Manne Krishank | లక్ష విలువ కూడా లేని కొండల్‌రెడ్డి కంపెనీకి.. వందల కోట్ల భూమిని 7 కోట్లకే కట్టబెట్టిండు
Manne Krishank | ట్రెజరాక్ట్ అడ్వాన్స్ సిస్టం ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ పేరుతో అనుముల కొండల్ రెడ్డి షెల్ కంపెనీ పెట్టారని.. ఇందుకోసం రావిర్యాలలోని ఫోర్త్ సిటీలో వందల కోట్ల విలువ చేసే ఐదెకరాల భూమిని సీఎం రేవంత్ తన తమ్మునికి కేవలం రూ.7 కోట్లకే కట్టబెట్టారని కార్పొరేషన్ మాజీ చైర్మన్ మన్నె క్రిశాంక్ ఆరోపించారు. కేవలం లక్ష రూపాయలతో ఒక చిన్న ఇంట్లో పెట్టిన ఈ కంపెనీలో ఒక్క ఎంప్లాయ్ కూడా లేరన్నారు.
- రేవంత్‌రెడ్డి పెద్ద భూ కుంభకోణానికి పాల్పడ్డడు
- ఒక చిన్న ఇంట్లో పెట్టిన కంపెనీలో ఒక్క ఎంప్లాయ్ కూడా లేరు
- దీన్ని వెంటనే రద్దు చేయాలి.. సీఎం రేవంత్ రాజీనామా చేయాలి
- కార్పొరేషన్ మాజీ చైర్మన్ మన్నె క్రిశాంక్ డిమాండ్
Manne Krishank | త్రినేత్ర.న్యూస్: ట్రెజరాక్ట్ అడ్వాన్స్ సిస్టం ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ పేరుతో అనుముల కొండల్ రెడ్డి షెల్ కంపెనీ పెట్టారని.. ఇందుకోసం రావిర్యాలలోని ఫోర్త్ సిటీలో వందల కోట్ల విలువ చేసే ఐదెకరాల భూమిని సీఎం రేవంత్ తన తమ్మునికి కేవలం రూ.7 కోట్లకే కట్టబెట్టారని కార్పొరేషన్ మాజీ చైర్మన్ మన్నె క్రిశాంక్ ఆరోపించారు. కేవలం లక్ష రూపాయలతో ఒక చిన్న ఇంట్లో పెట్టిన ఈ కంపెనీలో ఒక్క ఎంప్లాయ్ కూడా లేరన్నారు. దాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. దీనిపై బీజేపీ ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. తెలంగాణ భవన్‌లో సోమవారం నిర్వహించిన మీడియా సమావేశలో క్రిశాంక్ మాట్లాడుతూ రేవంత్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

3 ఏళ్ల పాలనలో సీఎం రేవంత్ రెడ్డి చేసింది ఏమీలేదు.. కుంభకోణాలు తప్ప. ఫోర్త్ సిటీ పేరుతో సీఎం రేవంత్ విచ్చలవిడిగా పెద్ద భూ కుంభకోణానికి పాల్పడ్డారు. నల్ల ధనాన్ని విదేశాలకు పంపి దాన్ని తెల్లగా మార్చుకోవాలని కుట్రలు చేస్తున్నారు. నల్లధనాన్ని చేతులు మారుస్తూ, తెలంగాణ ప్రజల ఆస్తులను తన అన్నదమ్ములకు, అనుచరులకు రేవంత్ దోచి పెడుతున్నాడు అని క్రిశాంక్ ఆరోపించారు. ట్రెజరాక్ట్ అడ్వాన్స్ సిస్టం ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ పేరుతో అనుముల కొండల్ రెడ్డి షెల్ కంపెనీ ఏర్పాటు చేసుకున్నరు. కేవలం లక్ష రూపాయలతో ఒక చిన్న ఇంట్లో ఈ కంపెనీ పెట్టారు. ఏరో స్పేస్ డిఫెన్స్ సిస్టమ్ ప్రొడక్షన్ చేయాలంటే లైసెన్స్ ఉండాలి. కానీ లైసెన్స్ లేదు.

