త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Income Tax Return | ఐటీఆర్ ఫైల్ చేయ‌డంలో ఇబ్బందా.. కేవ‌లం రూ.24 చెల్లిస్తే చాలు, రిటర్న్స్ రెడీ..

Income Tax Return | ఆదాయపు పన్ను రిటర్న్ (ఐటీఆర్) దాఖలు చేసే గడువు సమీపిస్తోంది. జూలై 31లోపు ఐటీఆర్ ఫైల్ చేయకపోతే అనేక ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. గడువు దాటిన తర్వాత జరిమానా చెల్లించి రిటర్న్ దాఖలు చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా పలు పన్ను ప్రయోజనాలను కూడా కోల్పోయే అవకాశం ఉంటుంది.

S

Business | Published On Jul 14, 2026, 12.23 pm IST

Income Tax Return | ఐటీఆర్ ఫైల్ చేయ‌డంలో ఇబ్బందా.. కేవ‌లం రూ.24 చెల్లిస్తే చాలు, రిటర్న్స్ రెడీ..
Advertisement

Income Tax Return | ఆదాయపు పన్ను రిటర్న్ (ఐటీఆర్) దాఖలు చేసే గడువు సమీపిస్తోంది. జూలై 31లోపు ఐటీఆర్ ఫైల్ చేయకపోతే అనేక ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. గడువు దాటిన తర్వాత జరిమానా చెల్లించి రిటర్న్ దాఖలు చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా పలు పన్ను ప్రయోజనాలను కూడా కోల్పోయే అవకాశం ఉంటుంది. అందుకే చివరి తేదీ వరకు వేచి ఉండకుండా ముందుగానే రిటర్న్ దాఖలు చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇంకా ఐటీఆర్ ఫైల్ చేయని వారు లేదా ఏవైనా సమస్యలు ఎదుర్కొంటున్న వారు ఇప్పుడు ఫిన్‌టెక్ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా ట్యాక్స్ ఫైలింగ్ సేవలను ఉపయోగించుకోవచ్చు. ఫోన్‌పే, జియోఫైనాన్స్ వంటి ప్రముఖ ఫిన్‌టెక్ సంస్థలు తమ యాప్‌లలోనే ఐటీఆర్ ఫైలింగ్ సేవలను ప్రారంభించాయి. ఇందుకోసం ట్యాక్స్‌బడ్డీతో భాగస్వామ్యం కుదుర్చుకున్నాయి. దీంతో ఫిన్‌టెక్ ప్లాట్‌ఫామ్‌లలో అందుబాటులో ఉన్న ఆర్థిక సేవల పరిధి మరింత విస్తరించింది. ఈ రెండు సంస్థలు కూడా వినియోగదారులకు స్వయంగా రిటర్న్ దాఖలు చేసుకునే డూ-ఇట్-యూర్‌సెల్ఫ్ (డీఐవై) ఆప్షన్‌తోపాటు నిపుణుల సహాయంతో ఐటీఆర్ ఫైల్ చేసే సదుపాయాన్ని అందిస్తున్నాయి. ముఖ్యంగా స్వయంగా ఫైలింగ్ చేసుకునే ప్లాన్‌లు కేవలం రూ.24 నుంచే ప్రారంభం కావడం విశేషం.

ప‌న్ను చెల్లింపుదారులంద‌రికీ..

