త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Adi Srinivas | 500 కాదు.. 5000 రోజులైనా కేసీఆర్ సీఎం కాలేరు

Adi Srinivas | 500 రోజులు కాదు.. 5000 రోజులైనా కేసీఆర్ ముఖ్య‌మంత్రి కాలేరు అని ప్ర‌భుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్ర‌భుత్వంపై దుష్ప్ర‌చారం చేస్తున్న బీఆర్ఎస్ నేత‌ల‌పై ఆయ‌న మండిప‌డ్డారు.

S

Telangana | Published On Nov 23, 2026, 1.45 pm IST

Adi Srinivas | 500 కాదు.. 5000 రోజులైనా కేసీఆర్ సీఎం కాలేరు
Advertisement

అధికారంలోకి వ‌స్తామ‌ని కేటీఆర్ ప‌గ‌టి క‌ల‌లు కంటున్నారు
బీఆర్ఎస్ పార్టీపై ప్ర‌భుత్వ విప్ ఆది శ్రీనివాస్ ధ్వ‌జం

Adi Srinivas | త్రినేత్ర న్యూస్ : 500 రోజులు కాదు.. 5000 రోజులైనా కేసీఆర్ ముఖ్య‌మంత్రి కాలేరు అని ప్ర‌భుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్ర‌భుత్వంపై దుష్ప్ర‌చారం చేస్తున్న బీఆర్ఎస్ నేత‌ల‌పై ఆయ‌న మండిప‌డ్డారు.

అధికారంలోకి వస్తామని కేటీఆర్ పగటి కలలు కంటున్నారు. 500 రోజుల్లో సీఎం కేసీఆర్ అవుతారని చెప్తున్నారు. 500 కాదు 5000 రోజులైనా కేసీఆర్ ముఖ్యమంత్రి కాలేరు. కాంగ్రెస్ అధికారంలోకి వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి ప్రభుత్వం కూలిపోతుంది అని దుష్ప్ర‌చారం చేస్తున్నారు అని ధ్వ‌జ‌మెత్తారు.

10 ఏళ్లలో కేసీఆర్ విధ్వంసకరంగా పరిపాలించారు. కేటీఆర్ మాట‌లు కోట‌లు దాటుతున్న‌య్. 2023 డిసెంబ‌ర్ నుంచి కేసీఆర్ వ్య‌వ‌సాయ క్షేత్రానికి ప‌రిమిత‌మ‌య్యారు. ప్ర‌జాక్షేత్రంలో బీఆర్ఎస్‌ది జీరో ప‌ర్ఫామెన్స్ అని నిప్పులు చెరిగారు. కాంగ్రెస్‌ని అంతం చేయ‌డం కేసీఆర్ వల్లే కాలేదు.. కేటీఆర్ నీ వ‌ల్ల ఏమ‌వుతుంది అని నిల‌దీశారు. పేద ప్రజలకు అండగా ఉండేది కాంగ్రెస్ పార్టీనే అని ఆది శ్రీనివాస్ స్ప‌ష్టం చేశారు.

Advertisement
Advertisement