Harish Rao | ఆడబిడ్డల భద్రత ప్రశ్నార్థకంగా మారడం సిగ్గుచేటు : హరీశ్‌రావు
Harish Rao | తెలంగాణలో ఆడబిడ్డల భద్రత ప్రశ్నార్థకంగా మారడం సిగ్గుచేటని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు అన్నారు. కాంగ్రెస్ పాలనలో ప్రజల ఆస్తులకే కాదు.. ప్రాణాలకు కూడా భద్రత లేకుండా పోయిందని విమర్శించారు.
Harish Rao | తెలంగాణలో ఆడబిడ్డల భద్రత ప్రశ్నార్థకంగా మారడం సిగ్గుచేటని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు అన్నారు. కాంగ్రెస్ పాలనలో ప్రజల ఆస్తులకే కాదు.. ప్రాణాలకు కూడా భద్రత లేకుండా పోయిందని విమర్శించారు. గురుకులంలో చదివి, పేదరికాన్ని జయించి నర్సుగా సేవలందిస్తున్న ఆడబిడ్డ దారుణ హత్యకు గురికావడం తీవ్రంగా కలచివేసిందన్నారు. హత్య అనంతరం అత్యాచారం జరిగినట్లు వస్తున్న వార్తలు మరింత ఆందోళన కలిగిస్తున్నాయని పేర్కొన్నారు. పట్టపగలు హత్యలు, దోపిడీలు, అత్యాచారాలు జరుగుతుంటే రాష్ట్రంలో భద్రత డొల్లతనం బయటపడుతోందని అన్నారు.
‘‘కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అరాచకాలు పెరిగి, శాంతిభద్రతలు క్షీణిస్తున్నాయి. ప్రజల ప్రాణాలకు రక్షణ లేకుండా పోతోంది. హోం శాఖను కూడా నిర్వహిస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి గారూ.. రాష్ట్రంలో పరిస్థితులు ఇంత దారుణంగా మారుతుంటే మీ ప్రభుత్వం ఏం చేస్తోంది? ఇంకెంత మంది ఆడబిడ్డలు బలైతే మీ ప్రభుత్వం మేల్కొంటుంది? మహిళలకు భద్రత కల్పించలేని మీకు హోం శాఖ నిర్వహించే నైతిక హక్కు ఉందా?’’ అని హరీశ్‌రావు ప్రశ్నించారు. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపి, నిందితుడికి వెంటనే శిక్ష పడేలా చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో దిగజారుతున్న మహిళల భద్రతను మెరుగుపరిచేందుకు ప్రభుత్వం తక్షణమే కఠిన చర్యలు చేపట్టాలని బీఆర్‌ఎస్ పక్షాన డిమాండ్ చేశారు.
తాజావార్తలు
- ●KCR | వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన కేసీఆర్
- ●Hyderabad | పల్టీలు కొట్టిన ఇన్నోవా క్రిస్టా.. ఇంటర్ స్టూడెంట్ స్పాట్ డెడ్
- ●KTR | కేటీఆర్ పీఏ, పీఆర్వోకు పోలీసుల నోటీసులు
- ●Telangana Bar Council | తెలంగాణ బార్ కౌన్సిల్ చైర్మన్‌గా సాముల రామ్ రెడ్డి, బీసీఐ సభ్యుడిగా కిరణ్ కుమార్
- ●Mega Job Mela | సెప్టెంబర్ 19న కోదాడలో మెగా జాబ్ మేళా.. 4 వేల మంది ఉద్యోగవకాశాలు
- ●Vinayaka Chavithi | వినాయకుడి పంచరత్నాలు.. పఠిస్తే ప్రశాంతత.. స్మరిస్తే విఘ్నవినాశనం

KCR | వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన కేసీఆర్

Hyderabad | పల్టీలు కొట్టిన ఇన్నోవా క్రిస్టా.. ఇంటర్ స్టూడెంట్ స్పాట్ డెడ్

KTR | కేటీఆర్ పీఏ, పీఆర్వోకు పోలీసుల నోటీసులు

Telangana Bar Council | తెలంగాణ బార్ కౌన్సిల్ చైర్మన్‌గా సాముల రామ్ రెడ్డి, బీసీఐ సభ్యుడిగా కిరణ్ కుమార్



