Minister Uttam Kumar Reddy | పెండింగ్ ప్రాజెక్టులకు క్లియరెన్స్ ఇప్పించండి
Minister Uttam Kumar Reddy | రాష్ట్రంలోని ఇరిగేషన్ ప్రాజెక్టుల పరిస్థితిని ప్రధాని నరేంద్ర మోదీకి వివరించామని, పాలమూరు ఎత్తిపోతల, డిండి, సీతమ్మ సాగర్ ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతుల విషయంలో చొరవ చూపాలని సీఎం రేవంత్ రెడ్డితో సహా తాను, వాకిటి శ్రీహరి విన్నవించినట్లు నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు.
పాలమూరు, డిండి, సీతమ్మ సాగర్‌కు అనుమతులు మంజూరు చేయండి
తుమ్మిడిహెట్టి ఎత్తుకు మహారాష్ట్రతో అంగీకారం కుదిరేలా చూడండి
సమ్మక్క సారక్క బ్యారేజీకి ఎన్వోసీ ఇప్పించండి
రాష్ట్రానికి రూ. 5 వేల కోట్లు ఇవ్వండి
హైదరాబాద్‌లో తాగునీటి సమస్య లేదు
వచ్చే వానాకాలం నాటికి సరిపడా నీళ్లు ఉన్నయ్
యాసంగిలో వరి వేసుకోవద్దని రైతులకు విజ్ఞప్తి
ప్రధాని మోదీతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ
వివరాలను మీడియాకు వెల్లడించిన మంత్రులు ఉత్తమ్, వాకిటి శ్రీహరి
Minister Uttam Kumar Reddy | త్రినేత్ర న్యూస్ : రాష్ట్రంలోని ఇరిగేషన్ ప్రాజెక్టుల పరిస్థితిని ప్రధాని నరేంద్ర మోదీకి వివరించామని, పాలమూరు ఎత్తిపోతల, డిండి, సీతమ్మ సాగర్ ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతుల విషయంలో చొరవ చూపాలని సీఎం రేవంత్ రెడ్డితో సహా తాను, వాకిటి శ్రీహరి విన్నవించినట్లు నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. తుమ్మిడిహెట్టి ఎత్తుకు మహారాష్ట్రతో అంగీకారం ఇప్పించాలని మోదీని కోరినట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా స్పెషల్ అసిస్టెన్స్ టూ స్టేట్స్ ఫర్ క్యాపిటల్ ఇన్విస్టిమెంట్ స్కీమ్ కింద రాష్ట్రానికి రూ.5 వేల కోట్ల ఆర్థిక సాయం అందించాలని కోరినట్లు పేర్కొన్నారు.
ప్రధాని నరేంద్ర మోదీతో సీఎం రేవంత్‌రెడ్డి, రాష్ట్ర మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, వాకిటి శ్రీహరి భేటీ అయ్యారు. నవంబర్ 22 వరకు తెలంగాణలో నిర్వహించనున్న ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌కు హాజరుకావాలని ప్రధాని మోదీని ఆహ్వానించారు. భేటీ అనంతరం ఢిల్లీలో సహచర మంత్రి వాకిటి శ్రీహరితో కలిసి నిర్వహించిన విలేకరుల సమావేశంలో మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వివరాలు వెల్లడించారు.
పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల, సీతమ్మ సాగర్, డిండి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులకు కలిపి రూ. 50 వేల కోట్లు ఖర్చు పెట్టాం. ఈ ప్రాజెక్టులకు సంబంధించి పర్యావరణ అనుమతుల కోసం క్లియరెన్స్ ఇవ్వాలని కోరాం. తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు ఎత్తును 152 మీటర్లకు పెంచేలా మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించి ఆమోదం ఇప్పించాలని కోరాం. ఇక సమ్మక్క సారక్క బ్యారేజీకి ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం నుంచి ఎన్‌వోసీ ఇప్పించాలని మోదీని కోరాం. ప్రధాన మంత్రి కృషి సించాయ్ యోజన కింద ఇంటిగ్రేటెడ్ సీతమ్మ సాగర్, సీతారామ సాగర్ ప్రాజెక్టు రూ. 5183 కోట్లు, మోడికుంట వాగుకు రూ. 392 కోట్లు, చిన్న కాలేశ్వరంలో రూ. 171 కోట్లు, చనఖా కొరటా బ్యారేజీకి రూ. 103 కోట్లు ఇవ్వాలని కోరామని తెలిపారు.
ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఏర్పడే అవకాశం, రాష్ట్రంలో పడిపోతున్న భూగర్భ జలమట్టాలపై కూడా ప్రధానికి వివరించాం. కేంద్ర భూగర్భ జల మండలి సెప్టెంబర్ నివేదికను ప్రధానికి అందజేశాం. రాష్ట్రంలోని అన్ని రెవెన్యూ గ్రామాల్లో భూగర్భ జలాల పెంపు, పరిరక్షణకు స్వల్పకాలిక, దీర్ఘకాలిక కార్యాచరణ రూపొందిస్తున్నామని తెలిపారు. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా రూ.5 వేల కోట్ల ఆర్థిక సాయం అందించాలని కోరాం. ఇక హైదరాబాద్‌లో తాగునీటి సమస్య లేదు. వచ్చే వానాకాలం వరకు రిజర్వాయర్లలో నీటిని నిల్వ చేసుకున్నాం. యాసంగిలో వరి వేయొద్దని రైతులకు విజ్ఞప్తి చేస్తున్నామని మంత్రి ఉత్తమ్ ప్రకటించారు.
మేడిగడ్డ వద్ద లిఫ్ట్ చేయడానికి వీల్లేదని జాతీయ, అంతర్జాతీయ నిపుణులు పేర్కొన్నారు. అక్కడ్నుంచి వెళ్లిన నీటిని దేవాదుల, సీతారామ సాగర్ వద్ద లిఫ్ట్ చేస్తున్నాం. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల డిజైన్‌లో లోపాలు ఉన్నాయి. వాళ్ల హయాంలో కూలిపోయిన మేడిగడ్డ నుంచి నీళ్లు ఎత్తిపోయాలని అర్థరహితంగా విడ్డూరంగా మాట్లాడుతున్నారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ధ్వజమెత్తారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Raja Singh | సజ్జనార్ అవకతవకలపై సీబీఐతో విచారణ జరిపించండి.. సీఎం రేవంత్‌కు రాజాసింగ్ సంచలన లేఖ
నవంబర్ 15, 2026

