England vs Mexico | మెక్సికోపై ఇంగ్లండ్ విజయం
England vs Mexico | సొంత మైదానంలో మెక్సికోను ఇంగ్లండ్ చిత్తు చేసి క్వార్టర్ ఫైనల్స్‌లోకి దూసకెళ్లింది. ఉరుములు, మెరుపులతో గంట పాటు మ్యాచ్ ఆలస్యమైంది. 80వేల మందికిపైగా అభిమానుల హోరు మధ్య మ్యాచ్ హోరాహోరీగా సాగింది. ఓ ఆటగాడు రెడ్‌కార్డ్‌తో మైదానం వీడాల్సి రాగా.. మిగతా పది మందితోనే పోరాడి ఇంగ్లిష్ జట్టు గెలుపొందింది.
- క్వార్టర్ ఫైనల్‌కు దూసుకెళ్లిన టుచెల్ టీమ్
- సొంత గడ్డపైనే మెక్సికోను ఓడించిన ఇంగ్లిష్ జట్టు
- హోరాహోరీగా సాగిన మ్యాచ్
- నార్వేను ఢీకొట్టున్న ఇంగ్లిష్ టీమ్
England vs Mexico | సొంత మైదానంలో మెక్సికోను ఇంగ్లండ్ చిత్తు చేసి క్వార్టర్ ఫైనల్స్‌లోకి దూసకెళ్లింది. ఉరుములు, మెరుపులతో గంట పాటు మ్యాచ్ ఆలస్యమైంది. 80వేల మందికిపైగా అభిమానుల హోరు మధ్య మ్యాచ్ హోరాహోరీగా సాగింది. ఓ ఆటగాడు రెడ్‌కార్డ్‌తో మైదానం వీడాల్సి రాగా.. మిగతా పది మందితోనే పోరాడి ఇంగ్లిష్ జట్టు గెలుపొందింది. మెక్సికోపై 3-2తో విజయం సాధించి ఫిఫా ప్రపంచకప్ క్వార్టర్ ఫైనల్‌లోకి అడుగుపెట్టింది. తర్వాతి మ్యాచ్‌లో నార్వేతో ఇంగ్లండ్ తలపడనుంది.
వర్షంతో గంట ఆలస్యంగా..
ప్రపంచ ఫుట్‌బాల్‌లో అత్యంత ప్రతిష్ఠాత్మక వేదికల్లో ఒకటైన ఎస్టాడియో అజ్టెకా స్టేడియంలో ఈ మ్యాచ్‌కు ముందు భారీ వర్షం, ఉరుములతో కిక్‌ఆఫ్ దాదాపు గంట ఆలస్యమైంది. ఆటగాళ్లు డ్రెస్సింగ్ రూమ్‌లకు వెళ్లగా.. 80వేల మందికిపైగా అభిమానులు మాత్రం వర్షం తగ్గేందుకు ఎదురుచూశారు. దీంతో మ్యాచ్‌పై ఉత్కంఠ మరింత పెరిగింది. వర్షం తగ్గిన తర్వాత జట్లు మైదానంలోకి అడుగుపెట్టగానే మెక్సికో అభిమానులు స్టేడియాన్ని హోరెత్తించారు. సొంత మైదానం కావడంతో అభిమానులు ఆటగాళ్లకు మద్దతు తెలుపుతూ ఉత్సాహపరిచారు.
తొలి అర్ధభాగంలో బెల్లింగ్‌హామ్ మెరుపులు..
