త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Parliament deadlock | విద్యార్థుల నిర‌స‌న‌ల‌పై అమిత్ షా ప్ర‌క‌ట‌న చేస్తారు : ప్ర‌భుత్వం

Parliament deadlock | ఢిల్లీలో విద్యార్థులపై పోలీసుల చర్యల (student protest) అంశంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటన చేయాలని ప్రతిపక్షాలు పట్టుబట్టడంతో పార్లమెంట్‌లో నెలకొన్న ప్రతిష్టంభనకు తెరపడే అవకాశం కనిపిస్తోంది. విద్యార్థుల‌కు సంబంధించిన అన్ని అంశాల‌పై చ‌ర్చించేందుకు ప్ర‌భుత్వం సిద్ధంగా ఉంద‌ని పార్ల‌మెంట‌రీ వ్య‌వ‌హారాల శాఖ‌ మంత్రి కిర‌ణ్ రిజుజు (Kiren Rijiju) సోమ‌వారం ప్ర‌క‌టించారు. హోం మంత్రి అమిత్ షా (Amit Shah)నే స్వ‌యంగా స‌మాధానం ఇస్తార‌ని తెలిపారు.

D

National | Published On Aug 10, 2026, 2.12 pm IST

Parliament deadlock | విద్యార్థుల నిర‌స‌న‌ల‌పై అమిత్ షా ప్ర‌క‌ట‌న చేస్తారు : ప్ర‌భుత్వం
Advertisement

Parliament deadlock | ఢిల్లీలో జులై 20న విద్యార్థుల నిరసనల (student protest) సంద‌ర్భంగా పోలీసుల చర్యల అంశం రాజ‌కీయ దుమారం రేపుతున్న విష‌యం తెలిసిందే. ఈ ఘ‌ట‌న‌పై కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amit Shah) స‌భ‌కు వ‌చ్చి ప్ర‌క‌ట‌న చేయాలంటూ విప‌క్ష పార్టీల ఎంపీలు పెద్ద ఎత్తున ఆందోళ‌న చేప‌డుతున్నారు. వారి నిర‌స‌న‌ల‌తో పార్ల‌మెంట్ వ‌ర్షాకాల స‌మావేశాల్లో డెడ్‌లాక్ (Parliament deadlock) కొన‌సాగుతోంది. అయితే, గ‌త కొన్ని రోజులుగా నెల‌కొన్న ఈ ప్ర‌తిష్టంభ‌న‌కు తెర‌ప‌డే అవ‌కాశం కనిపిస్తోంది. విద్యార్థుల‌పై లాఠీఛార్జ్‌, పెల్లెట్ గ‌న్స్ ప్ర‌యోగంపై హోం మంత్రి అమిత్ షా స‌భ‌కు వ‌చ్చి మాట్లాడ‌తార‌ని ప్ర‌భుత్వం తాజాగా స్ప‌ష్టం చేసింది.

విద్యార్థుల‌కు సంబంధించిన అన్ని అంశాల‌పై చ‌ర్చించేందుకు ప్ర‌భుత్వం సిద్ధంగా ఉంద‌ని పార్ల‌మెంట‌రీ వ్య‌వ‌హారాల శాఖ‌ మంత్రి కిర‌ణ్ రిజుజు (Kiren Rijiju) సోమ‌వారం తెలిపారు. ప్ర‌తిప‌క్షాలు లేవ‌నెత్తిన‌ అంశాల‌కు స‌మాధానం ఇస్తామ‌ని స్ప‌ష్టం చేశారు. ఆయా అంశాల‌కు హోం మంత్రి అమిత్ షానే స్వ‌యంగా స‌మాధానం ఇస్తార‌ని ఆయ‌న ప్ర‌క‌టించారు. అదే స‌మ‌యంలో హోం మంత్రి ప్ర‌క‌ట‌న సంద‌ర్భంగా ప్ర‌తిప‌క్షాలు ఎలాంటి గంద‌ర‌గోళం సృష్టించ‌కుండా స‌భ స‌జావుగా సాగేందుకు స‌హ‌క‌రించాల‌ని ఆయ‌న విజ్ఞ‌ప్తి చేశారు.

హోం మంత్రి ప్ర‌క‌ట‌న చేసే వ‌ర‌కూ పార్ల‌మెంట్ డెడ్‌లాక్ : కాంగ్రెస్‌

పార్లమెంట్ మార్చ్ సందర్భంగా విద్యార్థులపై ఢిల్లీ పోలీసులు లాఠీఛార్జ్ చేయడంపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా వివరణ ఇవ్వాలని ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ పట్టుబడుతోన్న విష‌యం తెలిసిందే. ఈ అంశంపై పార్ల‌మెంట్ లోప‌లా, బ‌య‌ట త‌మ నిర‌స‌న తెలుపుతోంది. షా స‌భ‌లో ప్ర‌క‌ట‌న చేసే వర‌కూ త‌మ నిర‌స‌న కొన‌సాగుతుంద‌ని స్ప‌ష్టం చేసింది. షా ప్రకటన చేసేవరకు పార్లమెంట్‌లో అధికార, ప్రతిపక్షాల మధ్య ప్రతిష్ఠంభన కొనసాగుతుందని కాంగ్రెస్ పార్టీ నాయకురాలు, ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా తేల్చి చెప్పారు. అదే స‌మ‌యంలో వర్షాకాల సమావేశాలు ముగియడానికి కేవలం నాలుగు రోజులు మాత్రమే మిగిలి ఉన్న నేపథ్యంలో విదేశీ నిధుల క్రమబద్ధీకరణ సవరణ చట్టం (FCRA) బిల్లును ప్ర‌వేశ‌పెట్టాల‌నే ఆలోచ‌న‌ను ప్ర‌భుత్వం త‌న వ‌ద్దే ఉంచుకోవాల‌ని సూచించారు. ప్ర‌జా వ్య‌తిరేక బిల్లుల‌ను బ‌ల‌వంతంగా ఆమోదిస్తే.. తీవ్ర ప‌రిణామాలు ఉంటాయ‌ని హెచ్చ‌రించారు. మ‌రోవైపు పోలీసుల దౌర్జ‌న్యంపై అమిత్ షా స‌మాధానం చెప్పాల్సిందేన‌ని ప్ర‌తిప‌క్ష నేత రాహుల్ గాంధీ స్ప‌ష్టం చేశారు.

Also Read..

వీబీ జీరామ్‌జీ ప‌థ‌కం.. తొలి నెల‌లోనే స‌గానికి ప‌డిపోయిన ఉపాధి ప‌నిదినాలు

పార్ల‌మెంట్ స‌మావేశాలు ఇంకా నాలుగు రోజులే ఉన్న‌య్‌.. అమిత్ షా హౌస్‌లోకి వస్త‌లేరు

ప్రియాంక కుటుంబానికి ప్ర‌భుత్వం అండ‌గా ఉంటుంది: మంత్రి వాకిటి శ్రీహ‌రి

Advertisement
Advertisement