Hyderabad | హైదరాబాద్‌లో మరో నాలుగు చెరువుల అభివృద్ధి.. 227 కోట్లతో తొలిదశ పనులు
Hyderabad | హైదరాబాద్‌లోని (Hyderabad) నాలుగు పెద్ద చెరువులను హుస్సేన్‌సాగర్‌ను (Hussain Sagar) తలపించేలా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఇందులో భాగంగా రూ.227.98 కోట్లకు పరిపాలనా అనుమతులు ఇచ్చింది.
Hyderabad | త్రినేత్ర.న్యూస్: హైదరాబాద్‌లోని (Hyderabad) నాలుగు పెద్ద చెరువులను హుస్సేన్‌సాగర్‌ను (Hussain Sagar) తలపించేలా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఇందులో భాగంగా రూ.227.98 కోట్లకు పరిపాలనా అనుమతులు ఇచ్చింది. నగరంలోని ఫాక్స్‌సాగర్ (Fox Sagar), అమీన్‌పూర్, అంబీర్ చెరువు (Ambir Cheruvu), సరూర్‌నగర్ చెరువుల అభివృద్ధికి ఐఐటీ హైదరాబాద్ భాగస్వామ్యంతో హైడ్రా (HYDRAA), హెచ్‌ఎండీఏ అధికారులు రూ.536 కోట్లతో ప్రతిపాదనలు రూపొందించారు. ఈ పనులను మూడు దశల్లో పూర్తి చేయనున్నారు.
మొదటి దశలో చెరువు కట్టను బలోపేతం చేయడం, రోడ్ల నిర్మాణం, ఇతరత్రా ప్రధాన పనులు, రెండో దశలో పార్కులు, ఇతర అభివృద్ధి పనులు, మూడో దశలో సుందరీకరణ పనులు చేపట్టనున్నారు. దీనిని పరిశీలించిన పురపాలక శాఖ తొలి దశ కింద రూ.227 కోట్లకు అనుమతులు ఇచ్చింది. ఈ నిధులను చెరువుల పునరుద్ధరణ, సమగ్ర అభివృద్ధి పనులకు ఈ నిధులు ఖర్చు చేయనున్నట్లు పేర్కొంది. రూ.74.35 కోట్లతో జీడిమెట్ల ఫాక్స్ సాగర్, రూ.68 కోట్లతో అమీన్‌పూర్ చెరువు (Ameenpur Lake), రూ.35 కోట్లతో అంబీర్ చెరువు (భాగ్‌మీర్), రూ.50.63 కోట్లతో సరూర్‌నగర్ చెరువును (Saroornagar Lake) అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపింది. ఇక రెండో దశలో రూ.147.46 కోట్లు, మూడో దశలో సుందరీకరణ పనులకు రూ.161.06 కోట్లు వెచ్చించనున్నారు. అదేవిధంగా ఫాక్స్‌సాగర్ ఎగువన 40 ఎకరాల భూములకు సంబంధించిన భూ వినియోగ మార్పిడి ఉత్తర్వులను ప్రభుత్వం రద్దు చేసింది.
Hyderabad's Four Major Lakes Set for a Hussain SagarStyle Makeover. Phase-1 Gets ₹227.98 Cr Approval
▪️ Fox Sagar
▪️ Ameenpur Lake
▪️ Ambir Cheruvu
▪️ Saroornagar Lake▪️ ₹536 Cr development plan prepared by HYDRAA, HMDA & IIT Hyderabad
▪️ Land use conversion orders for 40… pic.twitter.com/vFPlnsHwCy— hyderabad updates (@hydinfra) July 14, 2026
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Jio | జియో ఇంటర్నేషనల్ రోమింగ్ ప్లాన్లలో భారీ మార్పులు.. అదే ధరకు 4 రెట్లు ఎక్కువ డేటా..
- ●Revanth Reddy | కేంద్ర మంత్రులు గడ్కరీ, రామ్మోహన్ నాయుడితో సీఎం రేవంత్ భేటీ..
- ●Amarnath Yatra | అమర్నాథ్ యాత్రకు పోటెత్తుతున్న భక్తులు.. 11 రోజుల్లోనే 2.75 లక్షల మంది దర్శనం
- ●Jana Nayagan vs Sigma | తండ్రితో బాక్సాఫీస్ ఫైట్ - తనయుడి త్యాగం - దళపతి విజయ్ కొడుకు డెబ్యూ మూవీ వాయిదా?
- ●Prashant Kishor | రూ. 5.77 కోట్ల అప్పులు, కారు లేదు, ఎనిమిది క్రిమినల్ కేసులు.. ప్రశాంత్ కిషోర్ ఆస్తుల వివరాలు
- ●NCL Recruitment | నార్తర్న్ కోల్డ్ఫీల్డ్స్లో 259 మైనింగ్ సిర్దార్, సర్వేయర్ ఉద్యోగాలు..

Jio | జియో ఇంటర్నేషనల్ రోమింగ్ ప్లాన్లలో భారీ మార్పులు.. అదే ధరకు 4 రెట్లు ఎక్కువ డేటా..

Revanth Reddy | కేంద్ర మంత్రులు గడ్కరీ, రామ్మోహన్ నాయుడితో సీఎం రేవంత్ భేటీ..

Amarnath Yatra | అమర్నాథ్ యాత్రకు పోటెత్తుతున్న భక్తులు.. 11 రోజుల్లోనే 2.75 లక్షల మంది దర్శనం

Jana Nayagan vs Sigma | తండ్రితో బాక్సాఫీస్ ఫైట్ - తనయుడి త్యాగం - దళపతి విజయ్ కొడుకు డెబ్యూ మూవీ వాయిదా?






