Amarnath Yatra | అమర్‌నాథ్ యాత్రకు పోటెత్తుతున్న భక్తులు.. 11 రోజుల్లోనే 2.75 లక్షల మంది దర్శనం
Amarnath Yatra | పవిత్ర అమర్‌నాథ్ యాత్ర (Amarnath Yatra)కు భక్తులు పోటెత్తున్నారు. మొదటి 11 రోజుల్లోనే 2.75 లక్షలకుపైగా భక్తులు మంచు లింగాన్ని దర్శించుకున్నట్లు అధికారులు మంగళవారం తెలిపారు.
Amarnath Yatra | త్రినేత్ర.న్యూస్ : పవిత్ర అమర్‌నాథ్ యాత్ర (Amarnath Yatra)కు భక్తులు పోటెత్తున్నారు. ఈ యాత్ర ప్రారంభమైన మొదటి 11 రోజుల్లోనే 2.75 లక్షలకుపైగా భక్తులు మంచు లింగాన్ని దర్శించుకున్నట్లు అధికారులు మంగళవారం తెలిపారు. సోమవారం ఒక్కరోజే 24,259 మంది యాత్రికులు అమర్‌నాథ్ గుహను సందర్శించినట్లు చెప్పారు. ఇక ఇవాళ 5,335 మంది యాత్రికులతో కూడిన బృందం జమ్ములోని భగవతీ నగర్ యాత్రి నివాస్ నుంచి భారీ బందోబస్తు మధ్య రెండు కాన్వాయ్‌లలో కశ్మీర్‌కు బయల్దేరింది. వీరిలో 3,599 మంది యాత్రికులు పహల్గామ్‌లోని నున్వాన్ బేస్ క్యాంప్‌కు వెళ్తుండగా.. 1,736 మంది బాల్తాల్ బేస్ క్యాంప్‌కు వెళ్తున్నారు.
ఇక రాంబన్ జిల్లాలోని చందర్‌కోట్ సమీపంలో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో 18 మంది యాత్రికులకు స్వల్ప గాయాలైనట్లు అధికారులు తెలిపారు. పహల్గామ్‌వైపు వెళ్తున్న కాన్వాయ్‌లోని ఓ బస్సు బ్రేకులు ఫెయిల్ కావడంతో అది అదుపుతప్పి మరో బస్సును ఢీకొట్టినట్లు పేర్కొన్నారు. ఈ ఘటనలో యాత్రికులకు స్వల్ప గాయాలైనట్లు చెప్పారు. వారందరినీ రాంబన్ జిల్లా ఆసుపత్రికి తరలించిన ప్రథమ చికిత్స అందించినట్లు వివరించారు.
కాగా, జులై 3న ప్రారంభమైన ఈ పవిత్ర యాత్ర.. 57 రోజుల పాటూ సాగనుంది. ఈ వార్షిక యాత్ర రక్షాబంధన్ పండుగ రోజున అంటే ఆగస్టు 28న ముగియనుంది. యాత్రికులు దక్షిణ కశ్మీర్‌లోని పహల్గాం, ఉత్తర కశ్మీర్‌లోని బాల్తాల్ మార్గం నుంచి కాలినడకన, లేదా పోనీల సాయంతో మంచు లింగం వద్దకు చేరుకుంటారు. ఇదిలా ఉండగా.. జమ్ము-కశ్మీర్ హిమాలయాల్లోని 3,880మీటర్ల ఎత్తులో అమర్‌నాథ్ గుహల్లో ఏటా సహజసిద్ధంగా ఏర్పడే మంచులింగం చాలా వేగంగా కరిగిపోతోంది. ఇప్పటికే లింగ్ చాలా వరకూ కరిగిపోయినట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో భక్తులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Rain Alert | చల్లని కబురు.. జూలై 16 నుంచి మోస్తరు వర్షాలు
- ●ACB Raids | హెచ్ఎండీఏ చీఫ్ ఇంజినీర్ నివాసంపై ఏసీబీ దాడులు..
- ●Hyderabad | హైదరాబాద్‌లో మరో నాలుగు చెరువుల అభివృద్ధి.. 227 కోట్లతో తొలిదశ పనులు
- ●Income Tax Return | ఐటీఆర్ ఫైల్ చేయడంలో ఇబ్బందా.. కేవలం రూ.24 చెల్లిస్తే చాలు, రిటర్న్స్ రెడీ..
- ●Nitin Gadkari | వాహనం మైలేజ్‌ని మనం కచ్చితంగా కొలవలేం : నితిన్ గడ్కరీ
- ●Jio | జియో ఇంటర్నేషనల్ రోమింగ్ ప్లాన్లలో భారీ మార్పులు.. అదే ధరకు 4 రెట్లు ఎక్కువ డేటా..

Rain Alert | చల్లని కబురు.. జూలై 16 నుంచి మోస్తరు వర్షాలు

ACB Raids | హెచ్ఎండీఏ చీఫ్ ఇంజినీర్ నివాసంపై ఏసీబీ దాడులు..

Hyderabad | హైదరాబాద్‌లో మరో నాలుగు చెరువుల అభివృద్ధి.. 227 కోట్లతో తొలిదశ పనులు

Income Tax Return | ఐటీఆర్ ఫైల్ చేయడంలో ఇబ్బందా.. కేవలం రూ.24 చెల్లిస్తే చాలు, రిటర్న్స్ రెడీ..






