Special Trains | పండుగల వేళ ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే గుడ్‌న్యూస్.. ఈ రూట్‌లో భారీగా ప్రత్యేక రైళ్లు..!
Special Trains | పండుగల వేళ ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. వివిధ ప్రాంతాల మధ్య నడుస్తున్న వీక్లీ ప్రత్యేక రైళ్ల సర్వీసులను పొడిగించింది. దసరా, దీపావళి, ఛత్ పూజల సందర్భంగా పెరిగే అదనపు రద్దీని దృష్టిలో పెట్టుకొని మొత్తం 98 ప్రత్యేక సర్వీసులు అందుబాటులోకి ఉంచనుంది.
Special Trains | పండుగల వేళ ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. వివిధ ప్రాంతాల మధ్య నడుస్తున్న వీక్లీ ప్రత్యేక రైళ్ల సర్వీసులను పొడిగించింది. దసరా, దీపావళి, ఛత్ పూజల సందర్భంగా పెరిగే అదనపు రద్దీని దృష్టిలో పెట్టుకొని మొత్తం 98 ప్రత్యేక సర్వీసులు అందుబాటులోకి ఉంచనుంది. అక్టోబర్ 1 నుంచి నవంబర్ 30 వరకు ప్రత్యేక రైళ్లను పొడిగిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది.
సికింద్రాబాద్–నహర్‌లగున్ (07046/07047) రైలును సికింద్రాబాద్ నుంచి నహర్‌లగున్‌కు వెళ్లే రైలు అక్టోబర్ 2 నుంచి 30 వరకు ఐదు సర్వీసులు నడుస్తుంది. తిరుగు ప్రయాణంలో నహర్‌లగున్–సికింద్రాబాద్ రైలు అక్టోబర్ 5 నుంచి నవంబర్ 2 వరకు అందుబాటులో ఉంటుందని పేర్కొంది. అలాగే, హైదరాబాద్–కొల్లాం (07193/07194) రైలులు అక్టోబర్ 3 నుంచి నవంబర్ 28 వరకు రాకపోకలు సాగిస్తుంది. తిరుగు ప్రయాణంలో కొల్లాం–హైదరాబాద్ రైలు అక్టోబర్ 5 నుంచి నవంబర్ 30 వరకు నడువనుంది. సికింద్రాబాద్–శ్రీకాకుళం రోడ్ (07425/07426) సికింద్రాబాద్–శ్రీకాకుళం రోడ్ ప్రత్యేక రైలు అక్టోబర్ 4 నుంచి నవంబర్ 29 వరకు తొమ్మిది సర్వీసులు నడుస్తుంది. తిరుగు ప్రయాణంలో శ్రీకాకుళం రోడ్–సికింద్రాబాద్ రైలు అక్టోబర్ 5 నుంచి నవంబర్ 30 వరకు తొమ్మిది సర్వీసులు అందుబాటులో ఉంటుంది.
చర్లపల్లి–తిరువణ్ణామలై (07001/07002) చర్లపల్లి–తిరువణ్ణామలై ప్రత్యేక రైలు అక్టోబర్ 1 నుంచి నవంబర్ 26 వరకు తొమ్మిది సర్వీసులు నడుస్తుంది. తిరుగు ప్రయాణంలో తిరువణ్ణామలై–చర్లపల్లి రైలు అక్టోబర్ 2 నుంచి నవంబర్ 27 వరకు సర్వీసులు రాకపోకలు సాగిస్తున్నాయి. జల్నా–తిరుపతి (07814/07815) జల్నా–తిరుపతి ప్రత్యేక రైలు అక్టోబర్ 1 నుంచి నవంబర్ 26 వరకు నడువనున్నది. తిరుగు ప్రయాణంలో తిరుపతి–జల్నా రైలు అక్టోబర్ 2 నుంచి నవంబర్ 27 వరకు సర్వీసులు అందుబాటులో ఉండనుంది. నాందేడ్–తిరుచానూర్ (07603/07604) రైలు అక్టోబర్ 6 నుంచి నవంబర్ 24 వరకు ఎనిమిది సర్వీసులు నడుస్తుంది. తిరుగు ప్రయాణంలో తిరుచానూర్–నాందేడ్ రైలు అక్టోబర్ 7 నుంచి నవంబర్ 25 వరకు నడవనుంది. ప్రత్యేక రైలు సేవలను ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని దక్షిణ మధ్య రైల్వే కోరింది.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Omar Abdullah | కశ్మీరీలు జైల్లో ఉండాలని కాంగ్రెస్ కోరుకుంటోందా..? : వందేమాతరం ఆలాపనపై మిత్రపక్షాన్ని ప్రశ్నించిన సీఎం ఒమర్ అబ్దుల్లా
- ●TG Assembly | సభలో మాట్లాడలేకే బీఆర్ఎస్ నేతల డైవర్షన్ పాలిటిక్స్: ప్రభుత్వ విప్ బల్మూర్ వెంకట్
- ●Vakiti Srihari | గోపాలమిత్రల సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తున్నం
- ●Priya Bhavani Shankar | ఇరుముడి సక్సెస్ మీట్లో కిందపడిపోయిన హీరోయిన్ - వీడియో వైరల్
- ●Road Accident | మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం.. 14 మంది మృతి
- ●TG Weather | తెలంగాణలో మూడురోజులు భారీ వర్షాలు.. హెచ్చరించిన వాతావరణశాఖ

Omar Abdullah | కశ్మీరీలు జైల్లో ఉండాలని కాంగ్రెస్ కోరుకుంటోందా..? : వందేమాతరం ఆలాపనపై మిత్రపక్షాన్ని ప్రశ్నించిన సీఎం ఒమర్ అబ్దుల్లా

TG Assembly | సభలో మాట్లాడలేకే బీఆర్ఎస్ నేతల డైవర్షన్ పాలిటిక్స్: ప్రభుత్వ విప్ బల్మూర్ వెంకట్

Vakiti Srihari | గోపాలమిత్రల సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తున్నం

Priya Bhavani Shankar | ఇరుముడి సక్సెస్ మీట్లో కిందపడిపోయిన హీరోయిన్ - వీడియో వైరల్





