Petrol Diesel Price | నాలుగోస్సారి.. మళ్లీ భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
Petrol Diesel Price | లేడికి లేచిందే పరుగు అన్నట్లుగా పెట్రోల్, డీజిల్ ధరలు (Petrol Diesel Price) పెరుగుతూనే ఉన్నాయి. రెండు రోజుల క్రితమే పెట్రోల్‌పై 94 పైసలు, డీజిల్‌పై 96 పైసల భారం మోపిన దేశీయ చమురు కంపెనీలు, తాజాగా మరోసారి భారీగా ధరలు పెంచాయి.
Petrol Diesel Price | త్రినేత్ర.న్యూస్: లేడికి లేచిందే పరుగు అన్నట్లుగా పెట్రోల్, డీజిల్ ధరలు (Petrol Diesel Price) పెరుగుతూనే ఉన్నాయి. రెండు రోజుల క్రితమే పెట్రోల్‌పై 94 పైసలు, డీజిల్‌పై 96 పైసల భారం మోపిన దేశీయ చమురు కంపెనీలు, తాజాగా మరోసారి భారీగా ధరలు పెంచాయి. లీటరు పెట్రోల్‌పై రూ.2.84, డీజిల్‌పై రూ.2.86 చొప్పున పెంచాయి. పెరిగిన ధరలు సోమవారం ఉదయం 6 గంటల నుంచే అమల్లోకి వచ్చాయి. దీంతో పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడం గత పది రోజుల్లో ఇది నాలుగోసారి.
తాజా పెంపుతో హైదరాబాద్‌లో లీటరు పెట్రోలు రూ.115.73కి చేరింది. ఇక రూ.100.94గా ఉన్న డీజిల్ ధర రూ.103.82కి పెరిగింది. ఈ నెల 15న 110.89గా లీటరు పెట్రోల్‌పై రూ.3.39 పెంచడంతో రూ.110.89కి చేరింది. ఆ తర్వాత మే 19న 95 పైసలు భారం మోపడంతో రూ.111.84కు, ఈ నెల 23న 97 పైసలు పెరగడంతో రూ.112.81 కు చేరింది. దీంతో పది రోజుల వ్యవధిలోనే లీటు పెట్రోల్‌పై రూ.8.19 వడ్డించాయి.
ఇక ఈ నెల 15న రూ.95.70గా ఉన్న డీజిల్ ధర రూ.3.26 పెంచడంతో రూ.98.96కి చేరింది. 19న మరో 99 పైసలు వడ్డించడంతో రూ.99.95కి, 23న 99 పైలు పెంచడంతో రూ.100.94కి పెరిగింది. దీంతో ఈ నెల 15వ తేదీ తర్వాత లీటరు డీజిల్‌పై చమురు కంపెనీలు రూ.8.12 భారం మోపాయి.
- ఏపీలోని విజయవాడలో తాజా పెంపుతో లీటరు పెట్రోల్ రూ.117.96, డీజిల్ ధర.105.79, విశాఖపట్నంలో పెట్రోల్ రూ.116.44, డీజిల్ ధర.103.94గా ఉంది.
దేశంలోని ప్రధాన నగరాల్లో..
- ఢిల్లీ- పెట్రోల్ రూ.102.11, డీజిల్ రూ.95.12
- ముంబై- పెట్రోల్ రూ.110.88, డీజిల్ రూ.97.48
- కోల్‌కతా- పెట్రోల్ రూ.118.79, డీజిల్ రూ.99.47
- చెన్నై- పెట్రోల్ రూ.108.14, డీజిల్ రూ.99.84
- బెంగళూరు- పెట్రోల్ రూ.110.30, డీజిల్ రూ.98.44
- తిరువనంతపురం- పెట్రోల్ రూ.114.72, డీజిల్ రూ.103.71
తాజావార్తలు
- ●Pavala Shyamala | విషం తాగి చచ్చిపోతే మీకు మనశ్శాంతిగా ఉంటుందా..?
- ●Pavala Shyamala | ప్రముఖ సీనియర్ నటి పావలా శ్యామల కన్నుమూత
- ●Horoscope | జూలై 28 రాశిఫలాలు.. ఈ రాశి వారికి ఆకస్మిక లాభాలు..!
- ●Morning Phone Habit | పొద్దున్నే లేవగానే మొబైల్ చూస్తున్నారా? ఇది అడిక్షన్ కాదట.. అసలు నిజం తెలిస్తే షాకవుతారు!
- ●Why People Avoid Jewelry | మెడలో, చేతులకు ఎలాంటి ఆభరణాలు ధరించని వారి సైకాలజీ ఎలా ఉంటుందో తెలుసా?
- ●TGPSC OMR Sheets | రోడ్లపై OMR షీట్లు.. TGPSC సంచలన ప్రకటన!

Pavala Shyamala | విషం తాగి చచ్చిపోతే మీకు మనశ్శాంతిగా ఉంటుందా..?

Pavala Shyamala | ప్రముఖ సీనియర్ నటి పావలా శ్యామల కన్నుమూత

Horoscope | జూలై 28 రాశిఫలాలు.. ఈ రాశి వారికి ఆకస్మిక లాభాలు..!

Morning Phone Habit | పొద్దున్నే లేవగానే మొబైల్ చూస్తున్నారా? ఇది అడిక్షన్ కాదట.. అసలు నిజం తెలిస్తే షాకవుతారు!






