Viral Metro Challenge | ఇంటర్నెట్‌ను షేక్ చేస్తున్న ‘ఫోన్ స్టికింగ్’ మెట్రో ఛాలెంజ్.. ఈ వైరల్ వీడియోల వెనుక ఉన్న అసలు సీక్రెట్ ఇదే!
మెట్రో విండోకి ఫోన్ అంటించి ప్లాట్‌ఫాంపై స్టెప్పులు వేస్తున్న వీడియోలు చూశారా? ఫోన్ పడిపోదా అని షాక్ అవుతున్నారా? ఈ వైరల్ ట్రిక్ వెనుక ఉన్న సీక్రెట్ ఇదే.
Viral news | Published On Sep 5, 2026, 12.55 pm IST
- ఇంటర్నెట్‌లో విపరీతంగా వైరల్ అవుతున్న కొత్త 'ఫోన్ స్టికింగ్' (Phone-sticking) మెట్రో ఛాలెంజ్
- మెట్రో కిటికీకి బయట నుంచి ఫోన్ అంటించి రికార్డ్ చేస్తున్నట్లు కనిపించే ఓ విజువల్ ఇల్యూజన్ ఇది
- నిజానికి ఫోన్ బయట ఉండదు, ట్రైన్ లోపల ఉన్న కెమెరామెన్ ఈ వీడియోను షూట్ చేస్తాడు
- కేవలం అద్భుతమైన ఎడిటింగ్ వల్లే ఇది నిజమని భ్రమ పడతాం, దయచేసి దీన్ని మీరు ట్రై చేయకండి
Viral Metro Challenge | త్రినేత్ర.న్యూస్ : ప్రస్తుతం సోషల్ మీడియాను ఓ కొత్త ఛాలెంజ్ ఊపేస్తోంది. అదే 'ఫోన్ స్టికింగ్' (Phone-sticking) ఛాలెంజ్. మన సిటీ మెట్రో స్టేషన్లలో కొందరు క్రియేటర్లు చేస్తున్న ఈ విజువల్ ఇల్యూజన్ వీడియోలు ఇప్పుడు ఇంటర్నెట్‌లో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. అసలేంటి ఈ ట్రెండ్? దీని వెనుక ఉన్న అసలు నిజం ఏంటి?
మీరు ఇప్పటికే మీ ఇన్‌స్టాగ్రామ్ ఫీడ్‌లో ఈ వీడియోలను చూసే ఉంటారు. ఒక క్రియేటర్ మెట్రో విండోకు బయట నుంచి తన ఫోన్‌ను అంటిస్తాడు. మెట్రో కదలడం మొదలవ్వగానే, ఆ క్రియేటర్ ప్లాట్‌ఫాంపై ఉండి డాన్స్ చేయడం లేదా స్టైలిష్‌గా పోజులివ్వడం చేస్తాడు. ఫోన్ మాత్రం ట్రైన్ కిటికీకి అతుక్కునే వెళ్తున్నట్లు కనిపిస్తుంది. మొదటిసారి ఈ వీడియో చూసిన ఎవరైనా సరే.. "అరె, ఆ ఫోన్ కింద పడిపోదా? ఎవరైనా దొంగిలిస్తే పరిస్థితి ఏంటి బ్రో?" అని ఆశ్చర్యపోవడం ఖాయం.
కానీ ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. ఆ క్రియేటర్ కేవలం బయట నుంచి తన ఫోన్‌ను అంటించినట్లు నటిస్తాడు అంతే. నిజానికి ఆ ట్రైన్ లోపల సదరు క్రియేటర్ కెమెరామెన్ (Cameraman) కూర్చుని ఉంటాడు. అతను లోపలి నుంచి ఆ వీడియోను షూట్ చేస్తాడు.
ఆ తర్వాత ఇండోర్ క్లిప్ (లోపల తీసిన వీడియో), ఔట్‌డోర్ క్లిప్ (బయట తీసిన వీడియో) రెండింటినీ కలిపి అద్భుతంగా ఎడిట్ చేస్తారు. ఆ స్మార్ట్ ఎడిటింగ్ వల్లే కెమెరా కూడా ట్రైన్‌తో పాటే మూవ్ అవుతున్నట్లు మనకు ఒక ఇల్యూజన్ క్రియేట్ అవుతుంది.
సో, ఆ క్రియేటర్ల టాలెంట్‌ను, ఎడిటింగ్ స్కిల్స్‌ను కచ్చితంగా మెచ్చుకోవాల్సిందే. కానీ.. నిజంగానే ఫోన్ అతుక్కుంటుందేమో అని పొరపాటున కూడా మీ సొంత ఫోన్‌తో ఈ ట్రిక్‌ను ట్రై చేసే రిస్క్ మాత్రం చేయకండి!
यह 'फोन-स्टिकिंग' चैलेंज, इंटरनेट पर आजकल तेजी से वायरल हो रहा है।
एक नया विजुअल इल्यूजन अब हर शहर की मेट्रो में देखा जा रहा है,
आपने देखा होगा, एक क्रिएटर मेट्रो की खिड़की पर अपना फोन चिपकाता है,
मेट्रो चल देती है और क्रिएटर प्लेटफॉर्म पर डांस या पोज़ देने लगता है,
वीडियो… pic.twitter.com/VBrsEcIy0e
— Vishal M. Yadav (@VishalMYadav_) September 4, 2026
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●POCO X8 | 9000 ఎంఏహెచ్ బ్యాటరీతో పోకో కొత్త ఫోన్.. పవర్ఫుల్ ఫీచర్లు..
- ●Ponnam Prabhakar | కేసీఆర్ రాజీనామాకు ఒత్తిడి తెద్దాం.. ఇందిరా పార్క్ మహాధర్నాకు తరలి రండి
- ●Revanth Reddy | రెండేండ్లు సమయమివ్వండి.. టీచర్లకు సీఎం రేవంత్ విజ్ఞప్తి
- ●Rashmika Mandanna | ఎపిక్ ట్రైలర్ లాంఛ్ వేడుకలో మెరిసిన రష్మిక - మరిది సినిమా ఈవెంట్‌కు గెస్ట్‌గా వదిన
- ●Nepal Floods | వరదలకు కలుషితమైన నీరు.. నేపాల్ బాధితులను వెంటాడుతున్న అంటు వ్యాధుల ముప్పు
- ●Vaishnavi Chaitanya | నీ పేరు ఎవరికి తెలియదని అవమానించారు - వైష్ణవి చైతన్య ఎమోషనల్ కామెంట్స్

POCO X8 | 9000 ఎంఏహెచ్ బ్యాటరీతో పోకో కొత్త ఫోన్.. పవర్ఫుల్ ఫీచర్లు..

Ponnam Prabhakar | కేసీఆర్ రాజీనామాకు ఒత్తిడి తెద్దాం.. ఇందిరా పార్క్ మహాధర్నాకు తరలి రండి

Revanth Reddy | రెండేండ్లు సమయమివ్వండి.. టీచర్లకు సీఎం రేవంత్ విజ్ఞప్తి

Rashmika Mandanna | ఎపిక్ ట్రైలర్ లాంఛ్ వేడుకలో మెరిసిన రష్మిక - మరిది సినిమా ఈవెంట్‌కు గెస్ట్‌గా వదిన




