CM Revanth Reddy | తెలంగాణ రైజింగ్ 2047 అడ్డుకోవడం రాజకీయ వివక్షే : సీఎం రేవంత్‌రెడ్డి
CM Revanth Reddy | అమెరికా పర్యటనకు అనుమతి ఇవ్వకపోవడంలో.. పొలిటికల్ యాంగిల్ అంటే ఏంటో కేంద్రమే చెప్పాలని, రైజింగ్ 2047ని అడ్డుకోవడం రాజకీయ కక్షేనని సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. 'పొలిటికల్ యాంగిల్ అంటే ఏంటీ? నరేంద్ర మోదీ భారతీయ జనతా పార్టీ.
CM Revanth Reddy | అమెరికా పర్యటనకు అనుమతి ఇవ్వకపోవడంలో.. పొలిటికల్ యాంగిల్ అంటే ఏంటో కేంద్రమే చెప్పాలని, రైజింగ్ 2047ని అడ్డుకోవడం రాజకీయ కక్షేనని సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. 'పొలిటికల్ యాంగిల్ అంటే ఏంటీ? నరేంద్ర మోదీ భారతీయ జనతా పార్టీ. రేవంత్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీ. నరేంద్ర మోదీది గుజరాత్. రేవంత్‌రెడ్డిది తెలంగాణ. ఇదే కదా? మీ పొలిటికల్ యాంగిల్. ఇదే కదా మీ వివక్ష. ఒకపక్క గుజరాత్ ముఖ్యమంత్రికి ఇదే సమయంలో పర్యటనకు అనుమతి ఇచ్చి.. వైబ్రెంట్ గుజరాత్ కార్యక్రమంలో భాగంగా విదేశాలకు పంపి ఈ రోజు తెలంగాణ రైజింగ్ 2047ని అడ్డుకోవడం స్పష్టంగా రాజకీయ వివక్ష. తెలంగాణ అభివృద్ధిని ఇది అడ్డుకోవడమే'నన్నారు సీఎం.
దేశద్రోహి అనేవాళ్లు..
'విదేశాల్లో ఎన్నప్పుడే నేను స్పందించి ఉండొచ్చు. అలా మాట్లాడితే అగో చూసినవా దేశద్రోహి.. విదేశాల్లో భారతదేశ గౌరవానికి భంగం కలిగించిండు అని అవగాహనలేని మాట్లాడతరు అని చెప్పి మంత్రివర్గం, పార్లమెంట్ సభ్యులు, మండలి, శాసనసభ సభ్యులందరం ముక్తకంఠంతో కేంద్రం వైఖరిని ఖండిస్తున్నం. ఇది ఏమాత్రం కూడా ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధం. ఫెడరల్ స్ఫూర్తిని దెబ్బతీసేలా వ్యవహరిస్తున్న మోదీ వైఖరిని మనందరం ఖండించాల్సిన అవసరం ఉన్నది. నా పర్యటనను అడ్డుకున్నరు. నా లక్ష్యాన్ని మీరు ఆపలేరు. అందుకే అధికారులను అమెరికాకు పంపాను. మన అధికారులు ఆక్స్‌ఫర్డ్‌తో ఇవాళ రేపో ఒప్పందాలు చేసుకోబోతున్నారు. ఇతర యూనివర్సిటీలను కూడా సందర్శించి మన ప్రతిపాదనలను వారిముందు పెట్టబోతున్న. మన రాష్ట్రంలో పెట్టుబడులు ఆకర్షించేందుకు అవసరమైన అన్ని ఆహ్వానాలను అందజేస్తరు' అని తెలిపారు రేవంత్‌రెడ్డి.
డిసెంబర్‌లో ఇన్వెస్ట్‌మెంట్ సమ్మిట్
'తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్.. ఇన్వెస్ట్ తెలంగాణ నేపథ్యంలో డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో ఫ్యూచర్ సిటీలో పెద్ద ఎత్తున ఇన్వెస్ట్‌మెంట్ సమ్మిట్‌ను జరుపుకోబోతున్నం. దీనికి సంబంధించిన ఆహ్వానపత్రాలు, కార్పొరేట్ కంపెనీలకు అందజేస్తారు. ఎందుకంటే వారు నాలుగైదు నెలల పర్యటనను ఖరారు చేసుకోవాల్సి ఉంటుంది. కంపెనీల బోర్డు అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ఇన్వెస్ట్‌మెంట్స్‌కు అప్రూవల్ తీసుకోవాలంటే తగిన సమయం ఇవ్వాలి. అందుకే ముందస్తుగానే యూఎస్, యూకే పర్యటనలు తీసుకున్నాం. విద్యాసంస్థలు, క్రీడాసంస్థలు, పెట్టుబడులు పెట్టి ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పించే సంస్థలను ఆహ్వానించేందుకు ప్రత్యేక పర్యటన వెళ్లడం జరిగింది. చివరకు ముఖ్యమంత్రి పర్యటనలో స్పష్టత లేదంటున్నరు' అని విమర్శించారు.
జైశంకర్‌కి తెలియదా?
