త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

PM Modi | పిల్ల‌ల్ని డిజిట‌ల్ వ్య‌స‌నం నుంచి బ‌య‌ట‌ప‌డేయాలి.. ఉపాధ్యాయుల‌కు ప్ర‌ధాని మోదీ సూచ‌న‌

PM Modi | విద్యార్థుల్లో (students)పెరుగుతున్న స్క్రీన్ టైమ్ (screen time) ప‌ట్ల ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ (PM Modi) ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. ఈ అలవాటును తగ్గించి పిల్లలను డిజిటల్ వ్యసనం నుంచి బయటపడేసేందుకు ఉపాధ్యాయులు చొరవ చూపాలని పిలుపునిచ్చారు.

D

National | Published On Sep 5, 2026, 1.17 pm IST

PM Modi | పిల్ల‌ల్ని డిజిట‌ల్ వ్య‌స‌నం నుంచి బ‌య‌ట‌ప‌డేయాలి.. ఉపాధ్యాయుల‌కు ప్ర‌ధాని మోదీ సూచ‌న‌
Advertisement

PM Modi | త్రినేత్ర‌.న్యూస్ : విద్యార్థుల్లో (students) పెరుగుతున్న స్క్రీన్ టైమ్ (screen time) ప‌ట్ల ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. ఈ అలవాటును తగ్గించి పిల్లలను డిజిటల్ వ్యసనం నుంచి బయటపడేసేందుకు ఉపాధ్యాయులు చొరవ చూపాలని పిలుపునిచ్చారు. ఇవాళ ఉపాధ్యాయ దినోత్సవాన్ని (Teachers Day) పురస్కరించుకుని జాతీయ స్థాయిలో ఉత్తమ అవార్డులకు ఎంపికైన ఉపాధ్యాయులతో (national award-winning teachers) ప్రధాన మంత్రి 7, లోక్ కళ్యాణ్ మార్గ్‌లోని తన నివాసంలో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వినూత్న బోధనా పద్ధతులు, స్పీచ్‌లు, స్క్రీన్ వ్యసనం, మాదకద్రవ్యాల దుర్వినియోగం వంటి అంశాలపై ఉపాధ్యాయుల‌తో చ‌ర్చించారు.

ప్ర‌స్తుత స‌మాజంలో సాంకేతికత అవసరమే అయినప్పటికీ స్క్రీన్ టైమ్ ఓ వ్యసనంలా మారిందని ప్ర‌ధాని ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. క్రీడ‌ల‌పై విద్యార్థుల‌కు ఆస‌క్తి పెరిగేలా చేస్తే స్క్రీన్ అడిక్షన్ నుంచి వారు బయటపడే అవకాశం ఉంద‌ని అభిప్రాయం వ్య‌క్తం చేశారు. విద్యార్థుల‌కు చ‌దువుతోపాటూ క్రీడ‌లు కూడా చాలా ముఖ్య‌మ‌ని చెప్పారు. అంతేకాకుండా నూత‌న సాంకేతిక‌త‌ల‌పై విద్యార్థుల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు అవ‌గాహ‌న క‌ల్పించాల‌ని సూచించారు. అలా అని పిల్ల‌ల్ని త‌ర‌గ‌తి గ‌దుల‌కే ప‌రిమితం చేయ‌కూడ‌ద‌ని చెప్పారు. తరగతి గదుల్లో విద్యార్థులను ఆకట్టుకునేలా సరికొత్త, ఆచరణాత్మక బోధనా పద్ధతులను అవలంబించాలని సూచించారు.

కేవలం పుస్తక జ్ఞానమే కాకుండా, విద్యార్థుల్లో నైతిక విలువలు, జీవన నైపుణ్యాలను పెంపొందించడంపై ఉపాధ్యాయులు దృష్టి సారించాలని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. ముఖ్యంగా యువతను పాడుచేస్తున్న డ్రగ్స్ మ‌హ‌మ్మారిపై విద్యార్థుల్లో అవగాహన కల్పించాలని కోరారు. పిల్ల‌లు ఏం చేస్తున్నారు, ఎలా ప్ర‌వ‌ర్తిస్తున్నారు, వారి అల‌వాట్ల‌ను నిరంత‌రం గ‌మ‌నిస్తూ ఉండాల‌న్నారు. పిల్ల‌లు త‌మ బాల్యాన్ని కోల్పోకూడ‌ద‌ని చెప్పారు. సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర అత్యంత కీలకమని తెలిపారు. కేవలం సిలబస్ బోధనకే పరిమితం కాకుండా విద్యార్థుల్లోని ప్రతిభను వెలికితీస్తూ వారిలో బాల్యం చనిపోకుండా కాపాడాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపైనే ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. అదే స‌మ‌యంలో ఉపాధ్యాయులు సైతం తరగతి గదుల్లో అమలు చేస్తున్న వినూత్న విద్యాబోధనా పద్ధతులను ప్రధానితో పంచుకున్నారు.

Advertisement
Advertisement