India GDP | 7.8 శాతం అద్భుతం.. భారత ఆర్థిక వృద్ధికి మోదీ ప్రశంసలు..
India GDP | ఆర్థిక సంవత్సరం 2026-27 తొలి త్రైమాసికంలో భారత్ 7.8 శాతం ఆర్థిక వృద్ధిని నమోదు చేయడంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోమవారం హర్షం వ్యక్తం చేశారు. చమురు ధరల షాక్‌లు, సరఫరా వ్యవస్థలో అంతరాయాలు, ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న అనిశ్చిత పరిస్థితుల మధ్య ఈ వృద్ధిని సాధించడం అసాధారణమైన, అతి పెద్ద విజయమని ఆయన అభివర్ణించారు.
India GDP | ఆర్థిక సంవత్సరం 2026-27 తొలి త్రైమాసికంలో భారత్ 7.8 శాతం ఆర్థిక వృద్ధిని నమోదు చేయడంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోమవారం హర్షం వ్యక్తం చేశారు. చమురు ధరల షాక్‌లు, సరఫరా వ్యవస్థలో అంతరాయాలు, ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న అనిశ్చిత పరిస్థితుల మధ్య ఈ వృద్ధిని సాధించడం అసాధారణమైన, అతి పెద్ద విజయమని ఆయన అభివర్ణించారు. ఈ మేరకు ఆయన తన ఎక్స్ ఖాతాలో పోస్టు చేశారు. 2026-27 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో భారత్ 7.8 శాతం జీడీపీ వృద్ధిని సాధించడం అసాధారణమైన విజయమని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా అనిశ్చిత పరిస్థితులు కొనసాగుతున్న సమయంలో చమురు ధరల షాక్‌లు, సరఫరా వ్యవస్థ సమస్యలు ఎదురైనప్పటికీ భారత ప్రజల సమిష్టి బలం ఇంతటి వృద్ధిని సాధించేలా చేసిందని, భారత్‌ను విమర్శించినవారి అంచనాలు తారుమారయ్యాయని, భారత్ మరోసారి వెలిగిందని మోదీ ఎక్స్‌లో పోస్టులో పేర్కొన్నారు.
నాలుగు రోజుల పర్యటనలో మోదీ..
మోదీ ప్రస్తుతం నాలుగు రోజుల మధ్య-ఆసియా పర్యటనలో ఉన్నారు. ఆగస్టు 29న ఉజ్బెకిస్థాన్ చేరుకున్న ఆయన ఆ దేశ అధ్యక్షుడు షవ్కత్ మిర్జియోయెవ్ ఆహ్వానం మేరకు ద్వైపాక్షిక పర్యటనలో పాల్గొంటున్నారు. అనంతరం కిర్గిజిస్థాన్‌లో జరిగే షాంఘై సహకార సంస్థ సదస్సులోనూ ఆయన పాల్గొంటున్నారు. ఈ సదస్సుకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌తోపాటు డజనుకు పైగా దేశాల నేతలు హాజరవుతున్నారు.
https://twitter.com/NaMoInTelugu/status/2094388071966048293?s=20
గత త్రైమాసికంతో పోలిస్తే 80 పాయింట్లు తగ్గుదల..
భారత్ ఆర్థిక వ్యవస్థ 2026-27 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో 7.8 శాతం వృద్ధి చెందింది. అమెరికా-ఇరాన్ యుద్ధం ప్రభావం ఆర్థిక కార్యకలాపాలపై ప్రతికూల ప్రభావం చూపుతుందని అంచనాలు ఉన్నప్పటికీ, తొలి త్రైమాసికంలో వృద్ధి బలంగా నమోదైంది. అయితే 2025-26 ఆర్థిక సంవత్సరం జనవరి-మార్చి త్రైమాసికంలో నమోదైన 8.6 శాతం వృద్ధితో పోలిస్తే తాజా వృద్ధి 80 బేసిస్ పాయింట్లు తగ్గింది.
తాజావార్తలు
- ●KCR | వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన కేసీఆర్
- ●Hyderabad | పల్టీలు కొట్టిన ఇన్నోవా క్రిస్టా.. ఇంటర్ స్టూడెంట్ స్పాట్ డెడ్
- ●KTR | కేటీఆర్ పీఏ, పీఆర్వోకు పోలీసుల నోటీసులు
- ●Telangana Bar Council | తెలంగాణ బార్ కౌన్సిల్ చైర్మన్‌గా సాముల రామ్ రెడ్డి, బీసీఐ సభ్యుడిగా కిరణ్ కుమార్
- ●Mega Job Mela | సెప్టెంబర్ 19న కోదాడలో మెగా జాబ్ మేళా.. 4 వేల మంది ఉద్యోగవకాశాలు
- ●Vinayaka Chavithi | వినాయకుడి పంచరత్నాలు.. పఠిస్తే ప్రశాంతత.. స్మరిస్తే విఘ్నవినాశనం

KCR | వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన కేసీఆర్

Hyderabad | పల్టీలు కొట్టిన ఇన్నోవా క్రిస్టా.. ఇంటర్ స్టూడెంట్ స్పాట్ డెడ్

KTR | కేటీఆర్ పీఏ, పీఆర్వోకు పోలీసుల నోటీసులు

Telangana Bar Council | తెలంగాణ బార్ కౌన్సిల్ చైర్మన్‌గా సాముల రామ్ రెడ్డి, బీసీఐ సభ్యుడిగా కిరణ్ కుమార్






