Navneet Rana | కోర్టు గీర్టు అని ఆలస్యం చేయకుండా.. నడిరోడ్డుపై ఉరితీయాలి
Navneet Rana | ఢిల్లీలో 16 ఏళ్ల బాలికపై జరిగిన సామూహిక అత్యాచార (Delhi Gang Rape) ఘటనపై బీజేపీ నాయకురాలు నవనీత్ రాణా (Navneet Rana ) తీవ్రంగా స్పందించారు. ఇలాంటి అఘాయిత్యాలకు పాల్పడే వారిని నడిరోడ్డుపై ఉరి తీయాలని డిమాండ్ చేశారు.
త్రినేత్ర.న్యూస్ : దేశ రాజధాని ఢిల్లీ (Delhi)లో స్లీపర్ బస్సులో 16 ఏళ్ల బాలికపై జరిగిన సామూహిక అత్యాచార ఘటనపై దేశ వ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనపై బీజేపీ నాయకురాలు నవనీత్ రాణా (Navneet Rana ) తీవ్రంగా స్పందించారు. ఇది సమాజంలో నైతిక, మేధోపరమైన పతనానికి నిదర్శనమని వ్యాఖ్యానించారు. ఇలాంటి అఘాయిత్యాలకు పాల్పడే వారిని నడిరోడ్డుపై ఉరి తీయాలని డిమాండ్ చేశారు.
యువతను ప్రోత్సహించేందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ఇతర నాయకులు ఎంతో చొరవ తీసుకుంటున్నా.. ఇలాంటి ఘటనలు జరగడం బాధాకరమన్నారు. ఒక మహిళగా మనం ఇప్పటికీ ఇలాంటి సంఘటనల గురించి చర్చించుకోవాల్సి రావడం కలచివేస్తోందని చెప్పారు. ఇలాంటి అఘాయిత్యాలకు పాల్పడే యువకులను రద్దీగా ఉండే కూడళ్లలో బహిరంగంగా ఉరితీయాలని డిమాండ్ చేశారు. ఇందులో ఎలాంటి సుదీర్ఘ విచారణలు, జాప్యాలు, ప్రత్యేక ఫాస్ట్-ట్రాక్ కోర్టుల అవసరం ఉండకూడదని అభిప్రాయపడ్డారు. విచారణ ముగియగానే వెంటనే బహిరంగ ఉరే సరైన శిక్ష అని పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి.. ఢిల్లీలో మరో నిర్భయ ఘటన.. కదిలే బస్సులో బాలికపై సామూహిక అత్యాచారం
ఉత్తరప్రదేశ్ మైన్‌పురి జిల్లాకు (Mainpuri district) చెందిన 16 ఏళ్ల బాలికపై ఢిల్లీలో సామూహిక అత్యాచారం జరిగిన విషయం తెలిసిందే. కదిలే బస్సులో 16 ఏళ్ల బాలికపై డ్రైవర్, కండక్టర్ సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు (Delhi Gang Rape). ఆగస్టు 4న చోటు చేసుకున్న ఈఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.
Also Read..
మూడేళ్ల చిన్నారిని కుర్చీకి కట్టేసి.. ఢిల్లీ డే కేర్‌లో దారుణం
ఎఫ్‌వై27లో భారత ఆర్థిక వృద్ధి 7.2 శాతం.. ఈవై అంచనా..
సెప్టెంబర్ 5 కాక్రోచ్ పార్టీ ఢిల్లీ మార్చ్‌కు బ్రేక్ వేయలేం.. తేల్చి చెప్పిన సుప్రీంకోర్టు
సంబంధిత వార్తలు

Konda Surekha | సీఎం రేవంత్ పైనే చర్యలు తీసుకోండి : మంత్రి కొండా సురేఖ
సెప్టెంబర్ 2, 2026

Team India | అఫ్గాన్‌తో టీ20 సిరీస్‌కు భారత్ జట్టు ప్రకటన.. మళ్లీ జట్టులోకి వచ్చిన సంజూ శాంసన్
సెప్టెంబర్ 1, 2026

Bus Rape Case | మీ వైఫల్యాలను ఇంకెంతకాలం కప్పిపుచ్చుకుంటారు? ఢిల్లీ, యూపీ ప్రభుత్వాలను నిలదీసిన రాహుల్
సెప్టెంబర్ 1, 2026
తాజావార్తలు
- ●Nagarmal Bajoria | 300 సార్లు ఎన్నికల్లో పోటీ.. ఆ కోరిక తీరకుండానే అనంత లోకాలకు
- ●Konda Surekha | కొండా సురేఖకు మరో ఝలక్..
- ●Traffic Restrictions | వినాయక విగ్రహాల తరలింపు.. ధూల్‌పేటలో 14 వరకు ట్రాఫిక్ ఆంక్షలు
- ●CM Revanth Reddy | కొడంగల్ లిఫ్ట్.. ఫేజ్-2 పనులకు టెండర్లు పిలవండి
- ●KRMB | తాగు నీటి అవసరాలకే నీటిని వినియోగించాలి.. కేఆర్ఎంబీ ఆదేశాలు
- ●CM Revanth Reddy | హకీంపేట్ ఎడ్యుకేషన్ హబ్ పనులను పరిశీలించిన సీఎం రేవంత్ రెడ్డి

Nagarmal Bajoria | 300 సార్లు ఎన్నికల్లో పోటీ.. ఆ కోరిక తీరకుండానే అనంత లోకాలకు

Konda Surekha | కొండా సురేఖకు మరో ఝలక్..

Traffic Restrictions | వినాయక విగ్రహాల తరలింపు.. ధూల్‌పేటలో 14 వరకు ట్రాఫిక్ ఆంక్షలు

CM Revanth Reddy | కొడంగల్ లిఫ్ట్.. ఫేజ్-2 పనులకు టెండర్లు పిలవండి



