Penny Stocks | కాసుల వర్షం కురిపిస్తున్న పెన్నీ స్టాక్స్.. 6 నెలల్లో 198 శాతం లాభాలు..
Penny Stocks | చాలా మంది సాధారణంగా పెన్నీ స్టాక్స్ అంటే అంత ఎక్కువగా పట్టించుకోరు. కానీ దీర్ఘకాలంలోనే కాక స్వల్ప కాలంలోనూ ఈ స్టాక్స్ ఊహించని రాబడులను అందిస్తాయి. వీటిని చాలా మంది తక్కువగా అంచనా వేస్తుంటారు. వీటిల్లో హై రిస్క్ ఉంటుందని భావించి పెట్టుబడులకు దూరంగా ఉంటారు.
Penny Stocks | చాలా మంది సాధారణంగా పెన్నీ స్టాక్స్ అంటే అంత ఎక్కువగా పట్టించుకోరు. కానీ దీర్ఘకాలంలోనే కాక స్వల్ప కాలంలోనూ ఈ స్టాక్స్ ఊహించని రాబడులను అందిస్తాయి. వీటిని చాలా మంది తక్కువగా అంచనా వేస్తుంటారు. వీటిల్లో హై రిస్క్ ఉంటుందని భావించి పెట్టుబడులకు దూరంగా ఉంటారు. కానీ సరైన స్టాక్స్‌ను ఎంపిక చేసుకుని పెట్టుబడి పెడితే స్వల్ప కాలంలోనే భారీ మొత్తంలో లాభాలను ఆర్జించవచ్చు. గత 6 నెలల కాలంలో కొన్ని కంపెనీలకు చెందిన పెన్నీ స్టాక్స్ పెట్టుబడిదారులకు ఊహించని లాభాలను అందించాయి. ముఖ్యంగా మైక్రో క్యాప్, స్మాల్ క్యాప్ పెన్నీ షేర్లు తమ ఇన్వెస్టర్లకు లాభాలను తెచ్చి పెట్టాయి. ఏకంగా 198 శాతం వరకు పెరిగి లార్జ్ క్యాప్ స్టాక్‌లకు మించి పెట్టుబడిదారులపై కాసుల వర్షం కురిపించాయి. ఈ షేర్ల ధరలు రూ.1 నుంచి రూ.20 లోపే ఉండగా, మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.1వేయి కోట్ల లోపు కలిగి ఉన్నాయి. అయినప్పటికీ అద్భుతమైన రాబడులను అందించాయి. కొన్ని చిన్న కంపెనీలు త్రైమాసిక ఫలితాల్లో మంచి లాభాల్లోకి వచ్చాయి. దీంతో పెట్టుబడిదారులు భారీగా లాభాలను పొందారు.
6 నెలల్లో 198 శాతం లాభం..
ఆర్‌జీఎఫ్ క్యాపిటల్ మార్కెట్స్ షేర్ అధిక రాబడులను అందించింది. గత 6 నెలల వ్యవధిలో ఈ స్టాక్ ఏకంగా 198 శాతం మేర లాభాలను అందించింది. లక్ష రూపాయల పెట్టుబడిని దాదాపు రూ.3 లక్షలు చేసింది. ఈ స్టాక్ ధర ప్రస్తుతం రూ.2.47 వద్ద ఉంది. అలాగే జై మాతా గ్లాస్ కంపెనీ గత 6 నెలల కాలంలో 93 శాతం మేర రిటర్న్స్‌ను అందించింది. లక్ష రూపాయలు పెట్టుబడి పెట్టిన వారికి రూ.2 లక్షలు లభించాయి. ప్రస్తుతం ఈ స్టాక్ రూ.2.87 వద్ద కొనసాగుతోంది. అదేవిధంగా ఎంపవర్ ఇండియా కంపెనీ స్టాక్ గత 6 నెలల్లో 92 శాతం మేర లాభాలను ఇవ్వగా ఈ స్టాక్ ధర ప్రస్తుతం రూ.2.59 వద్ద ఉంది. ఎన్‌సీఎల్ రీసెర్చ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ గత 6 నెలల్లో 72 శాతం మేర పెరగ్గా, ఈ స్టాక్ ప్రస్తుతం 74 పైసల వద్ద కొనసాగుతోంది. సాధన నైట్రో కెమికల్స్ కంపెనీ షేర్ గత 6 నెలల కాలంలో 63 శాతం పెరిగింది. ఈ స్టాక్ ధర రూ.2.66 వద్ద ఉంది.
జీఏసీఎం టెక్నాలజీస్ కంపెనీ స్టాక్ గత 6 నెలల్లో 38 శాతం మేర లాభాలను అందించగా, 72 పైసల వద్ద స్టాక్ ధర ఉంది. ఎన్‌హెచ్‌సీ ఫుడ్స్ స్టాక్ ధర గత 6 నెలల్లో 34 శాతం మేర పెరగ్గా, రూ.1.68 వద్ద స్టాక్ ధర ఉంది. లా టిమ్ మెటల్ అండ్ ఇండస్ట్రీస్ షేర్ ధర 6 నెలల్లో 22 శాతం పెరిగింది. రూ.10.40 వద్ద ప్రస్తుత ధర ఉంది. అన్లోన్ హెల్త్ కేర్ షేర్ ధర 6 నెలల్లో 19 శాతం పెరగ్గా, స్టాక్ ధర ప్రస్తుతం రూ.14.62 వద్ద కొనసాగుతోంది.
సంబంధిత వార్తలు

