Rashmika Mandanna | రష్మిక ఈజ్ బ్యాక్ – గాయం తర్వాత ఫస్ట్ టైమ్ కెమెరా ముందుకు – భర్తతో కలిసి షూటింగ్
గాయం నుంచి కోలుకున్న రష్మిక మందన్న దాదాపు నెల రోజుల గ్యాప్ తర్వాత సినిమా సెట్స్‌లో అడుగుపెట్టింది. సోమవారం భర్త విజయ్ దేవరకొండతో కలిసి రణబాలి షూటింగ్ మొదలుపెట్టింది. పెళ్లి తర్వాత విజయ్, రష్మిక నటిస్తున్న ఈ తొలి మూవీ దసరాకు థియేటర్లలోకి రాబోతుంది.
Entertainment | Published On Aug 31, 2026, 3.22 pm IST
Rashmika Mandanna | గాయం నుంచి కోలుకున్న నేషనల్ క్రష్ రష్మిక మందన్న దాదాపు నెల రోజుల గ్యాప్ తర్వాత తిరిగి కెమెరా ముందుకొచ్చింది. సోమవారం భర్త విజయ్ దేవరకొండతో కలిసి రణబాలి సెట్స్‌లో అడుగుపెట్టింది. మైసా సాంగ్ షూటింగ్‌లో ప్రమాదం జరగడంతో రష్మిక గాయపడింది. ఈ గాయం కారణంగా దాదాపు నెల రోజుల పాటు షూటింగ్‌లకు బ్రేక్ ఇచ్చింది. ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంది.
వరలక్ష్మి వ్రతం...
ఈ విరామంలో వరలక్ష్మి వ్రతంతో పాటు ఇంట్లో పూజలు చేసింది. ఫజిల్స్, గేమ్స్ ఆడుతూ టైమ్‌పాస్ చేసింది. ఇందుకు సంబంధించిన ఫొటోలను తరచుగా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది.
దాదాపు నెల రోజుల బ్రేక్ తర్వాత మళ్లీ రష్మిక కెమెరా ముందుకొచ్చింది. సోమవారం రణబాలి షూటింగ్‌లో జాయిన్ అయ్యింది. విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తోన్న ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. గాయం కారణంగా రష్మిక, విజయ్ కాంబినేషన్‌లో చిత్రీకరించాల్సిన కొన్ని కీలక సన్నివేశాలు ఆగిపోయాయి. వాటిని సోమవారం నుంచి షూట్ చేస్తున్నట్లు సమాచారం. ఈ షెడ్యూల్‌తో రణబాలికి గుమ్మడికాయ కొట్టబోతున్నారు.
పెళ్లి తర్వాత ఫస్ట్ మూవీ....
పెళ్లి తర్వాత విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న హీరోహీరోయిన్లుగా నటిస్తున్న తొలి సినిమా ఇది. దసరా కానుకగా అక్టోబర్ 16న రణబాలి థియేటర్లలోకి రాబోతుంది. ఈ సినిమాలో విజయ్, రష్మిక భార్యాభర్తలుగానే కనిపించబోతున్నారు.
టాక్సీవాలా ఫేమ్...
రణబాలికి టాక్సీవాలా ఫేమ్ రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వం వహిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. బండి నారాయణస్వామి రాసిన శప్తభూమి నవల ఆధారంగా రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌లో రణబాలి తెరకెక్కుతోన్నట్లు ప్రచారం జరుగుతోంది. హాలీవుడ్ నటుడు ఆర్నాల్డో వోస్లో ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్లు అజయ్ - అతుల్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Horror Movie | కిరణ్ అబ్బవరం సినిమాలో బిగ్‌బాస్ తెలుగు రన్నరప్ – హారర్ మూవీతో హీరోయిన్గా ఎంట్రీ
ఆగస్టు 31, 2026

Rashmika Mandanna | వరలక్ష్మి వ్రతం చేసిన రష్మిక మందన్న – ఇన్‌స్టా పోస్ట్‌తో గుడ్‌న్యూస్
ఆగస్టు 30, 2026

Mla Raja Singh | అశ్లీలత, అసభ్యత తప్ప కథ లేదు – యశ్ టాక్సిక్‌పై ఎమ్మెల్యే రాజా సింగ్ కామెంట్స్
ఆగస్టు 30, 2026
తాజావార్తలు
- ●India GDP | ఎఫ్వై27లో భారత ఆర్థిక వృద్ధి 7.2 శాతం.. ఈవై అంచనా..
- ●Youth Congress | బీజేపీ రాష్ట్ర కార్యాలయ ముట్టడికి యూత్ కాంగ్రెస్ యత్నం.. తీవ్ర ఉద్రిక్తత
- ●CJP September 5 March Delhi | సెప్టెంబర్ 5 కాక్రోచ్ పార్టీ ఢిల్లీ మార్చ్‌కు బ్రేక్ వేయలేం.. తేల్చి చెప్పిన సుప్రీంకోర్టు
- ●Delhi Day Care | మూడేళ్ల చిన్నారిని కుర్చీకి కట్టేసి.. ఢిల్లీ డే కేర్‌లో దారుణం
- ●Chamala Kirankumar Reddy | కాంగ్రెస్ శ్రేణులారా.. వెయ్యి రోజుల పాలనపై బీఆర్ఎస్కు ధీటైన జవాబిద్దాం
- ●Bandi Sanjay | అభివృద్ధిలో ఆదర్శంగా కరీంనగర్

India GDP | ఎఫ్వై27లో భారత ఆర్థిక వృద్ధి 7.2 శాతం.. ఈవై అంచనా..

Youth Congress | బీజేపీ రాష్ట్ర కార్యాలయ ముట్టడికి యూత్ కాంగ్రెస్ యత్నం.. తీవ్ర ఉద్రిక్తత

CJP September 5 March Delhi | సెప్టెంబర్ 5 కాక్రోచ్ పార్టీ ఢిల్లీ మార్చ్‌కు బ్రేక్ వేయలేం.. తేల్చి చెప్పిన సుప్రీంకోర్టు

Delhi Day Care | మూడేళ్ల చిన్నారిని కుర్చీకి కట్టేసి.. ఢిల్లీ డే కేర్‌లో దారుణం



