Traffic Restrictions | తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు.. రేపు పరేడ్ గ్రౌండ్స్ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు..!
Traffic Restrictions | జూన్ 2న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ప్రభుత్వం ఘనంగా నిర్వహించనున్నది. ఈ నేపథ్యంలో సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్స్ పరిధిలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. వేడుకలకు సీఎం రేవంత్‌రెడ్డి హాజరుకానున్నారు.
Traffic Restrictions | జూన్ 2న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ప్రభుత్వం ఘనంగా నిర్వహించనున్నది. ఈ నేపథ్యంలో సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్స్ పరిధిలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. వేడుకలకు సీఎం రేవంత్‌రెడ్డి హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరేడ్ గ్రౌండ్స్‌కు వెళ్లే రహదారులు, పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు, మళ్లింపులు అమల్లో ఉంటాయని పోలీసులు తెలిపారు. బేగంపేట, సంగీత్ జంక్షన్, తిరుమలగిరి, బోయిన్‌పల్లి, ట్యాంక్‌బండ్, సికింద్రాబాద్ ప్రాంతాల మధ్య ప్రయాణించే వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లేలా ప్లాన్ చేసుకోవాలని సూచించారు.
కార్యక్రమం జరిగే సమయంలో ప్రధాన రహదారులపై భారీగా ట్రాఫిక్ రద్దీ ఏర్పడే అవకాశం ఉందని హెచ్చరించారు. నగరవాసులు వీలైనంత వరకు మెట్రో రైలు, ఇతర ప్రజా రవాణా సేవలను వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. భారీ వాహనాలు, ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు పరేడ్ గ్రౌండ్స్ వైపు వెళ్లే వెళ్లొద్దని సూచించారు. ట్రాఫిక్ పరిస్థితులను సీసీటీవీ కెమెరాలు, ట్రాఫిక్ కంట్రోల్ రూమ్‌ల ద్వారా నిరంతరం పర్యవేక్షించనున్నట్లు అధికారులు తెలిపారు. ట్రాఫిక్‌కు సంబంధించిన తాజా సమాచారాన్ని సోషల్ మీడియా వేదికలు, ఎఫ్‌ఎం రేడియో ఛానళ్ల ద్వారా ఎప్పటికప్పుడు ప్రజలకు అందజేస్తామని పేర్కొన్నారు. ట్రాఫిక్‌కు సంబంధించిన సహాయం, సమాచారం అవసరమైతే 8712662999 నంబర్‌లోని ట్రాఫిక్ హెల్ప్‌లైన్‌ను సంప్రదించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Archita Sarangi Instagram post | 'ఆ పోస్ట్ నేనెందుకు డిలీట్ చేయాలి?' ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై బీజేపీ ఎంపీ కూతురి వైరల్ పోస్ట్
- ●Punjab Paper Leak | పంజాబ్‌లో పేపర్ లీక్ చిచ్చు: విద్యా శాఖ మంత్రి రాజీనామాకు బీజేపీ డిమాండ్
- ●CWG 2026 | గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్.. వెయిట్లిఫ్ట్లో భారత్‌కు సిల్వర్..!
- ●Mrunal Thakur | మృణాల్ తగ్గేదేలే - హిట్లు లేకపోయినా రెమ్యూనరేషన్‌ను భారీగా పెంచిన బ్యూటీ
- ●BCCI Review | టీమిండియా ప్రదర్శనపై బీసీసీఐ సమీక్ష.. గంభీర్ సపోర్ట్ స్టాఫ్‌పై చర్చించే ఛాన్స్..!
- ●Siddaramaiah | ఇకపై ఏ ఎన్నికల్లోనూ పోటీ చేయను : సిద్ధరామయ్య

Archita Sarangi Instagram post | 'ఆ పోస్ట్ నేనెందుకు డిలీట్ చేయాలి?' ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై బీజేపీ ఎంపీ కూతురి వైరల్ పోస్ట్

Punjab Paper Leak | పంజాబ్‌లో పేపర్ లీక్ చిచ్చు: విద్యా శాఖ మంత్రి రాజీనామాకు బీజేపీ డిమాండ్

CWG 2026 | గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్.. వెయిట్లిఫ్ట్లో భారత్‌కు సిల్వర్..!

Mrunal Thakur | మృణాల్ తగ్గేదేలే - హిట్లు లేకపోయినా రెమ్యూనరేషన్‌ను భారీగా పెంచిన బ్యూటీ




