Nitin Gadkari | వాహనం మైలేజ్‌ని మనం కచ్చితంగా కొలవలేం : నితిన్ గడ్కరీ
Nitin Gadkari | సాధారణ వాహనదారులు తమ కారు లేదా బైక్ మైలేజ్‌ని స్వయంగా కచ్చితంగా కొలవలేరని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ (Nitin Gadkari) చెప్పారు.
Nitin Gadkari | పెట్రోల్‌లో ఇథనాల్ (E20 fuel) కలపడం వల్ల వాహనాల మైలేజ్ తగ్గిపోతుందనే వాదనలపై కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ (Nitin Gadkari) స్పందించారు. సాధారణ వాహనదారులు తమ కారు లేదా బైక్ మైలేజ్‌ని స్వయంగా కచ్చితంగా కొలవలేరని చెప్పారు. కంపెనీ అధీకృత డీలర్ల వద్ద ఉండే ప్రత్యేక యంత్రాలతో మాత్రమే మైలేజ్‌ని సరిగ్గా పరీక్షించవచ్చని ఆయన స్పష్టం చేశారు.
ఓ మీడియా సంస్థతో నితిన్ గడ్కరీ మాట్లాడారు. ఈ సందర్భంగా ఈ20 (E20) పెట్రోల్ వాడకం తర్వాత తన కారు మైలేజ్ భారీగా పడిపోయిందని ఓ జర్నలిస్ట్ కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. 2023లో కొనుగోలు చేసిన తన కారు గతంలో లీటరుకు 11 కిలోమీటర్ల మైలేజ్ ఇచ్చేదని.. అది ఇప్పుడు 7 కిలోమీటర్లకు పడిపోయిందని తెలిపారు. జర్నలిస్ట్ ప్రశ్నకు స్పందించిన గడ్కరీ.. మైలేజ్ ఎలా లెక్కించారు..? అంటూ ప్రశ్నించారు.
అందరూ చూసుకున్నట్లే నేను కూడా నా కారులోని డ్యాష్‌బోర్డ్ మైలేజ్ డిస్‌ప్లే ద్వారా చెక్ చేసుకున్నానంటూ ఆమె సమాధానం ఇచ్చారు. దీనికి గడ్కరీ స్పందిస్తూ.. 'మీరైనా, నేనైనా మైలేజ్‌ని కచ్చితంగా చెక్ చేయలేము. కారు మైలేజ్‌ని కేవలం కంపెనీ అధీకృత డీలర్ వద్ద ఉండే మెషిన్ ద్వారా మాత్రమే తనిఖీ చేయగలం. డీలర్ల వద్ద ఉన్న మెషీన్లతో పరీక్షిస్తే కచ్చితమైన ఫలితాలు వస్తాయి' అని గడ్కరీ స్పష్టం చేశారు.
మైలేజ్ 5 శాతం తగ్గొచ్చు..
కాగా, ఇథనాల్ కలిపిన ఇంధనం వాడటం వల్ల మైలేజ్ తగ్గడం (reduce mileage), ఇంజిన్ దెబ్బతినడం (damage engines), మెయింటేనెన్స్ ఖర్చులు పెరగడం లాంటి సమస్యలు వస్తున్నాయని చాలా మంది వాహనదారులు ఆందోళనలు వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ ఆందోళనలపై స్పందించిన కేంద్ర ప్రభుత్వం.. 20 శాతం ఇథనాల్ కలిపిన పెట్రోల్ (E20) వల్ల కొన్ని వాహనాల్లో మైలేజ్ (fuel economy) తగ్గుతుందన్న మాట వాస్తవమేనని అంగీకరించింది. వాహనాల్లో మైలేజ్ 3 నుంచి 5 శాతం తగ్గొచ్చని వెల్లడించింది. అయితే, దీని ప్రభావం కంటే ప్రయోజనాలే ఎక్కువ ఉన్నాయని వివరించింది. ఈ 20 పెట్రోల్‌తో అధిక ఆక్టేన్ రేటింగ్, మెరుగైన ఇంజిన్ పనితీరు, మెరుగైన పికప్, స్మూత్ యాక్సిలరేషన్, తక్కువ కర్బన ఉద్గారాల విడుదల వంటి ఉపయోగాలు ఉన్నాయని స్పష్టం చేసింది. ఈ10 లేదా సాధారణ పెట్రోల్‌తో పోలిస్తే E20 స్వచ్ఛమైన, మెరుగైన నాణ్యత కలిగిన, సమర్థవంతమైన ఇంధనంగా కేంద్ర ప్రభుత్వం పేర్కొంది.
తాజావార్తలు
- ●Janhvi Kapoor | గ్లామర్‌కు దూరంగా.. జాన్వీ కొత్త అడుగులు!
- ●TOMCOM Dubai Jobs | దుబాయ్‌లో ఉద్యోగాలు: నెలకు రూ.44 వేల వరకు జీతం.. అక్టోబర్ 4న ఇంటర్వ్యూలు.. తెలంగాణ వాళ్లకే అవకాశం
- ●One Nation One Election | ఒకే దేశం..ఒకే ఎన్నిక.. 2029లోనా ? 2034లోనా?
- ●Faria Abdullah | డైరెక్షన్ వైపు ఫరియా చూపు.. స్క్రిప్ట్ పనిలో చిట్టీ బిజీబిజీ..!
- ●Dead Rat in Dosa Mumbai | హోటల్లో మసాలా దోశ తింటుండగా షాక్: లోపల చచ్చిన ఎలుక.. వాంతులు చేసుకున్న కస్టమర్
- ●KTR | కేవలం ఎంపీ సీట్లను పెంచడంలో అంతర్యమేంటి..?

Janhvi Kapoor | గ్లామర్‌కు దూరంగా.. జాన్వీ కొత్త అడుగులు!

TOMCOM Dubai Jobs | దుబాయ్‌లో ఉద్యోగాలు: నెలకు రూ.44 వేల వరకు జీతం.. అక్టోబర్ 4న ఇంటర్వ్యూలు.. తెలంగాణ వాళ్లకే అవకాశం

One Nation One Election | ఒకే దేశం..ఒకే ఎన్నిక.. 2029లోనా ? 2034లోనా?

Faria Abdullah | డైరెక్షన్ వైపు ఫరియా చూపు.. స్క్రిప్ట్ పనిలో చిట్టీ బిజీబిజీ..!