'ఏదైనా అఫీషియల్ విజిట్ భారత రాయభార కార్యాలయానికి చెందిన అధికారులు స్వయంగా పర్యవేక్షిస్తరు. ప్రతి సమావేశంలో ప్రత్యక్షంగా పాల్గొంటరు. అక్కడ జరిగే ప్రతీ చర్చను నోట్ చేసుకొని కేంద్రానికి నివేదిక పంపిస్తరు. విదేశాంగ మంత్రిత్వశాఖకు భారత అంబాసిడర్ కానీ, ఆయన పరిధిలో పని చేసే, భారత ప్రభుత్వానికి సంబంధించిన అధికారులు వాళ్లో కార్యక్రమాలను కోఆర్డినేట్ చేస్తారు. ఎయిర్‌పోర్ట్‌లో దిగినప్పటి నుంచి తిరిగి విమానం ఎక్కే వరకు అన్ని కార్యక్రమాలను భారత రాయబార కార్యాలయం పర్యవేక్షిస్తుంది. మినిట్ టు మినిట్ వివరాలను కేంద్రానికి అందిస్తుంది. మీటింగ్‌లో జరిగిన చర్చల అంశాన్ని సైతం నివేదిక రూపంలో కేంద్రానికి ఇస్తరు. ఇది చాటుమాటుగా పర్యటన కాదు.. అధికారిక పర్యటన. ఆదేశానికి వెళ్తే భారత రాయబార కార్యాలయానికి ఎందుకు ముందస్తుగా సమాచారం అందిస్తాం? తగిన ఏర్పాటు చేసుకునేందుకే సమాచారాన్ని అందిస్తాం. ఇవన్నీ విదేశాంగ మంత్రికి తెలియదా? ఆయన కూడా రాయబారిగా పని చేశారు కదా విదేశాల్లో. జైశంకర్ మంత్రి కాకముందు విదేశాంగ కార్యదర్శిగా పని చేశారు కదా? ఒక తెలంగాణ ముఖ్యమంత్రి పర్యటనను తిరస్కరిస్తున్నరంటే సమీక్షించకుండా, సమాచారాన్ని సేకరించకుండా.. ప్రధాని దృష్టిలో లేకుండా ఇలాంటి సంఘటనలు జరుగుతయా? తెలంగాణ అంటే చులకలన, చిన్నచూపు, వివక్ష' ఘాటు వ్యాఖ్యలు చేశారు సీఎం.
గుజరాత్ నాయకత్వం కుట్రలు..
'తెలంగాణ అభివృద్ధిని ఎలాగైనా అడ్డుకోవాలని గుజరాత్ నాయకత్వం ఈ రోజు కుట్రలు చేస్తున్నది. దీన్ని ముక్తకంఠంతో మేమంతా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో పాటు తెలంగాణవాదులందరూ ఖండించాలి. ఇది ఒక రేవంత్‌రెడ్డికి జరిగిన అవమానం కాదు. నాలుగుకోట్ల తెలంగాణ ప్రజలు, తెలంగాణ ప్రభుత్వానికి జరిగిన అవమానంగా భావించాలి' అని పిలుపునిచ్చారు సీఎం రేవంత్. ఈ సందర్భంగా ఆయన మీడియా అడిగిన పలు ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. న్యూయార్క్ మేయర్ జోహ్రాన్ మమ్దానీతో భేటీ ప్రశ్నించగా.. సీఎం స్పందించారు. కొందరు బుర్రలేకుండా మాట్లాడుతున్నారని.. మేయర్, అమెరికా వైస్‌ప్రెసిడెంట్ అపాయింట్‌మెంట్ అఫీషియల్‌గా ఫిక్స్ కాకుండా ఏ ప్రోగ్రామ్ జరుగదు. ఆయన మన గల్లీలో ఉన్న కౌన్సిలా? పోతపోతనే ఇంట్లకుపోయి కూసోని ఏం సంగతి? ఏం చేస్తున్నవని మాట్లాడేందుకు? అసలు కొంచెం విజ్‌డమ్ అప్లయ్ చేయాలని మాట్లాడేటప్పుడు. ముఖ్యమంత్రి నేను ఎక్కడికి వెళ్లినా భారత హైకమిషన్ భద్రతతో పాటు అన్నింటినీ చూస్తుందని తెలిపారు.
సంబంధాలను చెడగుతయ్
'ఇలాంటి ప్రయత్నాలు, రాజకీయ ప్రేరేపితమైన నిర్ణయాలు ప్రజాస్వామ్య స్ఫూర్తికి మంచివికావు. ఇవి రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల సత్సంబంధాలను చెడగొడుతుంది. రెండింటి మధ్య సత్సంబంధాలుంటాయి. రాజకీయ పార్టీల మధ్య సత్సంబంధాలు ఉన్నా లేకపోయినా.. సిద్ధాంత వైరుద్ధ్యాలు ఉన్నా అది వేరే విషయం. రెండు ప్రభుత్వాల మధ్య సత్సంబంధాలు ఉండాలని.. రాష్ట్ర ప్రభుత్వం నుంచి సంపూర్ణంగా కేంద్రంతో మేం ట్రావెల్ చేస్తున్నాం. ఓ మిత్రుడు అడుగుతున్నడు. వాళ్ల నాయకుడికి పర్మిషన్ ఇచ్చారు వాళ్ల బిడ్డను తీసుకెళ్లి అమెరికాలో చేర్చేందుకు. హరీశ్‌రావుకు ఇద్దరు పిల్లలు విదేశాల్లో చదువుకున్నరు. కవితకు ఇద్దరు పిల్లలు విదేశాల్లో చదువుకున్నరు. కేటీఆర్‌కు ఇద్దరు పిల్లలు విదేశాల్లో చదువుతున్నరు. కేటీఆర్‌కు అమెరికాకు, లండన్ వెళ్లేందుకు హరీశ్‌రావుకు అనుమతి ఇచ్చారు. గతంలో ప్రయాణం చేశామంటే కుదరదు. 2026లో గ్లోబల్ సమ్మిట్ ఉంది కదా? అని తెలిపారు సీఎం.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

