామి ప్రశ్నించారు. వ్యవస్థను భంగపరిచేందుకు, ప్రజలకు ఇబ్బందులు కలిగించేందుకు, గందరగోళం సృష్టించేందుకు, వాతావరణాన్ని పాడుచేసేందుకు చొరబాటుదారులు ఒకచోట చేరిన సమూహమిదని విమర్శించారు. ఒక విధంగా చూస్తే, వారు భయాందోళనల వాతావరణాన్ని సృష్టించి వ్యవస్థను అస్తవ్యస్తం చేయాలని ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.
కాగా ఉత్తరాఖండ్ నూతన గవర్నర్‌గా నియమితులైన డాక్టర్ ధాల్ సింగ్ బిసేన్‌కు ధామి హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు. కొత్త గవర్నర్‌కు సాదర స్వాగతం పలుకుతున్నామని, ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నామని చెప్పారు. సామాజిక, రాజకీయ రంగాల్లో ఎన్నో సంవత్సరాలుగా సేవలందించిన అనుభవం ఆయనకు ఉందని పేర్కొన్నారు. ఆయన అనుభవం ఉత్తరాఖండ్ రాష్ట్రానికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని ధామి ఆశాభావం వ్యక్తం చేశారు.
https://twitter.com/PTI_News/status/2109894166474076584?s=20
సంబంధిత వార్తలు

Richa Parashar | సుప్రీం వద్ద కవరేజ్‌లో చేయి పట్టి లాగి నన్ను రాహుల్ గాంధీ తోసేశారు : గర్భిణి జర్నలిస్ట్ ఆరోపణలతో దుమారం
అక్టోబర్ 13, 2026

MP Kirankumar Reddy | బీజేపీ చిల్లర రాజకీయాలు బంజేయాలే
అక్టోబర్ 13, 2026

Giriraj Singh | 9 రాష్ట్రాల్లో 30 ఏళ్లుగా కాంగ్రెస్ అధికారంలో లేదు: గిరిరాజ్ సింగ్
అక్టోబర్ 13, 2026
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | మంత్రి క్వార్టర్లో బాత్రూమ్కు కోటి రూపాయలతో మరమ్మతులు
- ●Iconic Cable Bridge | కృష్ణా నదిపై సోమశిల వద్ద ఐకానిక్ కేబుల్ బ్రిడ్జి.. త్వరలోనే శంకుస్థాపన
- ●Richa Parashar | సుప్రీం వద్ద కవరేజ్‌లో చేయి పట్టి లాగి నన్ను రాహుల్ గాంధీ తోసేశారు : గర్భిణి జర్నలిస్ట్ ఆరోపణలతో దుమారం
- ●Cockroach Janta Party | జంతర్ మంతర్‌లోకి చొరబాటు.. సీజేపీ నేతల అరెస్ట్..
- ●MP Kirankumar Reddy | బీజేపీ చిల్లర రాజకీయాలు బంజేయాలే
- ●Singareni | సింగరేణి పర్మినెంట్ ఉద్యోగులకు లాభాల్లో 34 శాతం చెల్లింపు

Jupally Krishna Rao | మంత్రి క్వార్టర్లో బాత్రూమ్కు కోటి రూపాయలతో మరమ్మతులు

Iconic Cable Bridge | కృష్ణా నదిపై సోమశిల వద్ద ఐకానిక్ కేబుల్ బ్రిడ్జి.. త్వరలోనే శంకుస్థాపన

Richa Parashar | సుప్రీం వద్ద కవరేజ్‌లో చేయి పట్టి లాగి నన్ను రాహుల్ గాంధీ తోసేశారు : గర్భిణి జర్నలిస్ట్ ఆరోపణలతో దుమారం

Cockroach Janta Party | జంతర్ మంతర్‌లోకి చొరబాటు.. సీజేపీ నేతల అరెస్ట్..



