త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

CP Mahesh Bhagawat | శాంతి భ‌ద్ర‌త‌లు, మ‌హిళా భ‌ద్ర‌త‌, ట్రాఫిక్ స‌మ‌స్య‌కు ప్రాధాన్య‌త ఇస్తాం : సీపీ మ‌హేశ్ భ‌గ‌వ‌త్

CP Mahesh Bhagawat | హైద‌రాబాద్ న‌గ‌ర పోలీసు క‌మిష‌న‌ర్‌గా మ‌హేశ్ భ‌గ‌వ‌త్ బాధ్య‌త‌లు స్వీక‌రించారు. అదే స‌మ‌యంలో నిన్న‌టి వ‌ర‌కు సీపీగా కొన‌సాగిన వీసీ స‌జ్జ‌నార్‌కు ప‌లువురు పోలీసులు, సిబ్బంది ఘ‌నంగా వీడ్కోలు ప‌లికారు.

S

Hyderabad | Published On Nov 13, 2026, 2.22 pm IST

CP Mahesh Bhagawat | శాంతి భ‌ద్ర‌త‌లు, మ‌హిళా భ‌ద్ర‌త‌, ట్రాఫిక్ స‌మ‌స్య‌కు ప్రాధాన్య‌త ఇస్తాం :  సీపీ మ‌హేశ్ భ‌గ‌వ‌త్
Advertisement

హైద‌రాబాద్ సీపీగా బాధ్య‌త‌లు స్వీక‌రించిన మ‌హేశ్ భ‌గ‌వ‌త్‌
అనంత‌రం మీడియాతో మాట్లాడిన హైద‌రాబాద్ సీపీ

CP Mahesh Bhagawat | త్రినేత్ర న్యూస్ : హైద‌రాబాద్ న‌గ‌ర పోలీసు క‌మిష‌న‌ర్‌గా మ‌హేశ్ భ‌గ‌వ‌త్ బాధ్య‌త‌లు స్వీక‌రించారు. అదే స‌మ‌యంలో నిన్న‌టి వ‌ర‌కు సీపీగా కొన‌సాగిన వీసీ స‌జ్జ‌నార్‌కు ప‌లువురు పోలీసులు, సిబ్బంది ఘ‌నంగా వీడ్కోలు ప‌లికారు.

హైద‌రాబాద్ సీపీగా బాధ్య‌తలు స్వీక‌రించిన అనంత‌రం మ‌హేశ్ భ‌గ‌వ‌త్ మీడియాతో మాట్లాడారు. న‌గ‌ర పోలీసు క‌మిష‌న‌ర్‌గా త‌న‌ను నియ‌మించినందుకు ప్ర‌భుత్వానికి, సీఎం రేవంత్ రెడ్డికి ప్ర‌త్యేక కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. న‌గ‌రంలో ప్ర‌ధాన స‌మ‌స్య‌లైన శాంతి భద్ర‌త‌లు, మ‌హిళా భ‌ద్ర‌త‌తో పాటు ట్రాఫిక్ వంటి అంశాల‌కు ప్రాధాన్య‌త ఇస్తామ‌న్నారు. రోడ్డు ప్ర‌మాదాల్లో ప్ర‌తి ఏడాది 1.80 ల‌క్ష‌ల మంది చ‌నిపోతున్నార‌ని, ఈ విష‌యంలో ప్ర‌త్యేక చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని చెప్పారు. ఇక భూముల ధ‌ర‌లు పెరుగుతున్న క్ర‌మంలో భూ త‌గాదాలు చోటు చేసుకుంటున్నాయి. భూ త‌గాదాల‌పై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని హెచ్చ‌రించారు. త‌ర‌చూ నేరాల‌కు పాల్ప‌డుతూ శాంతి భ‌ద్ర‌త‌ల‌కు విఘాతం క‌లిగిస్తున్న వారిప‌ట్ల క‌ఠినంగా వ్య‌వ‌హ‌రిస్తామ‌న్నారు. అవ‌స‌ర‌మైతే పీడీ యాక్ట్‌లు న‌మోదు చేస్తాం.. పాత నేరస్థులపై నిఘా పెట్టడమే కాకుండా నేరాలు చేసిన వారికి శిక్ష పడేలా చూస్తాం అని సీపీ మహేష్ భగవత్ భరోసా ఇచ్చారు.

అనంతరం ఆయన గతంలో సీపీగా పనిచేసిన సీవీ ఆనంద్, సజ్జనార్‌లను అభినందించారు. వారు ప్రారంభించిన కార్యక్రమాలను కొనసాగిస్తామని చెప్పారు. అలాగే ప్రజల కోసం మరికొన్ని సేవలు తీసుకొస్తామని తెలిపారు. ‘డయల్ 112 రెస్పాన్స్ మరింత మెరుగుపరిచేలా పని చేస్తాం. వ్యవస్థికృత నేరాలకు పాల్పడుతున్న ముఠాలపై నిఘా పెడతాం. సాయంత్ర వేళల్లో నేరాలు ఎక్కువ జరుగుతున్న నేపథ్యంలో బేసిక్ పోలీసింగ్‌పై దృష్టి సారిస్తాం. సిబ్బంది పోలీస్ స్టేషన్‌లో కూర్చోవడం కాకుండా సాయంత్రం రోడ్‌పై డ్యూటీ చేసేలా చూస్తాం. పోలీసులు అక్రమ వసూళ్లకు పాల్పడితే క్రిమినల్ కేసులు బుక్ చేస్తాం. శాఖాపరమైన చర్యలూ తీసుకుంటాం. కమిషనరేట్ పరిధిలో సిబ్బంది కొరత ఉంది. దాన్ని అధిగమించేందుకు ప్రయత్నాలు చేస్తాం’ అని ఆయన పేర్కొన్నారు.

 

Advertisement
Advertisement