Stock Markets | స్టాక్ మార్కెట్లకు చమురు సెగ.. భారీ నష్టాల్లో సూచీలు..
ఆగస్టు 13, 2026

Stock Markets | తీవ్ర అస్థిరతతో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. టాటా చైర్మన్ ప్రకటనతో షేర్లు భారీగా పతనం..
ఆగస్టు 12, 2026

Stock Markets | భారీగా పెరిగిన చమురు ధరలు.. నష్టాల్లో స్టాక్ మార్కెట్లు..
ఆగస్టు 12, 2026
తాజావార్తలు
- ●Kangana Ranaut | బొద్దింకలు మురికి కాలువల నుంచేగా వస్తాయి.. నేనన్నదాంట్లో తప్పేముంది..? : కంగన
- ●Indian Bank | ఇండియన్ బ్యాంకులో 700 గ్రాముల బంగారం చోరీ.. సొంతానికి వాడుకున్న అసిస్టెంట్ మేనేజర్
- ●Shakeela | నటి షకీలాకు సర్జరీ - స్మార్ట్‌ఫోన్‌కు బానిసగా మారి.... మెడ నరాలు దెబ్బతిని..
- ●Annavaram | సత్యమే దైవం.. అన్నవరంలో సత్యనారాయణుడి వైభవం
- ●Stock Markets | స్టాక్ మార్కెట్లకు చమురు సెగ.. భారీ నష్టాల్లో సూచీలు..
- ●Harish Rao | ఇంచు ప్రభుత్వ భూమిని కూడా అమ్మబోమన్న హామీ ఏమైంది రేవంత్?: హరీశ్ రావు

Kangana Ranaut | బొద్దింకలు మురికి కాలువల నుంచేగా వస్తాయి.. నేనన్నదాంట్లో తప్పేముంది..? : కంగన

Indian Bank | ఇండియన్ బ్యాంకులో 700 గ్రాముల బంగారం చోరీ.. సొంతానికి వాడుకున్న అసిస్టెంట్ మేనేజర్

Shakeela | నటి షకీలాకు సర్జరీ - స్మార్ట్‌ఫోన్‌కు బానిసగా మారి.... మెడ నరాలు దెబ్బతిని..

Annavaram | సత్యమే దైవం.. అన్నవరంలో సత్యనారాయణుడి వైభవం



