Cabinet Decisions | ఏపీ, తెలంగాణలో రైల్వే విస్తరణ.. రూ. 10,021 కోట్ల ప్రాజెక్టుకు కేంద్ర కేబినెట్ ఆమోదం
Cabinet Decisions | ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) అధ్యక్షతన సమావేశమైన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ (CCEA) కీలక నిర్ణయాలు తీసుకుంది. రూ. 10,021 కోట్ల అంచనా వ్యయంతో ఐదు రైల్వే మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్టులకు ఆమోద ముద్ర వేసింది. ఇందులో తెలుగు రాష్ట్రాలకు కూడా ప్రాధాన్యత దక్కింది.
Cabinet Decisions | త్రినేత్ర.న్యూస్ : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) అధ్యక్షతన సమావేశమైన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ (CCEA) కీలక నిర్ణయాలు తీసుకుంది. దక్షిణాది రాష్ట్రాలైన తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణల్లో రైల్వే మౌలిక సదుపాయాలను మెరుగుపరచడమే లక్ష్యంగా సుమారు రూ. 10,021 కోట్ల అంచనా వ్యయంతో ఐదు రైల్వే మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్టులకు ఆమోద ముద్ర వేసింది.
ఈ ప్రాజెక్టును 2029-30 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ప్రాజెక్టుల ద్వారా భారతీయ రైల్వే నెట్‌వర్క్ అదనంగా సుమారు 540 కిలోమీటర్ల మేర పెరగనుంది. మొత్తం 17 జిల్లాల్లోని సుమారు 2,121 గ్రామాలకు మెరుగైన రైల్వే కనెక్టివిటీ లభించనుంది. ఈ ప్రాజెక్టుల వల్ల రవాణా సామర్థ్యం పెరగడమే కాకుండా.. దాదాపు 52 లక్షల మంది ప్రజలు ప్రయోజనం పొందనున్నారు. కేబినెట్ భేటీలో తీసుకున్న నిర్ణయాలను కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ మీడియాకు వెల్లడించారు.

రైల్వే ప్రాజెక్టుల వివరాలు ఇవే..
- సికింద్రాబాద్ (ఘట్‌కేసర్)-కాజీపేట మధ్య 110 కిలోమీటర్ల పొడవైన నాలుగోలైన్ నిర్మాణం.
- అరక్కోణం (తమిళనాడు) - రేణిగుంట (ఏపీ) మధ్య 3వ, 4వ లైన్లను అభివృద్ధి చేయనున్నారు. ఈ ప్రాజెక్టు సుమారు 77 కిలోమీటర్ల మేర విస్తరించనుంది.
- కర్ణాటకలోని వైట్‌ఫీల్డ్ - బంగారుపేట మధ్య సుమారు 47 కిలోమీటర్ల మేర మూడో, నాలుగో లైన్లను అభవృద్ధి చేయనున్నారు.
- హోసూర్ (కర్ణాటక)–ఓమలూరు డబ్లింగ్ (147 కి.మీ)
- కరూర్ - సేలం - దిండిగల్ డబ్లింగ్ (159 కి.మీ)
@AshwiniVaishnaw Hon'ble MR explains the five multitracking projects and their impact on rail connectivity
➜ Arakkonam – Renigunta 3rd and 4th Line
➜ Whitefield – Bangarapet 3rd and 4th Line
➜ Hosur – Omalur Doubling
➜ Salem – Karur – Dindigul Doubling
➜ Multitracking… pic.twitter.com/e3ZjjqV4dn— South Central Railway (@SCRailwayIndia) September 9, 2026
Also Read..
నేడే యాపిల్ ఈవెంట్.. ఎలా వీక్షించాలి.. సమయం ఎప్పుడు..?
సింగనమల బొబ్బిలి రణబాలిరా నీ అక్క..! విజయ్ పవర్‌ఫుల్ డైలాగ్‌తో రణబాలి టీజర్..!
ఇది బీఆర్ఎస్ సస్పెన్షన్ కాదు.. ప్రజా సమస్యలపై కాంగ్రెస్ విధించిన సస్పెన్షన్
తాజావార్తలు
- ●Bandi Sanjay | సీఎం కుర్చీకే ఎసరు.. కేసీ వేణుగోపాల్‌కు డైరెక్ట్‌గా డబ్బులు
- ●CM Revanth Reddy | కేసీఆర్ ఎర్రవెల్లి మీటింగ్‌పై విచారణ!
- ●BRS MLAs | ఫేక్, ఏఐ జనరేటెడ్ చిత్రాలపై కఠిన చర్యలు తీసుకోండి
- ●TGEJAC | 18 లోపు పీఆర్సీ రిపోర్టు సమర్పించండి
- ●Mahesh Kumar Goud | మంత్రులందరి శాఖలు మార్చండి.. హైకమాండ్‌కు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కీలక సూచన
- ●AYUSH Students Stipend Hike | స్టైపెండ్ డబుల్.. ఆయుష్ విద్యార్థులకు రేవంత్ సర్కార్ భారీ గిఫ్ట్

Bandi Sanjay | సీఎం కుర్చీకే ఎసరు.. కేసీ వేణుగోపాల్‌కు డైరెక్ట్‌గా డబ్బులు

CM Revanth Reddy | కేసీఆర్ ఎర్రవెల్లి మీటింగ్‌పై విచారణ!

BRS MLAs | ఫేక్, ఏఐ జనరేటెడ్ చిత్రాలపై కఠిన చర్యలు తీసుకోండి

TGEJAC | 18 లోపు పీఆర్సీ రిపోర్టు సమర్పించండి