ఈ సేవలు కేవలం జీతభత్యాలు పొందే ఉద్యోగులకే కాకుండా, బహుళ ఆదాయ వనరులు కలిగిన పన్ను చెల్లింపుదారులకు కూడా అందుబాటులో ఉన్నాయి. వ్యాపార ఆదాయం, క్యాపిటల్ గెయిన్స్, క్రిప్టోకరెన్సీ లావాదేవీలు, విదేశీ ఆదాయం, ప్రవాస భారతీయుల (ఎన్‌ఆర్‌ఐ) ఐటీఆర్ ఫైలింగ్ వంటి సేవలు కూడా ఇందులో ఉన్నాయి. ఈ ట్యాక్స్ ఫైలింగ్ సేవలను రిజిస్టర్డ్ ఈ-రిటర్న్ ఇంటర్మీడియరీ (ఈఆర్‌ఐ) ట్యాక్స్‌బడ్డీ అందిస్తోంది. దీంతో వినియోగదారులు వేరే పోర్టల్‌కు వెళ్లాల్సిన అవసరం లేకుండా నేరుగా ఫిన్‌టెక్ యాప్‌ల‌లోనే ఐటీఆర్ దాఖలు చేయ‌వచ్చు. జియోఫైనాన్స్ తెలిపిన వివరాల ప్రకారం తమ ట్యాక్స్ ఫైలింగ్ మాడ్యూల్‌లో అనేక ఉపయోగకరమైన ఫీచర్లు ఉన్నాయ‌ని వెల్ల‌డించింది. ఆదాయపు పన్ను శాఖ పోర్టల్ నుంచి ఆటోమేటిక్ డేటా రిట్రీవల్, ట్యాక్స్ ప్లానింగ్ టూల్స్, పాత-కొత్త ట్యాక్స్ విధానాల పోలిక, డిడక్షన్ అంచనా, ట్యాక్స్ రీఫండ్ ట్రాకింగ్ వంటి సౌకర్యాలు ఇందులో ఉన్నాయి. పన్ను చెల్లింపుదారుల డేటా ప్రాసెసింగ్ మొత్తం ట్యాక్స్‌బడ్డీ నియంత్రిత వ్యవస్థలోనే జరుగుతుందని, ఆ డేటాను కేవలం ఐటీఆర్ దాఖలు కోసమే ఉపయోగిస్తామని సంస్థ వెల్లడించింది.

ఫోన్ పేలోనూ..

ఫోన్‌పే కూడా తన కొత్త ఫీచర్ ద్వారా ఐటీఆర్ ఫైలింగ్‌తోపాటు నెలవారీ జీఎస్‌టీ కంప్లయన్స్‌ను నిర్వహించే సదుపాయాన్ని అందిస్తోంది. ఈ సేవలన్నీ ఫోన్‌పే యాప్‌లోనే అందుబాటులో ఉంటాయి. స్వయంగా రిటర్న్ దాఖలు చేసే అవకాశంతోపాటు నిపుణుల సహాయంతో ఫైలింగ్ చేసే ఎంపిక కూడా వినియోగదారులకు ఉంది. రెండు ఫిన్‌టెక్ సంస్థల్లోనూ స్వయంగా ఐటీఆర్ దాఖలు చేసే ప్లాన్‌లు రూ.24 నుంచే ప్రారంభమవుతున్నాయి. అయితే జియోఫైనాన్స్ వివిధ వర్గాల పన్ను చెల్లింపుదారుల కోసం ప్రత్యేక ధరల నిర్మాణాన్ని ప్రకటించింది.

వివిధ ర‌కాల ప్లాన్లు..

జీతభత్యాలు పొందే ఉద్యోగులు రూ.24 నుంచి రూ.499 వరకు ఉన్న ప్లాన్‌లతో స్వయంగా ఐటీఆర్ దాఖలు చేసుకోవచ్చు. క్యాపిటల్ గెయిన్స్, ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్, క్రిప్టోకరెన్సీ లావాదేవీలు ఉన్న పన్ను చెల్లింపుదారుల కోసం ప్లాన్‌లు రూ.99 నుంచి ప్రారంభమవుతాయి. నిపుణుల సహాయంతో ఐటీఆర్ ఫైలింగ్ చేయాలనుకునే జీతభత్యాల ఉద్యోగుల కోసం ప్లాన్‌లు రూ.649 నుంచి అందుబాటులో ఉన్నాయి. వ్యాపార ఆదాయం ఉన్నవారు, ఎన్‌ఆర్‌ఐలు వంటి ప్రత్యేక వర్గాల పన్ను చెల్లింపుదారుల కోసం గరిష్ఠంగా రూ.2,924 వరకు ప్లాన్‌లు అందుబాటులో ఉన్నాయి.

Advertisement
Advertisement