New Pensions | కొత్త పింఛన్‌దారులకు గుడ్ న్యూస్.. 19న 4.63 లక్షల మంది ఖాతాల్లో జమ
నవంబర్ 15, 2026

Madhu Yashki Goud | అవగాహనుంటే బ్రెయిన్, హార్ట్ స్ట్రోక్‌లు ఆపొచ్చు
నవంబర్ 15, 2026
తాజావార్తలు
- ●Vande Bharat Brake Failure | బ్రేకులు లేకుండానే 463 కిమీలు పరుగులు తీసిన వందే భారత్
- ●Wamiqa Gabbi | "డీసీ"తో మారిన జాతకం - నందమూరి హీరో సరసన వామికా గబ్బి
- ●Alice Huang Megaspeed | ఎన్విడియా వివాదంలో బిగ్ ట్విస్ట్: "అలిస్ హువాంగ్ ఎప్పుడో రిజైన్ చేసింది"
- ●Raja Singh | సజ్జనార్ అవకతవకలపై సీబీఐతో విచారణ జరిపించండి.. సీఎం రేవంత్‌కు రాజాసింగ్ సంచలన లేఖ
- ●Copa Airlines UPS Crash | రన్‌వేపై ఢీకొన్న రెండు విమానాలు
- ●Vijay - Rashmika | జపాన్ వెకేషన్లో విరోష్ - రొమాంటిక్ ట్రిప్ ఫొటోలు వైరల్

Vande Bharat Brake Failure | బ్రేకులు లేకుండానే 463 కిమీలు పరుగులు తీసిన వందే భారత్

Wamiqa Gabbi | "డీసీ"తో మారిన జాతకం - నందమూరి హీరో సరసన వామికా గబ్బి

Alice Huang Megaspeed | ఎన్విడియా వివాదంలో బిగ్ ట్విస్ట్: "అలిస్ హువాంగ్ ఎప్పుడో రిజైన్ చేసింది"

Raja Singh | సజ్జనార్ అవకతవకలపై సీబీఐతో విచారణ జరిపించండి.. సీఎం రేవంత్‌కు రాజాసింగ్ సంచలన లేఖ



