త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Chenab River Doda Suicide | తండ్రితో ఫోన్‌లో మాట్లాడుతూ.. ‘బై బై నాన్న’ అంటూ నదిలోకి దూకేసిన 20 ఏళ్ల యువతి

జమ్మూకశ్మీర్‌లోని దోడా జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. తండ్రితో ఫోన్‌లో మాట్లాడుతూ 'బై బై నాన్న' అని చెప్పి ఓ యువతి చీనాబ్ నదిలో దూకి ఆత్మహత్య చేసుకుంది.

J

Crime | Published On Sep 7, 2026, 4.12 pm IST

Chenab River Doda Suicide | తండ్రితో ఫోన్‌లో మాట్లాడుతూ.. ‘బై బై నాన్న’ అంటూ నదిలోకి దూకేసిన 20 ఏళ్ల యువతి
Advertisement
  • జమ్మూకశ్మీర్‌లోని దోడా జిల్లాలో పాయల్ అనే యువతి (20) ఉధృతంగా ప్రవహిస్తున్న చీనాబ్ నదిలో దూకి ఆత్మహత్య
  • బైక్‌పై వస్తుండగా చున్నీ ఇరుక్కోవడంతో ఆపినప్పుడు, సడెన్‌గా ప్రేమ్ నగర్ బ్రిడ్జి అంచుకు వెళ్లి ఆత్మహత్యకు యత్నం
  • తండ్రికి ఫోన్ చేసి "ఇది నా జీవితం.. నా దారి నేను చూసుకుంటా.. బై బై నాన్న" అని చెప్పి నదిలోకి దూకేసిన పాయల్
  • యువతి కోసం రంగంలోకి దిగిన ఎస్‌డీఆర్‌ఎఫ్ (SDRF), పోలీసు బృందాలు.. ఇంకా లభించని ఆచూకీ

Chenab River Doda Suicide | జమ్మూకశ్మీర్‌ (Jammu Kashmir)లో అత్యంత విషాదకర ఘటన చోటుచేసుకుంది. 20 ఏళ్ల యువతి తన తండ్రితో ఫోన్‌లో మాట్లాడుతూనే వంతెన పైనుంచి ఉధృతంగా ప్రవహిస్తున్న చీనాబ్ నది (Chenab River)లోకి దూకేసింది. జాతరకు వెళ్లి వస్తూ మార్గమధ్యలో ఆమె ఈ దారుణానికి ఒడిగట్టింది.

జాతర నుంచి వస్తుండగా..

దోడా జిల్లాకు చెందిన కృష్ణలాల్ కుమార్తె పాయల్ దేవి (20) తన ఊరికే చెందిన ఒక వ్యక్తితో కలిసి బైక్‌పై స్థానికంగా జరిగే జాతరకు వెళ్లింది. తిరుగు ప్రయాణంలో శివ దళ్ / ప్రేమ్ నగర్ వంతెన (Prem Nagar bridge) వద్ద ఆమె చున్నీ బైక్ చక్రంలో ఇరుక్కుపోయింది. దీంతో ఆమె వెనుక కూర్చున్న వ్యక్తి చున్నీని తీసేందుకు బైక్ ఆపాడు. ఆ సమయంలో పాయల్ అకస్మాత్తుగా వంతెన అంచుకు వెళ్లి తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు అక్కడి వారికి చెప్పింది.

చివరి కాల్.. 'బై బై నాన్న'

వంతెనపై ఉన్న స్థానికులు ఆమెను ఆపేందుకు ఎంత ప్రయత్నించినా, బతిమాలినా ఆమె వినలేదు. వెంటనే బైక్ నడుపుతున్న వ్యక్తి పాయల్ తండ్రికి ఫోన్ చేసి పరిస్థితి వివరించాడు. తండ్రి ఫోన్‌లో ఆమెకు సర్దిచెప్పేందుకు ప్రయత్నించగా.. "ఇది నా జీవితం నాన్న.. నా దారి నేను చూసుకోవాలి. బై బై నాన్న" (Bye bye Papa) అని చెప్పి ఫోన్ కట్ చేసి నదిలో దూకేసింది.

కొనసాగుతున్న గాలింపు

ఈ ఘటన తర్వాత స్థానికులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు, ఎస్‌డీఆర్‌ఎఫ్ (SDRF) సిబ్బంది, రెస్క్యూ టీమ్స్ హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. ఉధృతంగా ప్రవహిస్తున్న చీనాబ్ నదిలో పాయల్ కోసం రాత్రింబవళ్లు గాలింపు చర్యలు (Search operation) చేపట్టారు. అయితే ఇప్పటివరకు ఆమె ఆచూకీ లభించలేదు. గాలింపు ఇంకా కొనసాగుతోంది.

Advertisement
Advertisement