CM Revanth Reddy | ఇది తెలంగాణకు జరిగిన అవమానం.. ముక్తకంఠంతో ఖండించాలని సీఎం రేవంత్ పిలుపు
ఆగస్టు 24, 2026

CM Revanth Reddy | ఆ రాజకీయ కారణం ఏంటో మోదీయే చెప్పాలి : రేవంత్‌రెడ్డి
ఆగస్టు 24, 2026

DK Aruna | 15,000 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను ఒకే విడతలో విడుదల చేయాలి: డీకే అరుణ
ఆగస్టు 24, 2026
తాజావార్తలు
- ●Singireddy Niranjan Reddy | పంటలు వేయొద్దు.. కొనొద్దు.. బోనస్ ఇవ్వొద్దు
- ●CM Revanth Reddy | ఇది తెలంగాణకు జరిగిన అవమానం.. ముక్తకంఠంతో ఖండించాలని సీఎం రేవంత్ పిలుపు
- ●Bank Strike | బ్యాంకులు బంద్.. నాలుగు రోజుల సమ్మె.. ఎప్పుడంటే..
- ●Arvind Dharmapuri | సీఎం తమ్ముడు చెప్పిండని.. నాపైన ఏసీపీతో నిఘా పెట్టించిండ్రు
- ●CM Revanth Reddy | ఆ రాజకీయ కారణం ఏంటో మోదీయే చెప్పాలి : రేవంత్‌రెడ్డి
- ●Aditi Rao Hydari | ఓటీటీలోకి అదితిరావ్ హైదరీ బోల్డ్ మూవీ - నలుగురు హీరోయిన్లు - నాలుగు కథలు

Singireddy Niranjan Reddy | పంటలు వేయొద్దు.. కొనొద్దు.. బోనస్ ఇవ్వొద్దు

CM Revanth Reddy | ఇది తెలంగాణకు జరిగిన అవమానం.. ముక్తకంఠంతో ఖండించాలని సీఎం రేవంత్ పిలుపు

Bank Strike | బ్యాంకులు బంద్.. నాలుగు రోజుల సమ్మె.. ఎప్పుడంటే..

Arvind Dharmapuri | సీఎం తమ్ముడు చెప్పిండని.. నాపైన ఏసీపీతో నిఘా పెట్టించిండ్రు



