Rammohan Reddy | రాముడి ఒంటి మీది సొమ్ములు కూడా అమ్ముకున్నరు
Rammohan Reddy | వజ్రాల హారం నుంచి పాద రక్షల వరకు రాముడి ఒంటి మీది సొమ్ములన్నీ బీజేపీ నాయకులు అమ్ముకున్నారని మీడియా కమిటీ చైర్మన్ సామ రామ్మోహన్‌రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. ఈ దొంగతనానికి ప్రధాని నరేంద్ర మోదీ పూర్తి బాధ్యత తీసుకోవాలని డిమాండ్ చేశారు.
- వజ్రాల హారం నుండి పాద రక్షల దాకా అన్ని దోచుకున్నరు
- అందుకే అయోధ్యలో బీజేపీ ఓడిపోయింది
- ఆ దొంగతనానికి ప్రధాని మోదీనే బాధ్యత వహించాలి
- యోగి ‘సిట్’ వేసి చేతులు దులుపుకున్నరు
- ఈ కేసులో సీబీఐ దర్యాప్తు జరిపించాలి
- మీడియా కమిటీ చైర్మన్ సామ రామ్మోహన్ రెడ్డి సంచలన ఆరోపణలు
Rammohan Reddy త్రినేత్ర.న్యూస్: వజ్రాల హారం నుంచి పాద రక్షల వరకు రాముడి ఒంటి మీది సొమ్ములన్నీ బీజేపీ నాయకులు అమ్ముకున్నారని మీడియా కమిటీ చైర్మన్ సామ రామ్మోహన్‌రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. రాముల వారికి బీజేపీ గురించి తెలుసు కాబట్టే అయోధ్యలో ఆ పార్టీ ఓడిపోయిందన్నారు. ఈ దొంగతనానికి ప్రధాని నరేంద్ర మోదీ పూర్తి బాధ్యత తీసుకోవాలని డిమాండ్ చేశారు. చివరికి రాముడు కూడా బీజేపీ బాధితుడయ్యారని వ్యాఖ్యానించారు. గాంధీ భవన్‌లో శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ బీజేపీపై విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు.
దేశ ప్రజలకు అయోధ్య రాముడు అంటే ఒక నమ్మకం. అలాంటి నమ్మకాన్ని బీజేపీ వమ్ము చేస్తుంది. అయోధ్య రామ మందిరంలో రాముడి ఒంటి మీద ఉన్న సొమ్ములు అమ్ముకున్నారు. హుండీలోని డబ్బులు, వెండి ఇటుకలు, ఇతర బంగారు ఆభరణాలు దొంగిలించారు. అయోధ్య రామ మందిరం నిర్మించి 3 ఏళ్లు కాకముందే ఇంత చేశారు. సుమారు 200 కోట్ల రూపాయల మేర రాముల వారి సొమ్ము దోచుకున్నారు అని సామ ఆరోపించారు.
అంతా నకిలీ హిందువులే..
బీజేపీలో ఉన్న ఏ ఒక్కరూ అసలైన హిందువులు కారు. అంత డూప్లికేట్ హిందువులే. యోగి ఆదిత్య నాథ్ నామమాత్రంగా ముగ్గురు సభ్యులతో SIT వేశారు. కొంత మంది కింది స్థాయి ఉద్యోగులను అరెస్ట్ చేయించారు. యోగి ఆదిత్య నాథ్ గో మాత గురించి మాట్లాడుతారు. కానీ బీఫ్ ఎగుమతుల్లో ఉత్తరప్రదేశ్ దేశంలోనే నెంబర్ 1గా ఉంది అని ఆయన ఎద్దేవా చేశారు.
బీజేపీ కేవలం దేవుడి పేరు మీద, మతం పేరు మీద రాజకీయం చేస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందువులకు బీజేపీ సమాధానం చెప్పాలి. దేవుడి జోలికి వెళ్లినవాడు బతికి బట్ట కట్టింది లేదు. రాబోయే రోజుల్లో బీజేపీ పరిస్థితి కూడా అదే. శబరిమల, తిరుపతి ప్రసాదాల్లో జరిగినట్లు రాములవారి దొంగతనం కేసులో సీబీఐ దర్యాప్తు జరగాలి. రాముల వారికి బీజేపీ గురించి తెలుసు. అందుకే అయోధ్యలో బీజేపీ ఓడిపోయింది అని రామ్మోహన్‌రెడ్డి వ్యాఖ్యానించారు.
తాజావార్తలు
- ●Snake in Underwear | ఆ పని చేస్తుండగా.. అండర్వేర్లోకి దూరిన పాము.. వీడియో
- ●WhatsApp | వాట్సాప్‌లో వస్తున్న మరో కొత్త సెక్యూరిటీ ఫీచర్.. అపరిచిత నంబర్ల నుంచి వచ్చే మెసేజ్‌లకు హెచ్చరికలు..
- ●Isak Heien | స్వీడన్‌కు ఎదురుదెబ్బ.. టోర్నీకి స్టార్ డిఫెండర్ దూరం..!
- ●Pattaya Suitcase Murder | బ్యాంకాక్‌లో ఆస్ట్రేలియా టూరిస్ట్ కిరాతకం: 17 ఏళ్ల బాలికను హత్య చేసి సూట్‌కేసులో కుక్కి
- ●Leopard | అది చిరుత కాదు.. కుక్క అయి ఉండొచ్చు
- ●Trisha - Tamannaah | ఒకే ఫ్రేమ్‌లో త్రిష, తమన్నా - ఖుష్బూ కూతురి పెళ్లిలో ముద్దుగుమ్మల సందడి

Snake in Underwear | ఆ పని చేస్తుండగా.. అండర్వేర్లోకి దూరిన పాము.. వీడియో

WhatsApp | వాట్సాప్‌లో వస్తున్న మరో కొత్త సెక్యూరిటీ ఫీచర్.. అపరిచిత నంబర్ల నుంచి వచ్చే మెసేజ్‌లకు హెచ్చరికలు..

Isak Heien | స్వీడన్‌కు ఎదురుదెబ్బ.. టోర్నీకి స్టార్ డిఫెండర్ దూరం..!

Pattaya Suitcase Murder | బ్యాంకాక్‌లో ఆస్ట్రేలియా టూరిస్ట్ కిరాతకం: 17 ఏళ్ల బాలికను హత్య చేసి సూట్‌కేసులో కుక్కి






