Bank Holidays | సెప్టెంబర్‌లో 15 రోజులు బ్యాంకులు బంద్.. ముఖ్యమైన తేదీలు ఇవే..
Bank Holidays | సెప్టెంబర్‌లో మీకు ఏవైనా ముఖ్యమైన బ్యాంకింగ్ పనులు ఉన్నాయా..? అయితే ఈ నెలలో ఏయే రోజుల్లో సెలవులు ఉన్నాయో తెలుసుకోవడం చాలా ముఖ్యం. భారతీయ రిజర్వ్ బ్యాంక్ విడుదల చేసిన సెలవుల జాబితా ప్రకారం వివిధ రాష్ట్రాలు, నగరాల్లో పండుగలు, వార్షికోత్సవాలు, ప్రాంతీయ కార్యక్రమాల కారణంగా సెప్టెంబర్‌లో పలు రోజుల పాటు బ్యాంకులు మూతపడనున్నాయి.
Bank Holidays | సెప్టెంబర్‌లో మీకు ఏవైనా ముఖ్యమైన బ్యాంకింగ్ పనులు ఉన్నాయా..? అయితే ఈ నెలలో ఏయే రోజుల్లో సెలవులు ఉన్నాయో తెలుసుకోవడం చాలా ముఖ్యం. భారతీయ రిజర్వ్ బ్యాంక్ విడుదల చేసిన సెలవుల జాబితా ప్రకారం వివిధ రాష్ట్రాలు, నగరాల్లో పండుగలు, వార్షికోత్సవాలు, ప్రాంతీయ కార్యక్రమాల కారణంగా సెప్టెంబర్‌లో పలు రోజుల పాటు బ్యాంకులు మూతపడనున్నాయి. అదనంగా ప్రతి నెల మాదిరిగానే దేశవ్యాప్తంగా ఆదివారాలు, రెండో, నాలుగో శనివారాల్లో బ్యాంకులకు సెలవు ఉంటుంది. అయితే బ్యాంకు సెలవులు రాష్ట్రాన్ని బట్టి మారుతాయి. అందువల్ల రాష్ట్రానికి సంబంధించిన సెలవుల జాబితాను పరిశీలించి బ్యాంకు పనులను ముందుగానే ప్లాన్ చేసుకోవడం మంచిది.
ఏయే తేదీల్లో సెలవులు ఉన్నాయి...
సెప్టెంబర్ 4న జన్మాష్టమి (వైష్ణవం), కృష్ణ జయంతి సందర్భంగా గుజరాత్, మధ్యప్రదేశ్, ఒడిశా, తమిళనాడు, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, బీహార్, ఉత్తరాఖండ్, తెలంగాణ, కేరళ, పశ్చిమ బెంగాల్, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, హిమాచల్ ప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ సహా పలు రాష్ట్రాల్లో బ్యాంకులు మూసి ఉంటాయి. సెప్టెంబర్ 11న జైపూర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో జరిగే ఎన్నికల కారణంగా రాజస్థాన్‌లోని సంబంధిత ప్రాంతాల్లో బ్యాంకులు మూసి ఉంటాయి. 12వ తేదీన శ్రీమంత శంకర్‌దేవ్ తిరుభావ తిథి సందర్భంగా అసోంలో బ్యాంకులకు సెలవు ఉంటుంది. సెప్టెంబర్ 14న గణేశ్ చతుర్థి సందర్భంగా మహారాష్ట్ర, ఒడిశా, కర్ణాటక, తమిళనాడు, గుజరాత్, తెలంగాణ, గోవా, ఆంధ్రప్రదేశ్‌లో బ్యాంకులు మూసి ఉంటాయి.
