త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Nora Fatehi | బూతు సాంగ్ కాంట్ర‌వ‌ర్సీ.. విచారణకు హాజరైన నోరా ఫతేహి.. తప్పుకు ప్రాయశ్చిత్తంగా….

స‌ర్కే చునార్ వివాదానికి సంబంధించి బాలీవుడ్ బ్యూటీ నోరా ఫ‌తేహి నేష‌న‌ల్ ఉమెన్ క‌మిష‌న్ ముందు విచార‌ణ‌కు హాజ‌రైంది. ఈ విచార‌ణ‌లో తాను త‌ప్పు చేసిన‌ట్లు అంగీక‌రించింది నోరా ఫ‌తేహి. త‌న పొర‌ట‌పాటుకు ప్రాయ‌శ్చిత్తంగా అనాథ పిల్ల‌ల చ‌దువుకు డ‌బ్బును స్పాన్స‌ర్ చేయ‌బోతున్న‌ట్లు వెల్ల‌డించింది.

N

Entertainment | Published On May 7, 2026, 4.15 pm IST

Nora Fatehi | బూతు సాంగ్ కాంట్ర‌వ‌ర్సీ.. విచారణకు హాజరైన నోరా ఫతేహి.. తప్పుకు ప్రాయశ్చిత్తంగా….
Advertisement

Nora Fatehi | ధ్రువ్ స‌ర్జా హీరోగా న‌టించిన క‌న్న‌డ మూవీ కేడీలోని స‌ర్కే చునార్ సాంగ్ సృష్టించిన వివాదం అంతా ఇంతా కాదు. బూతు సాహిత్యం, అశ్లీల డ్యాన్స్‌ల‌తో కూడిన ఈ పాట గురించి ఏకంగా పార్ల‌మెంట్‌లో చ‌ర్చ జ‌రిగింది. డ‌బుల్ మీనింగ్ డైలాగ్స్‌తో మ‌హిళ‌ల గౌర‌వానికి భంగం క‌లిగించేలా ఈ పాట ఉందంటూ ఆరోప‌ణ‌లు రావ‌డంతో ఈ పాట‌పై బ్యాన్ విధించారు. ఈ పాట‌లో న‌టించినందుకు సంజ‌య్ ద‌త్‌తో పాటు నోరా ఫ‌తేహి చిక్కుల్లో ప‌డ్డారు. డ‌బ్బు కోసం ఎలాంటి పాట‌ల్లో నైనా న‌టిస్తారా అంటూ వారిని ఫ్యాన్స్ గ‌ట్టిగానే ట్రోల్ చేశారు. నేష‌న‌ల్ ఉమెన్ క‌మిష‌న్ వారికి నోటీసులు జారీ చేసింది. విచార‌ణ‌కు హాజ‌రు కావాల‌ని ఆదేశించింది.

క్ష‌మాప‌ణ‌లు...

ఏప్రిల్ నెలాఖ‌రున సంజ‌య్ ద‌త్ విచార‌ణ‌కు హాజ‌ర‌య్యారు. మ‌హిళా క‌మిష‌న్‌కు బేష‌ర‌తుగా క్ష‌మాప‌ణ‌లు చెప్పారు. తాను చేసిన త‌ప్పుకుగాను యాభై మంది గిరిజ‌న బాలిక‌ల విద్య‌కు అవ‌స‌ర‌మ‌య్యే ఖ‌ర్చు భ‌రిస్తాన‌ని హామీ ఇచ్చారు. తాజాగా గురువారం స‌ర్కే చునార్ సాంగ్ వివాదానికి సంబంధించి జాతీయ మ‌హిళా క‌మిష‌న్ విచార‌ణ‌కు నోరా ఫ‌తేహి హాజ‌రైంది. తాను త‌ప్పు చేసిన‌ట్లు ఒప్పుకున్న నోరా మ‌రోసారి క్ష‌మాప‌ణ‌లు చెప్పింది. అపాల‌జీ లెట‌ర్‌ను మ‌హిళా క‌మిష‌న్‌కు అంద‌జేసింది. ఈ పాట‌తో ఎవ‌రిని కించ‌ప‌ర‌చాల‌ని అనుకోలేద‌ని, తెలియ‌కుండా త‌ప్పు జ‌రిగిపోయింద‌ని అన్న‌ది. తాను చేసిన త‌ప్పుకు గాను కొంద‌రు అనాథ బాలిక‌ల చ‌దువుకు అవ‌స‌ర‌మైన డ‌బ్బును స్పాన్స‌ర్ చేయాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్లు ఈ బాలీవుడ్ హీరోయిన్ చెప్పింది. ఇలాంటి పాట‌ల్లో న‌టించ‌డం వ‌ర‌కే యాక్ట‌ర్ల ప‌ని అని, అందులోని సాహిత్యంతో త‌మ‌కు సంబంధం ఉండ‌ద‌ని నోరా ఫ‌తేహి వెల్ల‌డించింది.

ప్లేట్ ఫిరాయించిన బ్యూటీ...

స‌ర్కే చునార్ సాంగ్‌ఫై వివాదం చెల‌రేగ‌డంతో నోరా ఫ‌తేహి ఫ్లేట్ ఫిరాయించింది. ఈ సాంగ్‌ను బ్యాన్ చేసి మంచి ప‌నిచేశారంటూ ఇటీవ‌ల నెటిజ‌న్ల‌కు థ్యాంక్స్ చెబుతూ ఓ పోస్ట్ పెట్టింది. అంద‌రి ఒత్తిడి వ‌ల్లే మేక‌ర్స్ ఆ పాట‌ను డిలీట్ చేశారు. ఇలాంటి అశ్లీల‌మైన పాట‌కు నేను స‌పోర్ట్ చేస్తున్న‌ట్లు వ‌స్తోన్న వార్త‌ల్లో నిజం లేదు. కేవ‌లం క‌న్న‌డ వెర్ష‌న్‌లో మాత్ర‌మే న‌టించ‌డానికి నేను అంగీక‌రించాను. కానీ నా ప‌ర్మిష‌న్ లేకుండానే మేక‌ర్స్ తెలుగు, హిందీతో పాటు మిగిలిన భాష‌ల్లో రిలీజ్ చేశారు అంటూ మేక‌ర్స్‌పై ఆరోప‌ణ‌లు చేసింది.

Advertisement
Advertisement