Mirza Rahmat Baig | మైనర్ బాలికపై లైంగికదాడి ఆరోపణలు.. ఎమ్మెల్సీ మీర్జా రహ్మత్ బేగ్‌పై ఎంఐఎం వేటు
Mirza Rahmat Baig | హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ మీర్జా రెహ్మత్ బేగ్‌ను (Mirza Rahmat Baig) పార్టీ నుంచి ఐంఐఎం (MIM) బహిష్కరించింది. బహిష్కరణ వేటు తక్షణమే అమల్లోకి వస్తుందని వెల్లడించింది.
Mirza Rahmat Baig | త్రినేత్ర.న్యూస్: హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ మీర్జా రెహ్మత్ బేగ్‌ను (Mirza Rahmat Baig) పార్టీ నుంచి ఐంఐఎం (MIM) బహిష్కరించింది. బహిష్కరణ వేటు తక్షణమే అమల్లోకి వస్తుందని వెల్లడించింది. ఆయన వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని, దానిని మండలి చైర్మన్‌కు అందించాలని ఆదేశించింది. ఈమేరకు పార్టీ సంయుక్త కార్యదర్శి ఎస్ఏ హుస్సెయిన్ ఆదేశాలు జారీచేశారు. అయితే ఎందుకు బహిష్కరిస్తున్నారనే విషయాన్ని వెల్లడించలేదు.
కాగా, ఎమ్మెల్సీని గుర్తుతెలియని వ్యక్తులు బెదిరించిన (Blackmailing) విషయం తెలిసిందే. ఈ వ్యవహారంపై ఆయన సైబర్ క్రైమ్ (Cyber Crime Police) పోలీసులను ఆశ్రయించారు. మరుసటి రోజే ఆయనపై బహిష్కరణ వేటు పడటం గమనార్హం. అడిగినంత డబ్బు ఇవ్వకపోతే డీప్‌ఫేక్ (Deepfake), మార్ఫింగ్ ఫొటోలు (Morphed Photographs), వీడియోలను (Videos) బయటపెడతామని దుండగులు బెదిరింపులకు దిగారు. డబ్బులు ఇవ్వకుంటే కుటుంబ పరువుతో పాటు రాజకీయంగానూ ఇబ్బందులు ఎదుర్కొనేలా చేస్తామని పలుమార్లు ఫోన్ చేసి హెచ్చరించారు. ఎమ్మెల్సీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. బెదిరింపు కాల్స్ ఎక్కడి నుంచి వచ్చాయి?, ఫోన్ చేసిన వ్యక్తులు ఎవరు? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
బాలికపై లైంగికదాడి ఆరోపణలు..
అయితే ఎమ్మెల్సీ మీర్జా రహ్మత్ బేగ్‌పై మైనర్ బాలికపై లైంగికదాడి చేస్తూ దొరికిపోయాడనే ఆరోపణలున్నాయి. అత్తాపూర్‌లో మైనర్ అమ్మాయిపై అత్యాచారం చేస్తుంటే కొందరు యువకులు పట్టుకొని కొట్టి, వీడియోలు తీశారు. ఈ విషయం ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీకి ముందే తెలిసినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని సమాచారం. అయితే ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవడంతో.. అర్ధరాత్రి వేళ ఉన్నట్లుండి ఎలాంటి కారణం చెప్పకుండా ఎమ్మెల్సీని సస్పెండ్ చేస్తూ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.
Mirza Rahmath Baig has been expelled from AIMIM with immediate effect. He must immediately submit his resignation to the Chairman of the Legislative Council.
S A Hussain Anwar, Joint Secretary AIMIM
— AIMIM (@aimim_national) August 28, 2026
సంబంధిత వార్తలు

MIM | ఎంఐఎం ఎమ్మెల్సీ మీర్జా రహమత్‌పై బహిష్కరణ వేటు.. అసదుద్దీన్ నోరు విప్పాలి: సల్మాన్ ఖాన్
ఆగస్టు 29, 2026

Traffic Restrictions | నేడు మిలాద్-ఉన్-నబీ.. హైదరాబాద్‌లో సాయంత్రం 6 నుంచి ట్రాఫిక్ ఆంక్షలు
ఆగస్టు 25, 2026

Ramchander Rao | ‘సర్’లో ఆ మూడు పార్టీలు అక్రమాలు : రామచందర్ రావు
ఆగస్టు 8, 2026
తాజావార్తలు
- ●KCR | వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన కేసీఆర్
- ●Hyderabad | పల్టీలు కొట్టిన ఇన్నోవా క్రిస్టా.. ఇంటర్ స్టూడెంట్ స్పాట్ డెడ్
- ●KTR | కేటీఆర్ పీఏ, పీఆర్వోకు పోలీసుల నోటీసులు
- ●Telangana Bar Council | తెలంగాణ బార్ కౌన్సిల్ చైర్మన్‌గా సాముల రామ్ రెడ్డి, బీసీఐ సభ్యుడిగా కిరణ్ కుమార్
- ●Mega Job Mela | సెప్టెంబర్ 19న కోదాడలో మెగా జాబ్ మేళా.. 4 వేల మంది ఉద్యోగవకాశాలు
- ●Vinayaka Chavithi | వినాయకుడి పంచరత్నాలు.. పఠిస్తే ప్రశాంతత.. స్మరిస్తే విఘ్నవినాశనం

KCR | వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన కేసీఆర్

Hyderabad | పల్టీలు కొట్టిన ఇన్నోవా క్రిస్టా.. ఇంటర్ స్టూడెంట్ స్పాట్ డెడ్

KTR | కేటీఆర్ పీఏ, పీఆర్వోకు పోలీసుల నోటీసులు

Telangana Bar Council | తెలంగాణ బార్ కౌన్సిల్ చైర్మన్‌గా సాముల రామ్ రెడ్డి, బీసీఐ సభ్యుడిగా కిరణ్ కుమార్



