PM Modi | భారత నారీ శక్తి విజయాలు దేశానికి గర్వకారణం: ప్రధాని మోదీ
PM Modi | అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం దేశంలోని మహిళలకు శుభాకాంక్షలు తెలిపారు. దేశ అభివృద్ధిలో భారతీయ నారీ శక్తి సాధిస్తున్న విజయాలు జాతీయ గర్వానికి కారణమని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన తన ఎక్స్ ఖాతాలో పోస్టు పెట్టారు.
PM Modi | అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం దేశంలోని మహిళలకు శుభాకాంక్షలు తెలిపారు. దేశ అభివృద్ధిలో భారతీయ నారీ శక్తి సాధిస్తున్న విజయాలు జాతీయ గర్వానికి కారణమని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన తన ఎక్స్ ఖాతాలో పోస్టు పెట్టారు. మహిళల సాధికారత తమ ప్రభుత్వ విధానాల్లో కీలక స్తంభంగా ఉందని ప్రధాని స్పష్టం చేశారు. ప్రతి మహిళ తన సంపూర్ణ సామర్థ్యాన్ని ప్రదర్శించగల వాతావరణాన్ని కల్పించడం, అలాగే భారత అభివృద్ధి ప్రయాణంలో వారు ముఖ్య పాత్ర పోషించేలా చేయడం పట్ల ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన తెలిపారు.
https://twitter.com/narendramodi/status/2030501848407523679
మహిళలకు శుభాకాంక్షలు..
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మన నారీ శక్తికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ప్రతి రంగంలో మహిళలు సంకల్పం, సృజనాత్మకత, అపారమైన ఉత్సాహంతో భారత పురోగతిని రూపుదిద్దుతున్నారు. వారి విజయాలు మన దేశానికి ప్రేరణగా నిలుస్తున్నాయి. అభివృద్ధి చెందిన భారత్ నిర్మాణంలో మన సంకల్పాన్ని మరింత బలపరుస్తున్నాయి.. అని మోదీ తన సందేశంలో పేర్కొన్నారు.
భారత్ అభివృద్ధి దిశగా ముందుకు సాగుతున్న కొద్దీ మహిళల ఆకాంక్షలు, వారి కృషి దేశాన్ని శక్తివంతమైన, సుసంపన్నమైన దేశంగా మార్చే ప్రయాణానికి మార్గదర్శకంగా ఉంటాయని ఆయన తెలిపారు. భారత నారీ శక్తి సాధించిన విజయాలు దేశానికి గర్వకారణం. దేశ నిర్మాణంలో మహిళలు పోషిస్తున్న పాత్రను అవి స్పష్టంగా గుర్తుచేస్తున్నాయి.. అని ప్రధాని మోదీ అన్నారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Rukmini Vasanth | ఎన్టీఆర్ డ్రాగన్ సెట్స్‌లో రుక్మిణి వసంత్
- ●Rahul Gandhi | ప్రజాస్వామ్యానికి చరమగీతం పాడేందుకే 850 సీట్ల ప్రతిపాదన
- ●Ar Rahman | మ్యూజిక్ నచ్చలేదని నిర్మాత రెమ్యూనరేషన్ ఇవ్వలేదు - రణబీర్‌కపూర్ సినిమాపై ఏఆర్ రెహమాన్ కామెంట్స్
- ●V Srinivas Goud | ఓబీసీ కుల గణనకు అన్ని రాష్ట్రాల అసెంబ్లీలలో తీర్మానాలు చేయాలి
- ●Tata Sons | టాటా గ్రూప్ వివాదం.. సుప్రీంకోర్టును ఆశ్రయించిన టాటా సన్స్
- ●High Court | బావర్చి హోటల్ ఘటనలో బీఆర్ఎస్ నేతలకు భారీ ఊరట.. అరెస్టు చేయొద్దంటూ హైకోర్టు ఆదేశాలు

Rukmini Vasanth | ఎన్టీఆర్ డ్రాగన్ సెట్స్‌లో రుక్మిణి వసంత్

Rahul Gandhi | ప్రజాస్వామ్యానికి చరమగీతం పాడేందుకే 850 సీట్ల ప్రతిపాదన

Ar Rahman | మ్యూజిక్ నచ్చలేదని నిర్మాత రెమ్యూనరేషన్ ఇవ్వలేదు - రణబీర్‌కపూర్ సినిమాపై ఏఆర్ రెహమాన్ కామెంట్స్

V Srinivas Goud | ఓబీసీ కుల గణనకు అన్ని రాష్ట్రాల అసెంబ్లీలలో తీర్మానాలు చేయాలి






