Gold And Silver Prices Today | ఒక్క రోజులోనే రూ.7,600 తగ్గిన బంగారం ధర.. పెట్టుబడులు పెట్టవచ్చా..?
Gold And Silver Prices Today | అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లు పాజిటివ్‌గా కొనసాగుతున్నప్పటికీ బంగారం, వెండి ధరల్లో గత కొద్ది రోజులుగా తీవ్ర అస్థిరతలు చోటు చేసుకుంటున్నాయి. ప్రపంచవ్యాప్తంగా బులియన్ మార్కెట్లలో తీవ్ర అనిశ్చితి కొనసాగుతోంది. పెట్టుబడిదారులు కొనాలా, వద్దా అనే అయోమయంతో ఉన్నారని విశ్లేషకులు చెబుతున్నారు.
Gold And Silver Prices Today | అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లు పాజిటివ్‌గా కొనసాగుతున్నప్పటికీ బంగారం, వెండి ధరల్లో గత కొద్ది రోజులుగా తీవ్ర అస్థిరతలు చోటు చేసుకుంటున్నాయి. ప్రపంచవ్యాప్తంగా బులియన్ మార్కెట్లలో తీవ్ర అనిశ్చితి కొనసాగుతోంది. పెట్టుబడిదారులు కొనాలా, వద్దా అనే అయోమయంతో ఉన్నారని విశ్లేషకులు చెబుతున్నారు. అయితే కొత్తగా పెట్టుబడులు పెట్టేవారికి ఇది సమయం కాదని, యుద్ధం తగ్గే వరకు వేచి చూస్తే మంచిదని సూచిస్తున్నారు. ఇక శుక్రవారం అంతర్జాతీయ మార్కెట్‌లలో ఔన్స్ బంగారం ధర 0.28 శాతం పెరిగి 3,987 డాలర్లకు చేరగా, వెండి ధర 0.33 శాతం 55 డాలర్లకు వచ్చింది. దేశీయ కమోడిటీ మార్కెట్ ఎంసీఎక్స్‌లో గోల్డ్ ఫ్యూచర్స్ కాంట్రాక్టు స్వల్పంగా 64 పాయింట్లు తగ్గి 1,40,269 వద్ద ఉండగా, సిల్వర్ ఫ్యూచర్స్ కాంట్రాక్టు 1,042 పాయింట్ల మేర పతనమై 2,14,970 వద్ద ఉంది. దేశీయ స్పాట్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు ఒక్క రోజులోనే భారీగా తగ్గుదలను నమోదు చేశాయి.
స్పాట్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు..
24 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.14,253 ఉండగా, 8 గ్రాముల ధర రూ.1,14, 024గా ఉంది. 10 గ్రాముల ధర రూ.1,42,530 గా ఉంది. 100 గ్రాముల బంగారం ధర రూ.14,25,300 గా ఉంది. ఇది కిందటి రోజు ముగింపుతో పోలిస్తే రూ.7,600 తగ్గింది.
22 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.13,065 ఉండగా, 8 గ్రాముల ధర రూ.1,04,520గా ఉంది. 10 గ్రాముల ధర రూ.1,30,650 ఉండగా, 100 గ్రాముల బంగారం ధర రూ.13,06,500గా ఉంది. ఇది క్రితం ముగింపుతో పోలిస్తే రూ.7వేలు తగ్గింది.
18 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.10,690 ఉండగా, 8 గ్రాముల ధర రూ.85,520గా ఉంది. 10 గ్రాముల ధర రూ.1,06,900 ఉండగా, 100 గ్రాముల బంగారం ధర రూ.10,69,000గా ఉంది. ఇది క్రితం ముగింపుతో పోలిస్తే రూ.5,700 తగ్గింది.
దేశీయ మార్కెట్‌లో 1 కిలో వెండి ధర రూ.2,30,000 ఉండగా, తులం ధర రూ.2,300గా ఉంది. క్రితం ముగింపుతో పోలిస్తే వెండి ధర కిలోకు రూ.5వేలు తగ్గింది. హైదరాబాద్‌లో 1 కిలో వెండి ధర రూ.2,35,000 ఉండగా, తులం ధర రూ.2,350 గా ఉంది.
సంబంధిత వార్తలు

Gold And Silver Prices Today | పెట్టుబడిదారులకు అలర్ట్.. స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు.. కొనేందుకు చాన్స్..?
సెప్టెంబర్ 22, 2026

Gold Sales | పుత్తడి ధరలు తగ్గినా ఆచితూచి కొనుగోళ్లు.. పండుగలు, పెళ్లిళ్ల సీజన్‌పై ఆశలు
సెప్టెంబర్ 21, 2026

Gold And Silver Prices Today | బులియన్ మార్కెట్లలో ప్రతికూల సంకేతాలు.. స్వల్పంగా తగ్గిన పసిడి ధరలు..
సెప్టెంబర్ 21, 2026
తాజావార్తలు
- ●Phone Screen Protectors | నాణ్యతా ప్రమాణాలు పాటించాల్సిందే.. స్మార్ట్‌ఫోన్ స్క్రీన్ ప్రొటెక్టర్లపై కేంద్రం కీలక నిర్ణయం
- ●ఒక్క ఆదేశంతో యుద్ధం.. ఒక్క మాటతో విరమణ! అమెరికా అధ్యక్షుడి చేతిలో నిజంగా అంత పవర్ ఉందా?
- ●Namma Metro Daily Commute Cost | మెట్రో ఎక్కాలంటే రూ.70,000 జీతం ఉండాల్సిందేనా? పబ్లిక్ ఇన్ఫ్రాపై వైరల్ అవుతున్న చర్చ
- ●Chiranjeevi | 48 ఏళ్ల క్రితం ఇదే రోజు చిరంజీవిగా పేరు మార్చుకున్నా - మెగాస్టార్ ఎమోషనల్ పోస్ట్
- ●DGP Anand | ఇలాగే ముందుకు సాగండి.. అవార్డు పొందిన ఈగల్ ఫోర్స్ టీమ్‌కు డీజీపీ అభినందనలు
- ●Special Trains | చర్లపల్లి నుంచి ప్రయాగ్‌రాజ్, సెంగోట్టైకి ప్రత్యేక ట్రైన్స్‌ను ప్రకటించిన దక్షిణ మధ్య రైల్వే

Phone Screen Protectors | నాణ్యతా ప్రమాణాలు పాటించాల్సిందే.. స్మార్ట్‌ఫోన్ స్క్రీన్ ప్రొటెక్టర్లపై కేంద్రం కీలక నిర్ణయం

ఒక్క ఆదేశంతో యుద్ధం.. ఒక్క మాటతో విరమణ! అమెరికా అధ్యక్షుడి చేతిలో నిజంగా అంత పవర్ ఉందా?

Namma Metro Daily Commute Cost | మెట్రో ఎక్కాలంటే రూ.70,000 జీతం ఉండాల్సిందేనా? పబ్లిక్ ఇన్ఫ్రాపై వైరల్ అవుతున్న చర్చ

Chiranjeevi | 48 ఏళ్ల క్రితం ఇదే రోజు చిరంజీవిగా పేరు మార్చుకున్నా - మెగాస్టార్ ఎమోషనల్ పోస్ట్



