త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Reliance Jio | జియో బంప‌ర్ ఆఫ‌ర్‌.. కొత్త ప్లాన్‌లో ఏడాదిపాటు అన్ని ఓటీటీలు ఫ్రీ..

Reliance Jio | దేశంలోనే అతిపెద్ద టెలికాం సంస్థ రిలయన్స్ జియో మరోసారి తన కస్టమర్లను ఆకట్టుకునేలా రెండు కొత్త ఓటీటీ పాస్‌లను తీసుకొచ్చింది. పెరుగుతున్న డేటా అవసరాలు, ఓటీటీ వినోదాన్ని దృష్టిలో ఉంచుకుని రూ.550, రూ.2వేల ధరలకు కొత్త ప్రీపెయిడ్ పాస్‌లను ప్రవేశపెట్టింది. ఇవి దేశవ్యాప్తంగా ఉన్న జియో కస్టమర్లందరికీ అందుబాటులో ఉన్నాయి.

S

Technology | Published On Aug 10, 2026, 2.11 pm IST

Reliance Jio | జియో బంప‌ర్ ఆఫ‌ర్‌.. కొత్త ప్లాన్‌లో ఏడాదిపాటు అన్ని ఓటీటీలు ఫ్రీ..
Advertisement

Reliance Jio | దేశంలోనే అతిపెద్ద టెలికాం సంస్థ రిలయన్స్ జియో మరోసారి తన కస్టమర్లను ఆకట్టుకునేలా రెండు కొత్త ఓటీటీ పాస్‌లను తీసుకొచ్చింది. పెరుగుతున్న డేటా అవసరాలు, ఓటీటీ వినోదాన్ని దృష్టిలో ఉంచుకుని రూ.550, రూ.2వేల ధరలకు కొత్త ప్రీపెయిడ్ పాస్‌లను ప్రవేశపెట్టింది. ఇవి దేశవ్యాప్తంగా ఉన్న జియో కస్టమర్లందరికీ అందుబాటులో ఉన్నాయి. జియో ఇప్పటికే రూ.200 ఓటీటీ పాస్‌ను అందిస్తోంది. ఈ ప్యాక్ 28 రోజుల వ్యాలిడిటీతో 30జీబీ డేటాను అందించడంతోపాటు పలు లైవ్ టీవీ ఛానళ్లు, ఓటీటీ యాప్‌లను యాక్సెస్ చేసుకునే అవకాశం కల్పిస్తోంది. తాజాగా రూ.550, రూ.2వేల‌ పాస్‌లను అందించడంతో వినియోగదారులకు తమ అవసరాలకు అనుగుణంగా మరిన్ని ప్లాన్లు అందుబాటులోకి వచ్చాయి.

రూ.550 పాస్‌లో..

మధ్యకాలిక డేటా, ఓటీటీ ప్రయోజనాలు కోరుకునే వారికి రూ.550 పాస్ ఉపయోగకరంగా ఉంటుంది. ఈ డేటా ఆధారిత ప్యాక్ 84 రోజుల వ్యాలిడిటీతో మొత్తం 90జీబీ హైస్పీడ్ 4జీ డేటాను అందిస్తుంది. అయితే ఈ పాస్‌ను యాక్టివేట్ చేసుకోవాలంటే వినియోగదారుడి నంబర్‌పై ఇప్పటికే మూడు నెలలు లేదా ఏడాది వ్యాలిడిటీ ఉన్న బేస్ ప్రీపెయిడ్ ప్లాన్ యాక్టివ్‌గా ఉండాలి. ఈ ప్యాక్‌తో 84 రోజుల పాటు పలు ప్రముఖ ఓటీటీ సేవలను ఉపయోగించుకోవచ్చు. యూట్యూబ్ ప్రీమియం, అమెజాన్ ప్రైమ్ లైట్, జియోహాట్‌స్టార్, సోనీలివ్, జీ5, లయన్స్‌గేట్ ప్లే, డిస్కవరీ+, సన్‌ఎన్‌ఎక్స్‌టీ, కంచ లంక, ఈటీవీ విన్, చౌపాల్, హోయ్‌చోయ్, ఫ్యాన్‌కోడ్, టైమ్స్ ప్లే, తరంగ్ ప్లస్ వంటి సేవలకు యాక్సెస్ లభిస్తుంది. దీంతోపాటు జియోటీవీ మొబైల్ యాప్ ద్వారా 1వేయికి పైగా లైవ్ టీవీ ఛానళ్లను వీక్షించవచ్చు. ఈ పాస్‌లో మరో ముఖ్యమైన ప్రయోజనం 5జి అప్‌గ్రేడ్. వినియోగదారుడి బేస్ ప్లాన్‌లో 5జి సేవ లేకపోయినా, ఈ పాస్ ద్వారా 5జి నెట్‌వర్క్‌కు అప్‌గ్రేడ్ అయ్యే అవకాశం ఉంటుంది. దీని ద్వారా 84 రోజుల పాటు లేదా బేస్ ప్లాన్ గడువు ముగిసే వరకు, ఏది ముందుగా వస్తే అప్పటి వరకు అన్‌లిమిటెడ్ 5జి డేటా ప్రయోజనం లభిస్తుంది.

ఏడాదిపాటు కావాలంటే..

దీర్ఘకాలిక డేటా, ఓటీటీ ప్రయోజనాలు కోరుకునే వినియోగదారుల కోసం జియో రూ.2వేల‌ ప్రీపెయిడ్ ఓటీటీ పాస్‌ను తీసుకొచ్చింది. ఈ ప్యాక్ 365 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. ఏడాది కాలానికి మొత్తం 365జీబీ డేటాను అందిస్తుంది. అయితే ఈ ప్యాక్‌ను ఏడాది వ్యాలిడిటీ కలిగిన బేస్ ప్రీపెయిడ్ ప్లాన్ ఇప్పటికే ఉన్న కస్టమర్లు మాత్రమే వినియోగించుకోవచ్చు. ఓటీటీ ప్రయోజనాల విషయంలోనూ ఈ ప్లాన్ విస్తృతమైన ప్రయోజనాలను అందిస్తుంది. రూ.550 పాస్ మాదిరిగానే యూట్యూబ్ ప్రీమియం, అమెజాన్ ప్రైమ్ లైట్, జియోహాట్‌స్టార్, సోనీలివ్, జీ5, లయన్స్‌గేట్ ప్లే, డిస్కవరీ+, సన్‌ఎన్‌ఎక్స్‌టీ, కంచ లంక, ఈటీవీ విన్, చౌపాల్, హోయ్‌చోయ్, ఫ్యాన్‌కోడ్, టైమ్స్ ప్లే, తరంగ్ ప్లస్ వంటి ప్రీమియం ప్లాట్‌ఫామ్‌లకు యాక్సెస్ లభిస్తుంది. అలాగే జియోటీవీ యాప్ ద్వారా 1వేయికి పైగా లైవ్ టీవీ ఛానళ్లను వీక్షించవచ్చు.

Advertisement
Advertisement