Ramchandar Rao | ఫీజు రీయింబర్స్‌మెంట్ కోసం విద్యార్థులు రాసిన లేఖలు ఇస్తాం.. మీ అపాయింట్‌మెంట్ ఇవ్వండి
Ramchandar Rao | ఫీజు రీయింబర్స్‌మెంట్ కోసం విద్యార్థులు రాసిన లేఖలను మీకు అందజేస్తామని.. అందుకోసం వీలైనంత త్వరలో అపాయింట్‌మెంట్ ఇవ్వాలని సీఎం రేవంత్‌రెడ్డిని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు విజ్ఞప్తి చేశారు.
- 8 లక్షల మందికి వెంటనే బకాయిలు విడుదల చేయండి
- సీఎం రేవంత్‌రెడ్డికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు లేఖ
Ramchandar Rao | త్రినేత్ర.న్యూస్: ఫీజు రీయింబర్స్‌మెంట్ కోసం విద్యార్థులు రాసిన లేఖలను మీకు అందజేస్తామని.. అందుకోసం వీలైనంత త్వరలో అపాయింట్‌మెంట్ ఇవ్వాలని సీఎం రేవంత్‌రెడ్డిని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 8 లక్షలకు పైగా విద్యార్థులకు బకాయిలను వెంటనే విడుదల చేయాలని కోరారు. ఈమేరకు సోమవారం ఆయన సీఎం రేవంత్‌రెడ్డికి లేఖ రాశారు.
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులు చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల విడుదల కోసం విద్యార్థులు ఆందోళనలు చేస్తున్న విషయం మీకు తెలుసు. పెద్ద సంఖ్యలో విద్యార్థులు ఫీజు రీయింబర్స్‌మెంట్ విడుదల చేయాలని కోరుతూ రోడ్డెక్కుతున్నారు. ప్రభుత్వం వైపు నుంచి ఎటువంటి స్పందన రావడం లేదు. కనీసం సానుకూలంగా గానీ లేదు.
విద్యార్థులు రాసిన లేఖలను నాకు అందజేసి, మీ అందజేయాలని వారు కోరారు. ఈ సమస్య తీవ్రతను మీకు వివరించేందుకు బీజేపీ ప్రజాప్రతినిధులు, కొంతమంది బీజేవైఎం (భారతీయ జనతా యువమోర్చా) నాయకులతో కలిసి మిమ్మల్ని కలిసేందుకు సమయం ఇవ్వండి. విద్యార్థుల లేఖలను వ్యక్తిగతంగా మీకు అందజేస్తాం. మాకు అపాయింట్‌మెంట్ ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నాను అని ఆ లేఖలో రాంచందర్‌రావు పేర్కొన్నారు.
తాజావార్తలు
- ●Nagarmal Bajoria | 300 సార్లు ఎన్నికల్లో పోటీ.. ఆ కోరిక తీరకుండానే అనంత లోకాలకు
- ●Konda Surekha | కొండా సురేఖకు మరో ఝలక్..
- ●Traffic Restrictions | వినాయక విగ్రహాల తరలింపు.. ధూల్‌పేటలో 14 వరకు ట్రాఫిక్ ఆంక్షలు
- ●CM Revanth Reddy | కొడంగల్ లిఫ్ట్.. ఫేజ్-2 పనులకు టెండర్లు పిలవండి
- ●KRMB | తాగు నీటి అవసరాలకే నీటిని వినియోగించాలి.. కేఆర్ఎంబీ ఆదేశాలు
- ●CM Revanth Reddy | హకీంపేట్ ఎడ్యుకేషన్ హబ్ పనులను పరిశీలించిన సీఎం రేవంత్ రెడ్డి

Nagarmal Bajoria | 300 సార్లు ఎన్నికల్లో పోటీ.. ఆ కోరిక తీరకుండానే అనంత లోకాలకు

Konda Surekha | కొండా సురేఖకు మరో ఝలక్..

Traffic Restrictions | వినాయక విగ్రహాల తరలింపు.. ధూల్‌పేటలో 14 వరకు ట్రాఫిక్ ఆంక్షలు

CM Revanth Reddy | కొడంగల్ లిఫ్ట్.. ఫేజ్-2 పనులకు టెండర్లు పిలవండి





