Haryana | స్కూల్‌లో మొబైల్ ఫోన్ నిషేధం.. టీచర్‌పై స్క్రూడ్రైవర్‌తో దాడి
Haryana | ఇటీవలి కాలంలో పుట్టిన బిడ్డ నుంచి మొదలుపెడితే పండు ముసలి వరకు మొబైల్ ఫోన్లతోనే గడిపేస్తున్నారు. మరి ముఖ్యంగా పాఠశాల విద్యార్థులు కూడా స్మార్ట్ ఫోన్లకు బానిస అయ్యారు.
Haryana | త్రినేత్ర.న్యూస్ : ఇటీవలి కాలంలో పుట్టిన బిడ్డ నుంచి మొదలుపెడితే పండు ముసలి వరకు మొబైల్ ఫోన్లతోనే గడిపేస్తున్నారు. మరి ముఖ్యంగా పాఠశాల విద్యార్థులు కూడా స్మార్ట్ ఫోన్లకు బానిస అయ్యారు. ఈ క్రమంలో తమ తరగతి గదుల్లోకి దొంగతనంగా మొబైల్స్ తీసుకువచ్చి వాటిల్లో మునిగిపోయి పాఠాలకు దూరమవుతున్నారు. దీంతో చాలా స్కూల్స్ మొబైల్స్ వినియోగంపై నిషేధం విధిస్తున్నాయి. హర్యానా సిర్సా జిల్లాలోని జమాల్ గ్రామంలోని ప్రభుత్వ సీనియర్ సెకండరీ పాఠశాలలోనూ విద్యార్థుల మొబైల్స్‌పై నిషేధం విధించారు.
అయితే స్కూల్ టీచర్ సునీల్ బిరాత్.. విద్యార్థుల హోం వర్క్ తనిఖీ చేస్తుండగా ఓ విద్యార్థి వెనుకాల నుంచి వచ్చి ఆ టీచర్‌పై స్క్రూ డ్రైవర్‌తో దాడి చేశాడు. టీచర్ మెడపై విచక్షణారహితంగా దాడి చేసి తీవ్రంగా గాయపరిచినట్లు స్కూల్ ప్రిన్సిపాల్ ప్రతాప్ చక్రవర్తి వెల్లడించారు. అనంతరం సదరు విద్యార్థి పారిపోయినట్లు పేర్కొన్నారు.
తీవ్ర గాయాలపాలైన టీచర్‌ను చికిత్స నిమిత్తం కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉండడంతో సిర్సా జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
సంబంధిత వార్తలు

Faridabad Teacher | 30 సెకన్లలో 34 కత్తిపోట్లు.. స్కూల్ టీచర్‌పై వ్యక్తి పైశాచిక దాడి
ఆగస్టు 4, 2026

CM Revanth Reddy | నేనేందుకు రాజీనామా చేయాలి.. 2034 వరకు నేనే సీఎం
జులై 30, 2026

Rajasthan High Court | విద్యార్థిని టీచర్ మందలించడం ఆత్మహత్యకు ప్రేరేపించడం కాదు : రాజస్థాన్ హైకోర్టు
జులై 28, 2026
తాజావార్తలు
- ●Naga Durga | ఓటీటీలో నాగదుర్గ తమిళ రొమాంటిక్ కామెడీ మూవీ ట్రెండింగ్ - హయ్యెస్ట్ వ్యూస్‌తో రికార్డ్
- ●Flight Hit By Turbulence | ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు.. 12 మందికి గాయాలు
- ●LIC | ఎల్ఐసీలో భారీ వాటా విక్రయం.. రూ.31 వేల కోట్ల లక్ష్యంతో కేంద్రం ఓఎఫ్ఎస్ ప్రారంభం
- ●Samsung Galaxy F70 Pro 5G | తక్కువ ధరకే శాంసంగ్ కొత్త మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్.. భారీ బ్యాటరీ, 6 ఏళ్ల వరకు అప్డేట్స్..
- ●DK Shivakumar | రాజీనామా చేస్తే.. క్షణం ఆలోచించకుండా ఆమోదిస్తా.. అసమ్మతి ఎమ్మెల్యేలకు డీకే స్ట్రాంగ్ వార్నింగ్
- ●హలీమ్ నుండి ఇక్కత్ వరకు: ప్రపంచ మార్కెట్లను ఏలుతున్న 'జీఐ ట్యాగ్' ఉత్పత్తుల కథ!

Naga Durga | ఓటీటీలో నాగదుర్గ తమిళ రొమాంటిక్ కామెడీ మూవీ ట్రెండింగ్ - హయ్యెస్ట్ వ్యూస్‌తో రికార్డ్

Flight Hit By Turbulence | ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు.. 12 మందికి గాయాలు

LIC | ఎల్ఐసీలో భారీ వాటా విక్రయం.. రూ.31 వేల కోట్ల లక్ష్యంతో కేంద్రం ఓఎఫ్ఎస్ ప్రారంభం

Samsung Galaxy F70 Pro 5G | తక్కువ ధరకే శాంసంగ్ కొత్త మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్.. భారీ బ్యాటరీ, 6 ఏళ్ల వరకు అప్డేట్స్..



