త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Governors Convoy | ట్రాఫిక్‌లో ఇరుక్కుపోయిన గర్భిణి.. గ‌వ‌ర్న‌ర్ కాన్వాయ్‌కి అడ్డుగా రోడ్డుపై బైఠాయించిన భ‌ర్త‌

Governors Convoy | గ‌వ‌ర్న‌ర్ వెళ్తున్నాడ‌ని పోలీసులు ట్రాఫిక్‌ను ఆపేశారు. దీంతో అత్య‌వ‌స‌ర ప‌రిస్థితిలో గ‌ర్భ‌వ‌తిగా ఉన్న భార్యను ఆసుప‌త్రికి తీసుకెళ్తున్న ఓ వ్య‌క్తి ఒకింత అస‌హ‌నానికి గుర‌య్యాడు. తీవ్ర ఆగ్ర‌హంతో గ‌వ‌ర్న‌ర్ కాన్వాయ్ (Governors Convoy) ప్ర‌యాణించే రోడ్డుపై అడ్డంగా బైఠాయించి నిర‌స‌న తెలిపాడు. ఈ ఘ‌ట‌న బెంగ‌ళూరు (Bengaluru)లో చోటు చేసుకుంది.

D

National | Published On Jun 1, 2026, 3.26 pm IST

Governors Convoy | ట్రాఫిక్‌లో ఇరుక్కుపోయిన గర్భిణి.. గ‌వ‌ర్న‌ర్ కాన్వాయ్‌కి అడ్డుగా రోడ్డుపై బైఠాయించిన భ‌ర్త‌
Advertisement

Governors Convoy | రాజ‌కీయ ప్ర‌ముఖులు, వీఐపీలు వెళ్లే స‌మ‌యంలో కొద్దిసేపు ట్రాఫిక్‌ను నిలిపివేయ‌డం స‌ర్వ‌సాధార‌ణం. కానీ ఆ స‌మ‌యంలో ప్ర‌జ‌లు ప‌డే ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. చాలా మంది ఆఫీసుల‌కు వెళ్లే హ‌డావుడిలో ఉంటారు, మ‌రికొంద‌రు అత్య‌వ‌స‌ర ప‌రిస్థితుల్లో ఆసుప‌త్రికి వెళ్లే వాళ్లు ఉంటారు. వారంతా తీవ్ర ఇబ్బందులు ప‌డుతుంటారు. అయినా అధికారులు వారి ఇబ్బందుల‌ను ప‌ట్టించుకోరు. ప్రొటోకాల్‌, భ‌ద్ర‌త కార‌ణాల‌ను చూపుతూ.. ట్రాఫిక్‌ను గంట‌ల త‌ర‌బ‌డి ఆపి సామాన్య ప్ర‌జ‌ల‌ను ఇబ్బందుల‌కు గురి చేస్తుంటారు.

తాజాగా బెంగ‌ళూరు (Bengaluru)లో కూడా ఇలాంటి త‌ర‌హా ఘ‌ట‌నే చోటు చేసుకుంది. క‌ర్ణాట‌క గ‌వ‌ర్న‌ర్ థావ‌ర్‌చంద్ గ‌హ్లోత్ (Karnataka Governor Thaawarchand Gehlot) కాన్వాయ్ (Governors Convoy) ఓల్డ్ ఎయిర్‌పోర్టు రోడ్డు (Old Airport Road) వైపు వెళ్తుండ‌టంతో.. పోలీసులు ట్రాఫిక్‌ను ఆపేశారు. దాదాపు అర‌గంట‌పాటూ వాహ‌నాలు ఎక్క‌డివ‌క్క‌డే నిలిచిపోయాయి. దీంతో గ‌ర్భంతో ఉన్న త‌న భార్య‌ను అత్య‌వ‌స‌ర ప‌రిస్థితుల్లో ఆసుప‌త్రికి తీసుకెళ్తున్న ఓ వ్య‌క్తి ఒకింత అస‌హ‌నానికి గుర‌య్యాడు. తీవ్ర ఆగ్ర‌హంతో గ‌వ‌ర్న‌ర్ కాన్వాయ్ ప్ర‌యాణించే రోడ్డుపై అడ్డంగా బైఠాయించి నిర‌స‌న తెలిపాడు.

అండ‌ర్‌పాస్ నిర్మాణ ప‌నుల కార‌ణంగా ఇప్ప‌టికే ఈ ర‌హ‌దారి ర‌ద్దీగా ఉంద‌ని.. ఇప్పుడు ఇలా గ‌వ‌ర్న‌ర్ వెళ్తున్నాడ‌ని చెప్పి గంట‌లు గంట‌లు ట్రాఫిక్‌ను ఆపేస్తే ఎలా అంటూ ప్ర‌శ్నించాడు. త‌న భార్య గ‌ర్భ‌వ‌తి అని.. అత్య‌వ‌స‌ర ప‌రిస్థితుల్లో ఆసుప‌త్రికి తీసుకెళ్తున్న‌ట్లు చెప్పాడు. ఇలాంటి స‌మ‌యంలో ట్రాఫిక్‌ను ఆపేస్తే త‌ల్లీ, బిడ్డ‌కు ఏదైనా ప్ర‌మాదం జ‌రిగితే ఎవ‌రు బాధ్య‌త వ‌హిస్తారంటూ నిల‌దీశాడు.

పోలీసులు ఎంత చెప్పినా అత‌డు అక్క‌డి నుంచి క‌ద‌ల్లేదు. దీంతో చేసేదేమీ లేక పోలీసులు ఓ వైపు నుంచి వాహ‌నాల‌ను క్లియ‌ర్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. ఇది చూసిన నెటిజ‌న్లు పోలీసుల తీరుపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. అత్య‌వ‌స‌ర ప‌రిస్థితుల్లో ఉన్నా కూడా ఇలా వీఐపీల కాన్వాయ్‌లకే ప్రాధాన్య‌త ఇవ్వ‌డంపై మండిప‌డుతున్నారు. వ్య‌వ‌స్థ‌లో మార్పు ఎప్పుడు వ‌స్తుంది..? అంటూ ప్ర‌భుత్వాన్ని నిల‌దీస్తూ కామెంట్లు చేస్తున్నారు.

Also Read..

హ‌నీమూన్‌కు వెళ్తూ.. హెలికాప్ట‌ర్ ప్ర‌మాదంలో భారత సంతతి వ‌రుడు మృతి

హార్ముజ్ టెన్షన్స్: ఇండియాను ఆదుకుంటున్న 'ఒమన్' డీల్!

45 ఏళ్లకే కోటీశ్వ‌రులు కావాలంటే.. ఎస్ఐపీలో ఇలా చేయ‌వ‌చ్చు..

Advertisement
Advertisement