మ్యాచ్ ప్రారంభం నుంచే మెక్సికో దూకుడుగా ఆడింది. ఇంగ్లండ్ మిడ్‌ఫీల్డ్‌పై ఒత్తిడి పెంచుతూ ఎటాకింగ్ చేసింది. మెక్సికోనే తొలి గోల్ చేసేందుకు ప్రయత్నించింది. రౌల్ జిమెనెజ్ హెడ్డర్‌తో ప్రయత్నించగా.. ఇంగ్లండ్ గోల్‌కీపర్ జోర్డాన్ పిక్‌ఫోర్డ్ అద్భుతంగా అడ్డుకోవడంతో గండం తప్పింది. కొద్దిసేపటికే ఇంగ్లండ్ ఆటలో పట్టు సాధించింది. బుకాయో సాకా కుడివైపు నుంచి ఇచ్చిన అద్భుతమైన క్రాస్‌ను జూడ్ బెల్లింగ్‌హామ్ అద్భుత హెడ్డర్‌తో గోల్‌గా మలిచి జట్టుకు ఆధిక్యం అందించాడు. ఆ గోల్ సంబరాలు ముగియకముందే మరోసారి బెల్లింగ్‌హామ్ మెరిశాడు. హ్యారీ కేన్ ఇచ్చిన చక్కటి పాస్‌ను అందుకొని ప్రత్యర్థి డిఫెన్స్‌ను ఛేదిస్తూ మరో గోల్ సాధించాడు. కేవలం 98 సెకన్ల వ్యవధిలో రెండు గోల్స్ నమోదు చేసి మెక్సికో అభిమానులకు షాక్ ఇచ్చాడు. అయితే, తొలి అర్ధభాగం ముగిసేలోపే మెక్సికో మళ్లీ మ్యాచ్‌పై పట్టు సాధించింది. రోబర్టో అల్వరాడో ఫ్రీకిక్‌తో గందరగోళం కాగా.. జూలియన్ క్వినోనెస్ సద్వినియోగం చేసుకుని సమీపం నుంచి గోల్ వేశాడు. దీంతో తొలి అర్ధభాగం ముగిసే సమయానికి ఇంగ్లండ్ 2-1 ఆధిక్యంలో నిలిచింది.
రెండో భాగంలో ఇలా..
విరామం తర్వాత మ్యాచ్ పూర్తిగా మలుపు తిరిగింది. 54వ నిమిషంలో జారెల్ క్వాన్సా జీసస్ గల్లార్డో చేసిన టాకిల్‌కు తొలుత రిఫరీ ఎల్లో కార్డ్ చూపించాడు. అయితే, వీఏఆర్ సమీక్ష అనంతరం దాన్ని రెడ్‌కార్డ్‌గా మార్చారు. దీంతో ఇంగ్లండ్ మిగిలిన సమయమంతా పది మంది ఆటగాళ్లతోనే ఆడాల్సి వచ్చింది. అయినా, ఇంగ్లండ్ వెనక్కి తగ్గలేదు. ఆంథోనీ గోర్డన్‌పై మెక్సికో గోల్‌కీపర్ రౌల్ రాంగెల్ ఫౌల్ చేయడంతో ఇంగ్లండ్‌కు పెనాల్టీ లభించింది. హ్యారీ కేన్ ఎలాంటి తప్పిదం చేయకుండా గోల్ సాధించి స్కోరును 3-1కు చేర్చాడు. ఈ టోర్నీలో కేన్‌కు ఇది ఆరో గోల్. కొద్దిసేపటికే మరోసారి వీఏఆర్ జోక్యంతో మెక్సికోకు పెనాల్టీ దక్కింది. బాక్స్‌లో బంతిని క్లియర్ చేసే ప్రయత్నంలో కేన్ కాలు బ్రియాన్ గుటియెరెజ్‌ను తాకిందని రిఫరీ పెనాల్టీ ఇచ్చాడు. రౌల్ జిమెనెజ్ పెనాల్టీని గోల్‌గా మలిచి స్కోరును 3-2కు తగ్గించాడు.
