త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Mahesh Kumar Goud | 26న సంవిధాన్ రక్షక్ ర్యాలీ చేపట్ట‌బోతున్నం

Mahesh Kumar Goud | ఏఐసీసీ పిలుపు మేరకు ఈ నెల 26న సంవిధాన్ రక్షక్ ర్యాలీ (Samvidhan Rakshak Rally) నిర్వ‌హించ‌బోతున్నామ‌ని.. హైద‌రాబాద్‌లోని లిబర్టీ అంబేద్కర్ విగ్రహం నుంచి ఇందిరాగాంధీ విగ్రహం వరకు ర్యాలీ కొన‌సాగుతుంద‌ని టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) తెలిపారు.

S

Telangana | Published On Nov 23, 2026, 1.52 pm IST

Mahesh Kumar Goud | 26న సంవిధాన్ రక్షక్ ర్యాలీ చేపట్ట‌బోతున్నం
Advertisement
  • కోటి ఓట్లు, 90 సీట్లే ల‌క్ష్యంగా ఎన్నికలకు వెళ్తం
  • గాంధీభ‌వ‌న్‌లో టీపీసీసీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్

Mahesh Kumar Goud | త్రినేత్ర న్యూస్‌: ఏఐసీసీ పిలుపు మేరకు ఈ నెల 26న సంవిధాన్ రక్షక్ ర్యాలీ (Samvidhan Rakshak Rally) నిర్వ‌హించ‌బోతున్నామ‌ని.. హైద‌రాబాద్‌లోని లిబర్టీ అంబేద్కర్ విగ్రహం నుంచి ఇందిరాగాంధీ విగ్రహం వరకు ర్యాలీ కొన‌సాగుతుంద‌ని టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) తెలిపారు. సంవిధాన పరిరక్షణే లక్ష్యంగా కాంగ్రెస్ ర్యాలీ ఉంటుంద‌ని చెప్పారు. కోటీ ఓట్లు, 90 సీట్లే ల‌క్ష్యంగా ఎన్నిక‌ల‌కు వెళ్తామ‌న్నారు. హైద‌రాబాద్‌లోని గాంధీభ‌వ‌న్‌లో సోమ‌వారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. నూతన ఏఐసీసీ ఇన్‌ఛార్జి బి.ఎం. సందీప్‌కు ఘన స్వాగతం ప‌లికామ‌న్నారు.

పొలిటికల్ అఫైర్స్, అడ్వైజరీ కమిటీ సమావేశాల్లో సందీప్ పాల్గొన్నారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలపై సీఎం రేవంత్ రెడ్డి సమగ్ర వివరణ ఇచ్చారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో అభివృద్ధి, సంక్షేమం జ‌రుగుతుంది. ఈరోజు సాయంత్రం డీసీసీ అధ్యక్షులతో ఏఐసీసీ ఇన్‌ఛార్జి విడివిడిగా సమావేశం అవుతారు. సీఎం రేవంత్ రెడ్డి నిర్దేశించిన లక్ష్యంతో ముందుకు సాగుతాం అని మహేశ్ కుమార్ వెల్ల‌డించారు.

Advertisement
Advertisement