దీనిపై బీజేపీ నేతలు ఎందుకు మాట్లాడరు?
ఆ కంపెనీలో ఒక్క ఎంప్లాయ్ కూడా లేరు. సొంత తమ్ముని కంపెనీకి ఫోర్త్ సిటీలో 5 ఎకరాలు కేటాయించారు. వందల కోట్ల విలువైన భూమిని తక్కువకే రేవంత్ ప్రభుత్వం కట్టబెట్టింది. సీఎం రేవంత్ రెడ్డి తమ కుటుంబ సభ్యులకు ఫోర్త్ సిటీ భూములు కట్టబెడుతున్నారు. దీనిపై సీఎం తన పదవి నుంచి వైదొలగి విచారణ జరిపించాలి. బీజేపీ నేతలు ఈ విషయంపై ఎందుకు స్పందించడం లేదు? కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది? దీనిపై పూర్తి స్థాయిలో విచారణ జరపాలి. భూముల కేటాయింపు రద్దు చేయాలని డిమాండ్. సీఎం వెంటనే తన పదవికి రాజీనామా చేయాలి అని మన్నె క్రిశాంక్ డిమాండ్ చేశారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Hidden Treasure | గుప్త నిధుల పేరుతో మోసాలకు పాల్పడుతున్న ముఠా అరెస్ట్..
ఆగస్టు 10, 2026

Chamala Kirankumar Reddy | పార్లమెంట్ సమావేశాలు ఇంకా నాలుగు రోజులే ఉన్నయ్.. అమిత్ షా హౌస్‌లోకి వస్తలేరు
ఆగస్టు 10, 2026

Priyanka | ప్రియాంక కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుంది: మంత్రి వాకిటి శ్రీహరి
ఆగస్టు 10, 2026
తాజావార్తలు
- ●VB-G RAM G | వీబీ జీరామ్‌జీ పథకం.. తొలి నెలలోనే సగానికి పడిపోయిన ఉపాధి పనిదినాలు
- ●అరవింద్ సుబ్రమణియంతో సీఎం భేటీ వెనుక మాస్టర్ ప్లాన్ ఇదే: కన్స్ట్రక్షన్ రంగంపై రేవంత్ రెడ్డి పన్ను నిఘా!
- ●Hidden Treasure | గుప్త నిధుల పేరుతో మోసాలకు పాల్పడుతున్న ముఠా అరెస్ట్..
- ●Chamala Kirankumar Reddy | పార్లమెంట్ సమావేశాలు ఇంకా నాలుగు రోజులే ఉన్నయ్.. అమిత్ షా హౌస్‌లోకి వస్తలేరు
- ●Portronics Lithius Pro | పోర్ట్రోనిక్స్ కొత్త డబుల్ అండ్ ట్రిపుల్ ఎ సైజ్ బ్యాటరీలు.. యూఎస్బీ టైప్ సి తోనే ఛార్జింగ్..
- ●Priyanka | ప్రియాంక కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుంది: మంత్రి వాకిటి శ్రీహరి

VB-G RAM G | వీబీ జీరామ్‌జీ పథకం.. తొలి నెలలోనే సగానికి పడిపోయిన ఉపాధి పనిదినాలు

అరవింద్ సుబ్రమణియంతో సీఎం భేటీ వెనుక మాస్టర్ ప్లాన్ ఇదే: కన్స్ట్రక్షన్ రంగంపై రేవంత్ రెడ్డి పన్ను నిఘా!

Hidden Treasure | గుప్త నిధుల పేరుతో మోసాలకు పాల్పడుతున్న ముఠా అరెస్ట్..

Chamala Kirankumar Reddy | పార్లమెంట్ సమావేశాలు ఇంకా నాలుగు రోజులే ఉన్నయ్.. అమిత్ షా హౌస్‌లోకి వస్తలేరు