చివరి వరకు ఉత్కంఠ
పది మంది ఆటగాళ్లతో ఆడుతున్న ఇంగ్లండ్‌పై మెక్సికో ఎటాకింగ్‌కు దిగింది. ఇరువైపుల నుంచి క్రాస్‌లు, షాట్లతో సమం చేసే ప్రయత్నం చేసింది. అయితే, ఇంగ్లండ్ డిఫెన్స్ అద్భుతంగా రాణించింది. డెక్లాన్ రైస్ మిడ్‌ఫీల్డ్‌లో కీలక పాత్ర పోషిస్తూ మెక్సికో ఎటాకింగ్‌ను నిలువరించాడు. ఎజ్రీ కొన్సా, మార్క్ గుయేహి ప్రతి క్రాస్‌ను సమర్థంగా ఎదుర్కొన్నారు. గోల్‌కీపర్ పిక్‌ఫోర్డ్ సైతం కీలక సేవ్స్‌ను జట్టును ఆదుకున్నాడు. అదనపు సమయంగా 12 నిమిషాలు ప్రకటించడంతో మరోసారి ఉత్కంఠ నెలకొంది. మెక్సికో సమం చేసేందుకు చివరి వరకు తీవ్రంగా ప్రయత్నించినా ఇంగ్లండ్ డిఫెన్స్ అవకాశం ఇవ్వకుండా జట్టు విజయంలో కీలకపాత్ర పోషించింది. ఫైనల్ విజిల్ మోగగానే ఇంగ్లండ్ ఆటగాళ్లు ఊపిరి పీల్చుకున్నారు. ముందుగా మైదానం మధ్యలో ఒకరినొకరు ఆలింగనం చేసుకొని.. అనంతరం స్టేడియం మొత్తం కలియదిరుగుతూ ఇంగ్లండ్ అభిమానులతో కలిసి సంబరాలు జరుపుకున్నారు. మెక్సికో అభిమానుల హూటింగ్ మధ్య ప్రారంభమైన ఈ మ్యాచ్... చివరకు ఇంగ్లండ్ అభిమానుల విజయగీతాలతో ముగిసింది. ఎన్నో ఒడిదొడుకులను దాటుకుని సాధించిన ఈ విజయం ప్రపంచకప్‌లో ఇంగ్లండ్ ఫుట్‌బాల్ చరిత్రలో ఇదో అద్భుత విజయాల్లో ఒకటిగా నిలిచింది.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Reverse Waterfall | రివర్స్ వాటర్‌ఫాల్.. ఆ అద్భుత దృశ్యం చూస్తే పులకించిపోవాల్సిందే..
- ●Hyderabad | ఎగ్జామ్ ప్యాడ్‌ను విసిరేసిన టీచర్.. తెగిపోయిన విద్యార్థిని చెవి
- ●White Cobra | నిర్మల్ జిల్లాలో అరుదైన శ్వేతనాగు ప్రత్యక్షం..
- ●Hyderabad | కలిసి మద్యం సేవించారు.. స్నేహితుడిని హత్య చేశారు..
- ●Sreeleela | లెనిన్ రిలీజ్ వేళ - శ్రీలీలను ట్రోల్ చేస్తున్న నెటిజన్లు - ఎందుకంటే?
- ●Nora Fatehi | ఫుట్‌బాల్ వరల్డ్ కప్‌లో మొరాకో ఓటమి - కన్నీళ్లు పెట్టుకున్న నోరా ఫతేహి - కారణం ఇదే!

Reverse Waterfall | రివర్స్ వాటర్‌ఫాల్.. ఆ అద్భుత దృశ్యం చూస్తే పులకించిపోవాల్సిందే..

Hyderabad | ఎగ్జామ్ ప్యాడ్‌ను విసిరేసిన టీచర్.. తెగిపోయిన విద్యార్థిని చెవి

White Cobra | నిర్మల్ జిల్లాలో అరుదైన శ్వేతనాగు ప్రత్యక్షం..

Hyderabad | కలిసి మద్యం సేవించారు.. స్నేహితుడిని హత్య చేశారు..