సెప్టెంబర్ 15న సంవత్‌సరి (చతుర్థి పక్షం), నువాఖై సందర్భంగా గుజరాత్, ఒడిశా, గోవాలలో బ్యాంకులకు సెలవు ఉంటుంది. సెప్టెంబర్ 21న శ్రీమంత శంకర్‌దేవ్ జయంతి, శ్రీ నారాయణ గురు సమాధి సందర్భంగా అసోం, కేరళలో బ్యాంకులు మూసి ఉంటాయి. సెప్టెంబర్ 22న కర్మ పూజ సందర్భంగా జార్ఖండ్‌లో బ్యాంకులకు సెలవు ఉంటుంది. సెప్టెంబర్ 23న మహారాజా హరి సింగ్ జీ జయంతిని పురస్కరించుకుని జమ్మూ కాశ్మీర్‌లో బ్యాంకులు మూసి ఉంటాయి. సెప్టెంబర్ 25న ఇంద్రజాత్ర పండుగ సందర్భంగా సిక్కింలో బ్యాంకులకు సెలవు ఉంటుంది.
సర్కిల్‌ను బట్టి మార్పులు..
ఇవే కాకుండా సాధారణ ఆదివారం సెలవులు, రెండో, నాలుగో శనివారాలను కలుపుకుంటే సెప్టెంబర్‌లో బ్యాంకులు మొత్తం 15 రోజులు మూసి ఉంటాయి. అయితే ఈ సెలవులు బ్యాంకింగ్ సర్కిల్‌ను బట్టి మారుతాయి. కాబట్టి దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో ఒకే రోజున బ్యాంకులు మూసి ఉండవు. అయితే బ్యాంకు శాఖలు మూసి ఉన్నంత మాత్రాన బ్యాంకింగ్ సేవలు పూర్తిగా నిలిచిపోతాయని కాదు. సెలవు రోజుల్లోనూ డిజిటల్ బ్యాంకింగ్ సేవలను ఎలాంటి అంతరాయం లేకుండా ఉపయోగించుకోవచ్చు. నగదు ఉపసంహరణ లేదా డిపాజిట్ కోసం ఏటీఎంలను ఉపయోగించవచ్చు. గూగుల్ పే, ఫోన్‌పే, పేటీఎం లేదా భీమ్ యూపీఐ ద్వారా డిజిటల్ చెల్లింపులు, నగదు బదిలీలు కొనసాగుతాయి. సాధారణ ఖాతా సంబంధిత సేవలు, నెఫ్ట్, ఐఎంపీఎస్ బదిలీలు, బిల్లు చెల్లింపులు వంటి సేవలను ఇంటి నుంచే చేసుకోవచ్చు.
తాజావార్తలు
- ●Konda Sushmita Patel | మా అమ్మను రేవంత్ రెడ్డి అవమానించారు
- ●Konda Surekha | కొండా సురేఖ బర్తరఫ్కు గవర్నర్ ఆమోదం.. సీఎంవో ఆధీనంలో ఆమె ఛాంబర్
- ●Chinna Reddy | మెడ పట్టి.. బయటకు పంపుతానంటే కూడా భరించా
- ●Ananya Panday | లైగర్ హీరోయిన్ గ్లామర్ ట్రీట్
- ●Kollywood | హీరోయిన్గా మారిన పైలట్ - కోలీవుడ్ సినిమాలో ఛాన్స్
- ●Telangana Cabinet | సెప్టెంబర్ 6న తెలంగాణ మంత్రివర్గ విస్తరణ..? మంత్రిగా రాజగోపాల్ రెడ్డి..!

Konda Sushmita Patel | మా అమ్మను రేవంత్ రెడ్డి అవమానించారు

Konda Surekha | కొండా సురేఖ బర్తరఫ్కు గవర్నర్ ఆమోదం.. సీఎంవో ఆధీనంలో ఆమె ఛాంబర్

Chinna Reddy | మెడ పట్టి.. బయటకు పంపుతానంటే కూడా భరించా

Ananya Panday | లైగర్ హీరోయిన్ గ్లామర్ ట్రీట్





