CM Revanth Reddy | కల్వకుంట్ల కౌరవ వంశాన్ని పాతాళానికి తొక్కేస్తాం : సీఎం రేవంత్ రెడ్డి
CM Revanth Reddy | రాబోయే కురుక్షేత్ర యుద్ధంలో కల్వకుంట్ల కౌరవ వంశాన్ని పాతాళానికి తొక్కేస్తామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. వచ్చే శాసనసభ ఎన్నికల్లో కల్వకుంట్ల విషపు మొక్కను మొలవనీయమని ఈ సభను చూస్తుంటే అర్థమవుతుందని సీఎం పేర్కొన్నారు.
CM Revanth Reddy | త్రినేత్ర.న్యూస్ : రాబోయే కురుక్షేత్ర యుద్ధంలో కల్వకుంట్ల కౌరవ వంశాన్ని పాతాళానికి తొక్కేస్తామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. వచ్చే శాసనసభ ఎన్నికల్లో కల్వకుంట్ల విషపు మొక్కను మొలవనీయమని ఈ సభను చూస్తుంటే అర్థమవుతుందని సీఎం పేర్కొన్నారు. ఖమ్మం జిల్లా చింతకాని మండలంలో ఏర్పాటు చేసిన రైతు ఆశీర్వాద సభలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని ప్రసంగించారు.
ఇది ఆషామాషీ సభ కాదు.. పరిపాలకు సంబంధించింది కాదు.. భవిష్యత్ ప్రణాళికలకు సంబంధించింది. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాంటి తీర్పు ఇవ్వబోతున్నారో మిమ్మల్ని చూస్తే అర్థమైంది. జూలై 2023 నాడు భట్టి ముగింపు పాదయాత్ర. రాహుల్ ఆధ్వర్యంలో పొంగులేటి చేరిన తర్వాత పాత్రికేయులు నన్ను గాంధీ భవన్లో కలిశారు. ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్లు రావడం లేదు.. బీజేపీ వేగంగా వస్తుంది.. బీఆర్ఎస్‌ను వచ్చే ఎన్నికల్లో తట్టుకోగలరా.. మీరు గెలుస్తారా అని మీడియా మిత్రులు అడిగారు. మీరు కాగితం తీసుకొని రాయండి.. సీల్డ్ కవర్‌లో పెట్టండి.. ఫలితాల తర్వాత నిజమా కాదా చూడండి అని చెప్పాను. మళ్లీ గుర్తు చేస్తున్నా.. రాబోయే ఎన్నికల్లో ఖమ్మం సభ చూసిన తర్వాత కాంగ్రెస్ కు 65 ఎమ్మెల్యేలు, సీపీఐ 1, బీజేపీ 8 - 9 సీట్లు, ఎంఐఎం 6 నుంచి 7 గెలుస్తాయి.. మిగిలినవి కేసీఆర్ ఆయన భజనపరులు గెలుస్తరని చెప్పారు. నాటి 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ 64 సీట్లు గెలిచింది, ఒకటి సీపీఐ పార్టీ గెలిచింది. ఉప ఎన్నికల్లో రెండు సీట్లు కాంగ్రెస్ పార్టీకి ఇచ్చారు. 66 సీట్లను చేశారు అని సీఎం గుర్తు చేశారు.
చేవెళ్ల గడ్డ మీది నుంచి సవాల్ విసిరినా..
ఆనాడు చెప్పిన జోస్యం.. చేవెళ్ల గడ్డ మీది నుంచి సవాల్ విసిరినా.. పార్లమెంట్ ఎన్నికల్లో గుండు సున్నా పంగ నామాలు పెట్టిస్తా అని కేసీఆర్‌కు సవాల్ విసిరాను. అదే జరిగింది. సర్పంచ్ ఎన్నికల్లో టు బై థర్డ్ మెజార్టీ గెలుస్తామని, మున్సిపల్ ఎన్నికల్లో 85 శాతం గెలుస్తామని చెప్పాం. 2023 ప్రభుత్వ ఏర్పాటు నుంచి అన్ని ఎన్నికల్లోనూ ప్రజలు కోరుకున్నదే, తెలంగాణ గుండె చప్పుడు ప్రజా పాలనలో తీర్పు వస్తుంది అని సీఎం అన్నారు.
పశుపతికి విముక్తి లేదని ఆనాడు చెప్పాం
పాపాల భైరవుడిని ఫామ్ హౌజ్‌లో బంధించాం. పశుపతికి విముక్తి లేదని ఆనాడు చెప్పాం. ఈనాడు రాసుకోండి.. ఖమ్మం జిల్లా చింతకాని మండలం వేదికగా,, జరగబోయే కురుక్షేత్రం గురించి ఈ వేదిక నుంచి చెప్పదచలుకున్నా.. కౌరవ వంశాన్ని ఈ గడ్డ మీద నుంచి తొలగించేంత వరకు రాజకీయ ముఖచిత్రం నుంచి పాతాళం వరకు తొక్కే వరకు కాంగ్రెస్ కార్యకర్తలు విశ్రమించరు అని సీఎం స్పష్టం చేశారు.
తాజావార్తలు
- ●Traffic Restrictions | నేడు మిలాద్-ఉన్-నబీ.. హైదరాబాద్లో సాయంత్రం 6 నుంచి ట్రాఫిక్ ఆంక్షలు
- ●Horoscope | ఆగస్టు 25 రాశి ఫలాలు.. ఈ రాశి వారికి పదోన్నతులు ఖాయం!
- ●బీఆర్ఎస్ సంస్థాగత సవాళ్లు: రెండు పొరల పార్టీ నిర్మాణం సరిపోతుందా?
- ●One Nation - One Election | 2029లోనే వన్ నేషన్- వన్ ఎలక్షన్?
- ●Polytechnic | పాలిటెక్నిక్ విద్యార్థులు నష్టపోకుండా ఉన్నత స్థాయి కమిటీ
- ●Karnataka Beggar | బెగ్గర్ మృతి.. 30 సంచుల్లో బయటపడ్డ రూ. 8,40,000

Traffic Restrictions | నేడు మిలాద్-ఉన్-నబీ.. హైదరాబాద్లో సాయంత్రం 6 నుంచి ట్రాఫిక్ ఆంక్షలు

Horoscope | ఆగస్టు 25 రాశి ఫలాలు.. ఈ రాశి వారికి పదోన్నతులు ఖాయం!

బీఆర్ఎస్ సంస్థాగత సవాళ్లు: రెండు పొరల పార్టీ నిర్మాణం సరిపోతుందా?

One Nation - One Election | 2029లోనే వన్ నేషన్- వన్ ఎలక్షన్?





