త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Huge Donation to TTD | టీటీడీ అన్నప్రసాదం ట్రస్టుకు హైద‌రాబాద్ భ‌క్తుడి భారీ విరాళం.. ఎన్ని కోట్లంటే!

Huge Donation to TTD | హైద‌రాబాద్‌కు చెందిన భ‌క్తుడు కొడాలి శ్రీ‌కాంత్ (Kodali Srikanth) తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం ప‌ట్ల త‌న‌కున్న భ‌క్తిభావాన్ని చాటుకున్నారు.

S

Telangana | Published On Nov 13, 2026, 2.41 pm IST

Huge Donation to TTD | టీటీడీ అన్నప్రసాదం ట్రస్టుకు హైద‌రాబాద్ భ‌క్తుడి భారీ విరాళం.. ఎన్ని కోట్లంటే!
Advertisement

Huge Donation to TTD | త్రినేత్ర న్యూస్: హైద‌రాబాద్‌కు చెందిన భ‌క్తుడు కొడాలి శ్రీ‌కాంత్ (Kodali Srikanth) తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం ప‌ట్ల త‌న‌కున్న భ‌క్తిభావాన్ని చాటుకున్నారు. టీటీడీ (TTD) నిర్వహిస్తున్న వేంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్టు(Annadanam Trust) కు శుక్ర‌వారం ఆయ‌న‌ రూ.10 కోట్ల భారీ విరాళం (Huge Donation )అంద‌జేశారు. తిరుమల శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో టీటీడీ అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరికి చెక్కును అందజేసి సంతోషం వ్య‌క్తం చేశారు. దాత కొడాలి శ్రీకాంత్‌ను అదనపు ఈవో ఈ సందర్భంగా అభినందించారు.

ఈ కార్యక్రమంలో టీటీడీ చీఫ్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్ (సీవీఎస్వో) మురళీకృష్ణ పాల్గొన్నారు.

Advertisement
Advertisement