త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Ponnam Prabhakar | దివ్యాంగులు, వృద్ధులకు సేవ చేయ‌డం అదృష్టం: పొన్నం ప్ర‌భాక‌ర్‌

Ponnam Prabhakar | దివ్యాంగులకు, వృద్ధుల‌కు సేవ చేసే అవ‌కాశం ద‌క్క‌డం అదృష్టంగా భావిస్తున్నామ‌ని మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ (Ponnam Prabhakar) అన్నారు.

S

Telangana | Published On Nov 16, 2026, 12.59 pm IST

Ponnam Prabhakar | దివ్యాంగులు, వృద్ధులకు సేవ చేయ‌డం అదృష్టం: పొన్నం ప్ర‌భాక‌ర్‌
Advertisement

Ponnam Prabhakar | త్రినేత్ర న్యూస్: దివ్యాంగులకు, వృద్ధుల‌కు సేవ చేసే అవ‌కాశం ద‌క్క‌డం అదృష్టంగా భావిస్తున్నామ‌ని మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ (Ponnam Prabhakar) అన్నారు. అలింకో, రాష్ట్ర ప్ర‌భుత్వం త‌ర‌ఫున నిర్వ‌హిస్తున్న మెడిక‌ల్ క్యాంపుల‌ (Medical Camps)ను అర్హులైన ప్ర‌తి ఒక్క‌రూ సద్వినియోగం చేసుకోవాల‌న్నారు. శిబిరాలకు వ‌చ్చి వైద్య పరీక్షలు చేయించుకోవాలని కోరారు. హుస్నాబాద్ నియోజకవర్గంలోని దివ్యాంగులు వయో వృద్ధులకు ఉచిత సహాయ ఉపకరణాల కోసం కరీంనగర్ (Karimnagar) జిల్లా సైదాపూర్ మండల కేంద్రంలో అలింకో సంస్థ సహకారంతో నిర్ధారణ శిబిరాన్ని సోమ‌వారం ప్రారంభించిన సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడారు.

అవసరాన్ని బట్టి కృత్రిమ కాళ్లు, చేతులు, వినికిడి యంత్రాలు, చంక కర్రలు, చేతి కర్రలు, వీల్‌చైర్లు, మూడు చక్రాల బండ్లు ఉచితంగా అందజేయడం జరుగుతుంది. ఏడు మండ‌లాల ప‌రిధిలో ఉన్న దివ్యాంగులు, వృద్ధుల‌కు సంబంధించి అన్ని ర‌కాల ప‌నిముట్ల‌ను ఇవ్వ‌డానికి ఈరోజు సైదాపూర్ మండ‌లంలో ప్రారంభ‌మై వివిధ మండ‌లాల్లో కార్య‌క్ర‌మాలు కొన‌సాగిస్తాం. అర్హులంతా త‌ప్ప‌కుండా క్యాంపుకు వ‌చ్చి ప‌రీక్షలు చేయించుకోండి. అవ‌స‌ర‌మైన ప‌నిముట్లు అంద‌రికీ ఇచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నాం. ఈ అవ‌కాశాన్ని త‌ప్ప‌కుండా వినియోగించుకోవాలి అని పొన్నం కోరారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా, జిల్లా సంక్షేమ అధికారి సరస్వతి, అలింకో సంస్థ ప్రతినిధులు, జిల్లా అధికారులు, వివిధ గ్రామాల సర్పంచ్ లు, మార్కెట్ కమిటీ చైర్మన్ లు, ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement