Godrej Consumer Products | వినియోగదారులకు షాకిచ్చిన గోద్రెజ్.. కన్స్యూమర్ ఉత్పత్తుల ధరలు పెంపు..
Godrej Consumer Products | గోద్రెజ్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ (జీసీపీఎల్) తన గుడ్‌నైట్, హిట్, సింథాల్ ఉత్పత్తుల్లో కొన్నింటి ధరలను పెంచింది. ముడిసరుకుల ధరలు పెరగడంతో లాభాలపై ఒత్తిడి కొనసాగుతున్న నేపథ్యంలో, ఈ ఏడాది ప్రారంభంలో చేపట్టిన ధరల పెంపు చర్యలను కంపెనీ మరోసారి కొనసాగించింది.
Godrej Consumer Products | గోద్రెజ్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ (జీసీపీఎల్) తన గుడ్‌నైట్, హిట్, సింథాల్ ఉత్పత్తుల్లో కొన్నింటి ధరలను పెంచింది. ముడిసరుకుల ధరలు పెరగడంతో లాభాలపై ఒత్తిడి కొనసాగుతున్న నేపథ్యంలో, ఈ ఏడాది ప్రారంభంలో చేపట్టిన ధరల పెంపు చర్యలను కంపెనీ మరోసారి కొనసాగించింది. తాజా ధరల సవరణలు 4.5 శాతం నుంచి 5.9 శాతం వరకు ఉన్నాయి. ఈ ఏడాదిలో ఇప్పటివరకు కొన్ని ఉత్పత్తుల ధరలు మొత్తంగా 15.8 శాతం వరకు పెరిగాయి. భారత్‌లో కంపెనీకి కీలకమైన గృహ వినియోగ కీటకనాశకాలు, సబ్బుల విభాగాలపై ఈ ధరల పెంపు ప్రభావం పడింది. తాజా సవరణలతో గుడ్‌నైట్ లిక్విడ్, గుడ్‌నైట్ మెషిన్, సింథాల్ లైమ్ సబ్బుల ధరలు పెరిగాయి. పెరుగుతున్న వ్యయాలను భర్తీ చేసుకుంటూనే లాభదాయకతను కాపాడుకోవడమే లక్ష్యంగా కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది.
ధరలు ఎంత పెరిగాయంటే?
బ్లాక్ హిట్ 125 మిల్లీలీటర్ల ఉత్పత్తి ధరను రూ.85 నుంచి రూ.90కి పెంచారు. దీంతో ధర 5.9 శాతం పెరిగింది. గుడ్‌నైట్ లిక్విడ్ 45 మిల్లీలీటర్ల ధర రూ.90 నుంచి రూ.95కి చేరింది. ఇది 5.6 శాతం పెరుగుదల. ఈ ఏడాది ఈ ఉత్పత్తి ధరను రెండోసారి పెంచారు. ఏడాది ప్రారంభంలో రూ.85గా ఉన్న ధర, తాజా సవరణతో రూ.95కు చేరింది. మొత్తంగా ఈ ఏడాది ధర 11.8 శాతం పెరిగింది. గుడ్‌నైట్ మెషిన్ ధరను రూ.110 నుంచి రూ.115కు పెంచారు. దీంతో 4.5 శాతం పెరుగుదల నమోదైంది. అంతకుముందు జూలైలోనే ఈ ఉత్పత్తి ధరను రూ.100 నుంచి రూ.110కు పెంచారు. తాజా పెంపుతో ఈ ఏడాది మొత్తం ధరల పెరుగుదల 15 శాతానికి చేరింది. సబ్బుల విభాగంలో సింథాల్ లైమ్ సబ్బు 75 గ్రాముల చొప్పున నాలుగు సబ్బుల ప్యాక్ ధరను రూ.105 నుంచి రూ.110కు పెంచారు. దీంతో ధర 4.8 శాతం పెరిగింది. ఈ ఏడాది జూలైలో ఈ ప్యాక్ ధరను రూ.95 నుంచి రూ.105కు పెంచారు. తాజాగా మరోసారి ధర పెరగడంతో ఈ ఏడాది మొత్తం పెరుగుదల 15.8 శాతానికి చేరింది.
కంపెనీల లాభాలపై ఒత్తిడి..
పామాయిల్ ఉత్పన్నాలు, రసాయనాలు, ప్యాకేజింగ్ సామగ్రి ధరలు అధిక స్థాయిలో కొనసాగుతున్నాయి. దీంతో వినియోగ వస్తువుల తయారీ రంగంలోని కంపెనీల లాభాలపై ఒత్తిడి పెరుగుతోంది. గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికానికి సంబంధించి ముడి చమురు, పామాయిల్ ధరల పెరుగుదల కారణంగా 6 నుంచి 9 శాతం వరకు వ్యయ ప్రభావం ఉంటుందని జీసీపీఎల్ వెల్లడించింది. ఈ ఒత్తిడిని ఎదుర్కొనేందుకు ఎంపిక చేసిన ఉత్పత్తుల ధరలను పెంచడం, వ్యయాలను తగ్గించడం, ప్రకటనల ఖర్చులను సమర్థవంతంగా వినియోగించడం వంటి చర్యలు చేపట్టనున్నట్లు తెలిపింది. తాజా ధరల సవరణలు కూడా ఇదే వ్యూహంలో భాగంగా కనిపిస్తున్నాయి. ముడిసరుకుల ధరలు పెరిగినప్పుడు ఆ భారాన్ని వినియోగదారులకు బదిలీ చేస్తూనే, అమ్మకాల పరిమాణం తగ్గకుండా, లాభదాయకత దెబ్బతినకుండా చూసుకోవడం వినియోగ వస్తువుల కంపెనీలకు సవాలుగా మారుతోంది.
గమనిస్తున్న పరిశ్రమ వర్గాలు..
జీసీపీఎల్ చేపట్టిన తాజా ధరల పెంపుపై వినియోగదారుల స్పందన ఎలా ఉంటుంది? అమ్మకాల పరిమాణంపై ఎలాంటి ప్రభావం పడుతుంది? అన్న అంశాలు కీలకంగా మారనున్నాయి. తన ఉత్పత్తుల ధరలను కంపెనీ మరింత సర్దుబాటు చేసే క్రమంలో వీటిని పరిశ్రమ వర్గాలు నిశితంగా పరిశీలించనున్నాయి. జీసీపీఎల్ మొత్తం ఆదాయంలో భారత్ వాటా 63.3 శాతంగా ఉంది. కంపెనీ మొత్తం ఆదాయంలో గృహ వినియోగ కీటకనాశకాల విభాగం వాటా సుమారు 22 శాతంగా ఉంది. భారత్‌లో గృహ వినియోగ కీటకనాశకాల వ్యాపారం ద్వారా వచ్చే ఆదాయంలో గుడ్‌నైట్ వాటా సుమారు 90 శాతం కాగా, మిగిలిన 10 శాతం హిట్ బ్రాండ్ నుంచి వస్తోంది. ఈ విభాగంలో జీసీపీఎల్‌కు 60 శాతం మార్కెట్ వాటా ఉంది. ఈ వ్యాపార విభాగం వడ్డీ, పన్నులు, తరుగుదల, రుణ విమోచనకు ముందు ఆదాయం (ఈబీఐటీడీఏ) మార్జిన్ 24 శాతంగా ఉంది.
కంపెనీ విజయవంతం అవుతుందా..
కంపెనీ మొత్తం ఆదాయంలో సబ్బుల విభాగం వాటా సుమారు 18 శాతం. సబ్బుల ద్వారా వచ్చే ఆదాయంలో సింథాల్ వాటా 37 శాతంగా ఉంది. జీసీపీఎల్ మొత్తం ఆదాయంలో సింథాల్ వాటా సుమారు 6.7 శాతం. సబ్బుల విభాగం ఈబీఐటీడీఏ మార్జిన్ 18 శాతంగా ఉండగా, ఈ రంగంలో కంపెనీ మార్కెట్ వాటా సుమారు 10 నుంచి 12 శాతం మధ్య ఉంది. గుడ్‌నైట్, హిట్, సింథాల్ ఉత్పత్తుల ధరల పెంపు జీసీపీఎల్‌కు కీలకంగా మారనుంది. పెరుగుతున్న ముడిసరుకుల వ్యయాలను భర్తీ చేసుకుంటూ, తన ప్రధాన ఉత్పత్తుల విభాగాల్లో లాభదాయకతను కొనసాగించడంలో కంపెనీ ఎంతవరకు విజయవంతమవుతుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Giriraj Singh | 9 రాష్ట్రాల్లో 30 ఏళ్లుగా కాంగ్రెస్ అధికారంలో లేదు: గిరిరాజ్ సింగ్
- ●Gold And Silver Prices Today | ప్రపంచ బులియన్ మార్కెట్లలో జోరు.. ఈక్విటీ మార్కెట్లలో లాభాల ఎఫెక్ట్..
- ●OnePlus 16 | వన్ప్లస్ 16 వచ్చేసింది.. 185 హెడ్జ్ డిస్ప్లే, 9,000 ఎంఏహెచ్ బ్యాటరీ..
- ●Stock Markets | స్టాక్ మార్కెట్లలో రికవరీ.. 250 పాయింట్లకు పైగా పెరిగిన సెన్సెక్స్..
- ●Jalamandali | నవంబర్ నాటికి రిజర్వాయర్లు ఎండిపోతాయి..! జలమండలి క్లారిటీ..!!
- ●Vijay Devarakonda | తిరుమల శ్రీవారిని దర్శించుకున్న విజయ్, రష్మిక దంపతులు

Giriraj Singh | 9 రాష్ట్రాల్లో 30 ఏళ్లుగా కాంగ్రెస్ అధికారంలో లేదు: గిరిరాజ్ సింగ్

Gold And Silver Prices Today | ప్రపంచ బులియన్ మార్కెట్లలో జోరు.. ఈక్విటీ మార్కెట్లలో లాభాల ఎఫెక్ట్..

OnePlus 16 | వన్ప్లస్ 16 వచ్చేసింది.. 185 హెడ్జ్ డిస్ప్లే, 9,000 ఎంఏహెచ్ బ్యాటరీ..

Stock Markets | స్టాక్ మార్కెట్లలో రికవరీ.. 250 పాయింట్లకు పైగా పెరిగిన సెన్సెక్స్..






